జనవరి 1, 2025 నుంచి ఇండియాలో బిజినెన్లు కఠినమైన జీఎస్టీ నిబంధనలతో నిర్వహించాల్సి ఉంటుంది. అవేంటో ఒక్కొక్కటి వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.
మల్టీ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (MFA): జీఎస్టీ పోర్టల్స్‌లో సేఫ్టీని పెంచడానికి ఇకపై పన్ను చెల్లించే వారందరికీ MFA అవసరం.
ఇ-వే బిల్ లిమిటేషన్స్: 180 రోజుల కంటే పాత ప్రాథమిక డాక్యుమెంట్లకు మాత్రమే ఇ-వే బిల్‌లను రూపొందించవచ్చు. మోసాలను తగ్గించడం కోసమే ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు.
థాయిలాండ్ దేశం గ్లోబల్ ఇ-వీసా ప్లాట్‌ఫామ్ www.thaievisa.go.thను ప్రారంభించనుంది. దీని ద్వారా ఇండియన్స్ సహా అంతర్జాతీయ ప్రయాణికులు ఆన్‌లైన్‌లో వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డైరెక్ట్ గా డాక్యుమెంట్లు సమర్పించక్కరలేదు. పర్యాటకులకు సింపుల్ విధానంలో ఆ దేశానికి వెళ్లిపోవచ్చు.
జనవరి 1, 2025 నుంచి భారతదేశంలోని మైగ్రేటెడ్ వీసా దరఖాస్తుదారులు ఎక్స్‌ట్రా ఫీజు లేకుండా ఒకసారే తమ US వీసా అపాయింట్‌మెంట్‌లను రీషెడ్యూల్ చేసుకోవచ్చు. దీని వల్ల H-1B వీసా ప్రాసెస్ అప్ గ్రేడ్ అవుతుంది. దీని వల్ల భారతీయ F-1 వీసా హోల్డర్‌లకు మరింత సౌకర్యం కలుగుతుంది. అయితే B1/B2 వీసా అపాయింట్‌మెంట్‌ల కోసం వెయిటింగ్ టైమ్ ఇంకా 400 రోజులకు పైగా ఉంది.
కలకత్తాలోని ఐటీసీ సంస్థ, నియంత్రణ అనుమతుల తర్వాత, జనవరి 1, 2025 నుంచి తన హోటల్ వ్యాపారాన్ని అధికారికంగా సెపరేట్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల హోటల్ వ్యాపారంలో లోపాలు తెలుసుకొని డవలప్ చేయడానికి అవకాశం ఉంటుందని ఐటీసీ భావిస్తోంది.
కొత్త రైట్ ఆఫ్ వే (RoW) నిబంధనలు అమల్లోకి వస్తాయి. భూగర్భ కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాల ఏర్పాటు, నిర్వహణను మెరుగుపరుస్తాయి. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్, బిఎస్ఎన్ఎల్ వంటి టెలికాం కంపెనీలు ఈ నిబంధనలను ఉపయోగించి తమ సేవలను మెరుగుపరుస్తాయి.
జనవరి 1, 2025 నుంచి అనేక పాత ఆండ్రాయిడ్ ఫోన్లలో WhatsApp పనిచేయడం ఆగిపోతుంది. Samsung Galaxy S3, LG Nexus 4, HTC One X, Moto G వంటి మోడల్స్ ఇందులో ఉన్నాయి. గడువు ముగిసేలోపు ముఖ్యమైన చాట్‌లు, డేటాను బ్యాకప్ చేసుకోవాలని యూజర్లకు ఆయా కంపెనీలు సూచించాయి.