Budget Terms: ఈ 20 పదాల గురించి మీకు తెలిస్తే.. బడ్జెట్‌ ఈజీగా అర్థమైపోతుంది

First Published | Jul 23, 2024, 1:23 AM IST

కేంద్ర బడ్జెట్‌ భారతీయులందరూ కోటి ఆశలతో ఎదురుచూస్తుంటారు. ఏ రంగానికి ఎంత కేటాయిస్తారు..? కొత్తగా ఏ పథకం ప్రకటిస్తారు? అని చాలామంది చూస్తారు. మరి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడూ తరచూ వినే ఆ పదాలకు అర్థం తెలుసా మీకు.

budget

ఇల్లు సక్రమంగా నడవాలన్నా, గడవాలన్నా ఓ మంచి ప్రణాళిక ఉండాలి. మంచి ప్లానింగ్‌ ఏది చేసినా కచ్చితంగా సక్సెస్‌ అవుతుంది. రోజువారీ లేదా నెలవారీగా వచ్చే ఆదాయం, అయ్యే ఖర్చులను బ్యాలెన్స్‌ చేసుకోవాలంటే తప్పనిసరిగా ప్లానింగ్‌ ఉండాలి. ఆ ప్లానింగ్‌ తప్పితే అంతా రివర్స్‌ అవుతుంది. అంతా అప్పుల పాలై, ఇల్లు గుల్లవుతుంది. ఒళ్లు హూనమవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే మంచి ప్లానింగ్‌ ఉండాలి. ఈ ప్లానింగ్‌నే బడ్జెట్‌ అంటారు. ఇంటికైనా, కంపెనీకైనా, రాష్ట్రానికైనా, దేశానికైనా బడ్జెట్‌లో కేటాయింపులు, లెక్కులు సరిగ్గా ఉంటే అంతా సవ్యంగా నడుస్తుంది. లేదంటే బతకు బస్టాండై పోతుంది. అతి వ్యక్తి కావచ్చు, కంపెనీ లేదా రాష్ట్రం, దేశం. ఆదాయానికి తగ్గట్టు ఖర్చు చేస్తే అంతా బాగుంటుంది. అప్పులు చేస్తే వడ్డీలు కట్టడానికి జీవితం సరిపోతుంది. 

Union Budget 2024

ఇక, కేంద్ర బడ్జెట్‌ భారతీయులందరూ కోటి ఆశలతో ఎదురుచూస్తుంటారు. ఏ రంగానికి ఎంత కేటాయిస్తారు..? కొత్తగా ఏ పథకం ప్రకటిస్తారు? టాక్స్‌ బెనిఫిట్స్‌ ఏమైనా ఉంటాయా..? ఫ్రీ స్కీమ్స్‌ అనౌన్స్‌ చేస్తారా? ఉపాధి హామీ కూలీలైతే వేతనం పెంచుతారా? రైతులతో సబ్సిడీలు, రుణాలు ఏమైనా ఇస్తారా? అని చూస్తారు. అయితే, పార్లమెంటులో మాత్రం రెవెన్యూ ఇంత, ఎక్స్‌పెండిచర్‌ ఇన్ని కోట్లు, మూలధన వ్యయం ఇన్ని కోట్లు, ఆర్థిక సమీకరణలు ఇవీ అని చదివేస్తుంటారు. కోట్లు, నంబర్లు తెలుస్తాయ్‌ కానీ, బడ్జెట్‌లో చదివే పదాలకు అర్థం తెలియక కన్ఫ్యూజ్‌ అవుతుంటాం. ఆ పదాలకు అర్థం తెలిస్తే బడ్జెట్‌ మొత్తం సులభంగా అర్థం చేసుకోవచ్చు. అవేంటంటే.... 

Latest Videos


బడ్జెట్ అంటే ఏమిటి?

బడ్జెట్ అనేది ఒక ప్రణాళిక. ఇది ఒక నిర్దిష్ట కాలానికి ఆదాయాలు, ఖర్చుల అంచనాలను కలిగి ఉంటుంది. అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణంగా సంవత్సరానికి బడ్జెట్‌ వేస్తాయి. ఇది వ్యక్తులు, కుటుంబాలు, వ్యాపారాలు, ప్రభుత్వాలు తమ ఆదాయాలు, వ్యయాలను సమన్వయం చేయడానికి ఉపయోగించే సాధనం. బడ్జెట్ ప్రక్రియలో ఆదాయాలు, వ్యయాలు, పెట్టుబడులు, ఆదాయ వనరులు లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

ఆదాయం (Revenue)

ఒక నిర్దిష్ట కాలంలో వ్యక్తులు, వ్యాపార సంస్థలు లేదా ప్రభుత్వాలు పొందే మొత్తం డబ్బు లేదా వనరులను ఆదాయం అంటారు. ఆదాయాలు వివిధ వనరుల నుంచి రావచ్చు. ఉదాహరణకు వేతనం, వడ్డీలు, లాభాలు, పన్నులు, ఫీజులు.

ఖర్చు (Expenditure)

ఒక నిర్దిష్ట కాలంలో వ్యక్తులు, వ్యాపారాలు లేదా ప్రభుత్వాలు ఖర్చు చేసే మొత్తం డబ్బును వ్యయం లేదా ఖర్చు అంటాం. ఖర్చులు రెండు రకాలుగా ఉండవచ్చు. రాజ్యాంగ ఖర్చులు (ప్రత్యక్ష సేవలు, వేతనాలు), పెట్టుబడి ఖర్చులు (మూలధనం పెట్టుబడులు, ఆస్తులు కొనుగోలు).

మిగులు (Surplus)

ఖర్చులను మించి ఆదాయాలు వచ్చినప్పుడు మిగులు ఏర్పడుతుంది. అంటే ఆదాయం ఖర్చులను మించిన సందర్భంలో ఉండే అదనపు డబ్బే మిగులు.

లోటు (Deficit)

ఖర్చులు ఆదాయాలను మించినప్పుడు లోటు ఏర్పడుతుంది. సంస్థలు లేదా ప్రభుత్వాల ఆదాయాలను ఖర్చులు మించిన సందర్భంలో ఉండే తేడానే లోటు.

Budget types

తాత్కాలిక బడ్జెట్ (Interim Budget/Provisional Budget): సాధారణ బడ్జెట్‌కు ముందుగా తీసుకునే తాత్కాలిక ప్రణాళిక. ఇది సాధారణంగా ఒక స్వల్పకాలం కోసం ఉంటుంది. సాధారణ బడ్జెట్ ఏర్పడే వరకు ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగించడానికి ఇది అవసరం.


వార్షిక బడ్జెట్ (Annual Budget): సంవత్సరానికి సంబంధించిన ఆదాయ, వ్యయాల పూర్తి ప్రణాళికే వార్షిక బడ్జెట్‌. ఇది సాధారణంగా ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు రూపొందిస్తారు. రాష్ట్ర బడ్జెట్‌ అయితే అసెంబ్లీలో, కేంద్ర బడ్జెట్‌ అయితే పార్లమెంటులో ప్రవేశపెడతారు. 
 

పన్ను ఆదాయం (Tax Revenue)

ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఇది. ఇందులో వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను, అమ్మకపు పన్ను, సేవా పన్ను, కస్టమ్స్ డ్యూటీలు తదితర పన్నులు ఉంటాయి.

రాయితీలు (Subsidies)

ప్రభుత్వాలు ప్రోత్సహించడం కోసం నిర్దిష్ట రంగాలకు లేదా వ్యక్తులకు ఇచ్చే డబ్బునే రాయితీ అంటారు. రాయితీలు సాధారణంగా వ్యవసాయం, విద్య, ఆరోగ్య సంరక్షణ లాంటి ముఖ్య రంగాలకు ఉంటాయి.

ఆస్తులు (Assets)

వ్యక్తులు, వ్యాపారాలు లేదా ప్రభుత్వాలు కలిగిన విలువైన వనరులనే ఆస్తులుగా పరిగణిస్తారు. ఆస్తులు రెండు రకాలు. అవి స్థిర ఆస్తులు (భూమి, భవనాలు..), చర అస్తులు (కరెన్సీ, స్టాక్స్..).

అప్పులు (Liabilities)

వ్యక్తులు, వ్యాపారాలు లేదా ప్రభుత్వాలు ఇతరులకు చెల్లించాల్సిన మొత్తాలు. అప్పులను సుదీర్ఘకాల అప్పులు, తాత్కాలిక లేదా స్వల్పకాల అప్పులుగా విభజించారు.

మూలధనం (Capital)

వ్యాపారాలు లేదా ప్రభుత్వాలు పెట్టుబడుల కోసం వినియోగించే డబ్బు. భవిష్యత్ ఆర్థిక లాభాల కోసం చేసే పెట్టుబడులనే మూలధనం అంటారు. మూలధనం పెట్టుబడులు (భవనాలు, యంత్రాలు)లో ఉంటుంది.

ఆదాయ వ్యయం (Revenue Expenditure)

సాధారణ కార్యకలాపాలకు సంబంధించిన ఖర్చులను రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. ఉదాహరణకు, వేతనాలు, సాధారణ నిర్వహణ ఖర్చులు.

మూలధన వ్యయం (Capital Expenditure)

మూలధన వ్యయం అనేది యంత్రాలు, పరికరాలు, భవనాలు, ఆరోగ్య సౌకర్యాలు, విద్య మొదలైన వాటి అభివృద్ధికి ప్రభుత్వం వెచ్చించే డబ్బు. భవిష్యత్తులో లాభాలు లేదా డివిడెండ్‌ను ఇచ్చే ప్రభుత్వ భూమి, పెట్టుబడి లాంటి స్థిరాస్తులను సంపాదించడానికి చేసే ఖర్చు కూడా ఇందులో ఉంటుంది.

ఆర్థిక సమీకరణ (Fiscal Consolidation)

ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చే ఆదాయ వనరులను సమకూర్చుకోవడాన్నే ఆర్థిక సమీకరణ అంటారు. ఆర్థిక లోటును తగ్గించడం, ఖర్చులను క్రమబద్ధీకరించడం, ఆదాయ వనరులను పెంచడం ద్వారా ఆర్థిక సమీరణ సాధించవచ్చు.

ఆర్థిక విధానం (Fiscal Policy)

ప్రభుత్వ ఆదాయాలు, ఖర్చులను నియంత్రించే విధానమే ఆర్థిక విధానం. ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్థిక విధానం ఉపయోగపడుతుంది.

లోటు బడ్జెట్ (Budget Deficit)

బడ్జెట్‌లోని ఆదాయాలు ఖర్చులను మించినప్పుడు ఏర్పడే తేడానే లోటు బడ్జెట్‌ అంటారు. ఇది ప్రభుత్వ ఖర్చులు ఆదాయాలను మించినప్పుడు ఏర్పడుతుంది.

మిగులు బడ్జెట్‌ (Budget Surplus)

బడ్జెట్‌లోని ఖర్చులు ఆదాయాలను మించినప్పుడు ఏర్పడే తేడానే బడ్జెట్‌ సర్‌ప్లస్‌. ఇది ప్రభుత్వ ఆదాయాలు ఖర్చులను మించినప్పుడు ఏర్పడుతుంది.

బడ్జెట్‌ సాంకేతికలు (Budget Techniques)

బడ్జెట్‌ సిద్ధం చేసేటప్పుడు ఉపయోగించే వివిధ సాంకేతిక పద్ధతులనే బడ్జెట్‌ టెక్నిక్స్‌ అంటారు. ఇందులో ప్రణాళిక బడ్జెట్‌, ప్రణాళికేతర బడ్జెట్‌, ప్రణాళిక ప్రణాళికలు ఉంటాయి.

బడ్జెట్‌ రకాలు

ఆదాయ, వ్యయాల మధ్య గల సంబంధాన్ని బట్టి బడ్జెట్‌ రెండు రకాలుగా ఉంటుంది. రానున్న ఆదాయం, చేయబోయే ఖర్చులు సమానంగా ఉంటే సంతులిత బడ్జెట్‌ అవుతుంది. అలా కాకుండా ఆదాయ, వ్యయాల మధ్య తేడా ఉంటే అది అసంతులిత బడ్జెట్‌ అంటారు. 

ద్రవ్యోల్బణం (inflation)

ఒక నిర్దిష్ట వ్యవధిలో ధరల పెరుగుదల రేటునే ద్రవ్యోల్బణం అంటారు. ద్రవ్యోల్బణం అనేది సాధారణంగా ధరల పెరుగుదల లేదా దేశంలో జీవన వ్యయం పెరుగుదలను సూచించే కొలమానం.

ఒక్క మాటలో చెప్పాలంటే.. బడ్జెట్ అనేది ఆదాయాలు, ఖర్చులను సక్రమంగా పునాదిగా తీసుకుని రూపొందించిన ప్రణాళిక. ఇది వ్యక్తులు, వ్యాపారాలు, ప్రభుత్వాల ఆర్థిక నిర్వహణలో కీలక భూమిక పోషిస్తుంది. 

click me!