బజాజ్ సిటి 100: చౌకైన బైక్ విషయానికి వస్తే సిటి 100 పేరు మొదట వస్తుంది. ఇది దాని విభాగంలో చౌకైన, బడ్జెట్ బైక్. దీని కిక్ స్టార్ట్ వేరియంట్ ధర రూ .40,794 (ఎక్స్-షోరూమ్ ఢీల్లీ) ఉండగా ఎలక్ట్రిక్ స్టార్ట్ వేరియంట్ ధర రూ .48,474.
టీవీఎస్ స్పోర్ట్: కొత్త బిఎస్ 6 టివిఎస్ స్పోర్ట్ ఇటీవలే భారతదేశంలో 51,750 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. దీని బేస్ వేరియంట్ బిఎస్ 4 మోడల్ కంటే రూ.3,633 ఖరీదైనది. బిఎస్ 6 టివిఎస్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ స్టార్ట్ వెర్షన్ ధర రూ.58,925 (ఎక్స్-షోరూమ్ ఢీల్లీ), బిఎస్ 4 వేరియంట్‌తో పోలిస్తే రూ.8,017 ఎక్కువ. బీఎస్ 6 టీవీఎస్ స్పోర్ట్ వేరియంట్ ఇంధన సామర్థ్యం 15 శాతం పెరిగిందని కంపెనీ పేర్కొంది.
టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100: ఇటీవల విడుదల చేసిన టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100 భారతదేశంలో చౌకైన బీఎస్ 6 బైక్. ద్విచక్ర వాహనాల జాబితాలో రెండవ స్థానంలో ఉంది. ఎక్స్ఎల్ 100 మూడు వేరియంట్లలో లభిస్తుంది, దీని ధర రూ .43,044 (ఎక్స్-షోరూమ్ ఢీల్లీ) నుండి ప్రారంభమవుతుంది. దీని టాప్-ఎండ్ మోడల్ ధర రూ.44,614 (ఎక్స్-షోరూమ్ ఢీల్లీ). కొత్త బిఎస్ 6 మోడల్ ఇంజన్ కిల్ స్విచ్, ఫ్యూయల్ ఇంజెక్షన్ తో పాటు మరికొన్ని కొత్త అప్ డేట్స్ తో వస్తుంది.
బజాజ్ ప్లాటినా 100: కొత్త బిఎస్ 6 బజాజ్ ప్లాటినా 100 మోడల్ కిక్-స్టార్ట్ వేరియంట్ ధర రూ .47,264, ఎలక్ట్రిక్-స్టార్ట్ వేరియంట్ ధర రూ. 54,797 (ఎక్స్-షోరూమ్, ఢీల్లీ). బిఎస్ 6 బజాజ్ ప్లాటినా 100 బైక్ బిఎస్ 4 మోడల్ కంటే సుమారు రూ .7,000 ఖరీదైనది.