ఇండియాలో టాప్‌ 10 రిచెస్ట్‌ టెంపుల్స్‌ ఇవే.. సెకండ్‌ ప్లేస్‌లో తిరుమల.. మరి ఫస్ట్‌ ప్లేస్‌ ఏది?

First Published | Jul 23, 2024, 9:16 AM IST

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ఇతర దేశాల కంటే భిన్నంగా ఉంటాయి. ప్రతిదీ పూర్వీకుల నుంచి వచ్చిన ఆచార వ్యవహారాలతో ముడిపడి ఉంటుంది. ప్రత్యేకించి హిందువులైతే తాము చేసే ప్రతి పనిలో దైవాన్ని తలుచుకుంటారు. ఏదైనా కొత్త పని, వ్యాపారం, ఉద్యోగం ప్రారంభించినా, వాటిలో విజయవంతమైనా ఆలయానికి వెళ్లి దైవాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా చాలా మంది భావిస్తుంటారు. ఇలా ఆలయాలకు వెళ్లిన భక్తులు మొక్కులు, కానుకలు సమర్పిస్తుంటారు. పలు ఆలయాలైతే వివిధ పూజలు, పథకాల కింద విరాళాలు కూడా సేకరిస్తుంటారు. అలాగే, ప్రత్యేకించి భారతదేశంలో కొన్ని ఆలయాలకు నిత్యం భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ప్రతిరోజు వేలాది మంది, ప్రత్యేకించి కొన్ని పండుగల రోజుల్లో అయితే లక్షల మంది దైవ దర్శనం కోసం ఆలయాలకు చేరుకుంటారు. ఇలా భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కులు, విరాళాలే ఆలయాలకు ఆదాయంగా ఉంటుంది. ఈ ఆదాయం కొన్ని ఆలయాలకు తక్కువగా ఉంటుంది, మరికొన్నిటికి భారీగా ఉంటుంది. మరి ఇండియాలో టాప్‌ 10 రిచెస్ట్‌ టెంపుల్స్‌ ఏమున్నాయో తెలుసుకుందామా..

10. శబరిమల, అయ్యప్పస్వామి

కేరళ రాష్ట్రంలోని శబరిమలలో కొలువై ఉన్న  హరిహర సుత అయ్యప్ప స్వామిని దర్శించడం కోసం ఏటా  కోట్ల మంది భక్తులు తరలివస్తారు. ముఖ్యంగా డిసెంబర్, జనవరి నెలల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయం వార్షిక ఆదాయం 10 మిలియన్ డాలర్లు. అంటే రూ.83.66 కోట్ల పైమాటే.

9. కాశీ విశ్వనాథ ఆలయం

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి కొలువై ఉన్న కాశీ విశ్వనాథుని క్షేత్రం హిందువులు పరమ పవిత్రంగా భావించే ఆలయం. ప్రధాని మోదీ వారణాసి నుంచి పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆలయాన్ని కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేశారు. ఈ ఆలయానికి ఏటా 40 మిలియన్ డాలర్లు అంటే 334.59కోట్లు ఆదాయం వస్తుంది.

Latest Videos


8. పూరి జగన్నాథ్ ఆలయం ఒడిశా

ఒడిశాలోని పూరిలో కొలువైన పుణ్యక్షేత్రం శ్రీ జగన్నాథుని ఆలయం. ఆలయ రికార్డుల ప్రకారం, అవంతి రాజు ఇంద్రద్యుమ్నుడు పూరీలో జగన్నాథుని ప్రధాన ఆలయాన్ని నిర్మించాడు. శ్రీకృష్ణుని గుండె ఈ ఆలయంలోని మూలవిరాట్ లో భద్రంగా ఉందని, ఇప్పటికీ అది కొట్టుకుంటూ ఉంటుందని భక్తులు విశ్వాసం. అందుకే ఏటా లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తారు. పూరి జగన్నాథ రథయాత్ర ఎంతో ఫేమస్. ఈ ఆలయం వార్షికాదాయం 50 మిలియన్ డాలర్లకు పైగా ఉంది. అంటే 418 కోట్ల పైమాటే.

7. మీనాక్షి దేవాలయం, మధురై

తమిళనాడులోని మధురైలో 
అద్భుతమైన శిల్పకళా సౌందర్యానికి ప్రసిద్ధి శ్రీ మీనాక్షి అమ్మవారి ఆలయం. అందుకే దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. ఏటా 60 మిలియన్ డాలర్లు (రూ.501.84 కోట్లు) ఆదాయంగా సమకూరుతోందని తెలుస్తోంది.  
 

6.గోల్డెన్ టెంపుల్, పంజాబ్

ఈ ఆలయం పేరుకు తగ్గట్టుగానే మొత్తం బంగారు తాపడాలతో దగదగా మెరిసిపోతూ ఉంటుంది. సుమారు 400 కిలోల బంగారాన్ని ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించారు. ఈ స్వర్ణ దేవాలయం వార్షిక ఆదాయం  500 కోట్ల రూపాయలు.

5.సిద్ధి వినాయక ఆలయం, మహారాష్ట్ర

ముంబై నగరం లో ఉన్న ఈ గణేషుడి ఆలయం దిన దినాభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా గణపతి నవరాత్రుల్లో ఇక్కడ జరిగే వేడుకలు దేశవ్యాప్తంగా ఫేమస్. భక్తుల విరాళాలు, కానుకలు ద్వారా ఏటా ఈ గుడికి వచ్చే ఆదాయం 25 మిలియన్ డాలర్లు (రూ.209కోట్లు)గా ఉంది. 

4. వైష్ణో దేవి ఆలయం, జమ్మూ కాశ్మీర్

దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులతో ఈ ఆలయం ఎల్లప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. వార్షిక ఆదాయం 70 మిలియన్ డాలర్ల (రూ.585.54కోట్లు) తో ఈ ఆలయం నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

షిరిడి సాయిబాబా ఆలయం, మహారాష్ట్ర

 మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబు ఆలయానికి ఏటా సుమారు 100 మిలియన్ డాలర్ల (రూ.836కోట్లు) విలువ చేసే విరాళాలు, కానుకలు భక్తుల ద్వారా అందుతున్నాయి. 
 

2. తిరుమల తిరుపతి దేవస్థానం, ఆంధ్రప్రదేశ్

అనంత పద్మనాభ స్వామి ఆలయ సంపద వెలుగుచూడనంత వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రథమ స్థానంలో ఉండేది. ప్రస్తుతం ఏటా సుమారు 2.5 బిలియన్ డాలర్ల(రూ.1450 కోట్లు) వార్షిక ఆదాయంతో రెండో స్థానంలో నిలిచింది. ప్రతిరోజు సుమారు మూడు కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని  తి.తి.దే. గణాంకాల ద్వారా తెలుస్తోంది.

1. అనంత పద్మనాభస్వామి ఆలయం, కేరళ

కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్న ఈ ఆలయంలోని ఆరు నేల మాలికల్లో(గదులు)ఇప్పటివరకు లెక్కించిన ఆదాయం విలువ 1,20,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.  కలియుగం ఆరంభమైన 950వ రోజు తుళువంశ బ్రాహ్మణ  ఋషి దివాకరముని సారథ్యంలో విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ నిర్మాణం జరిగినట్లు తాళపత్ర గ్రంథాల ఆధారంగా తెలుస్తుంది. ఆలయం లోపల 80 ధ్వజ స్తంభాలు ఉండటం ఇక్కడ విశేషం.

click me!