లైసెన్స్ లేని ఎలక్ట్రిక్ స్కూటర్
స్టైలిష్ లుక్‌తో బ్రాండెడ్ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలంటే ఇదే. తక్కువ ఖర్చుతో ప్రయాణం పూర్తి చేయడం దీని ప్లస్ పాయింట్. ధర కూడా తక్కువే. ఓకినావా కంపెనీ లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్. అన్ని విధాలా ఉపయోగకరం. స్టైలిష్‌గానే కాదు, మంచి ఫీచర్స్‌తోనూ ఉంది.
ఓకినావా లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్
రోజువారీ వాడకానికి చాలా బాగుంటుంది. ఈ స్కూటర్ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తే 60 కి.మీ. వరకు వెళ్లొచ్చు. గరిష్ట వేగం గంటకు 25 కి.మీ. కాబట్టి ఈ స్కూటర్‌కి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. దీన్ని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అక్కర్లేదు. 1.25kWh బ్యాటరీ ఉంది. దాన్ని బయటకు తీసుకోవచ్చు.
ఎలక్ట్రిక్ స్కూటర్
బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4 నుంచి 5 గంటలు పడుతుంది. ఈ స్కూటర్‌కి 3 సంవత్సరాలు లేదా 30 వేల కి.మీ. వరకు వారంటీ ఉంది. దీని గరిష్ట శక్తి 250 W. 150 కిలోల బరువును మోయగలదు. ఈ స్కూటర్ 5 రంగుల్లో లభిస్తుంది. అవి పసుపు, నీలం, సియాన్, ఎరుపు, తెలుపు. LED హెడ్‌ల్యాంప్ ఉంది. DRL ఫీచర్ కూడా ఉంది. అంటే పగటిపూట కూడా లైట్లు వెలుగుతాయి.
ఓకినావా లైట్
దీనికి అల్యూమినియం అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. మొబైల్ ఛార్జింగ్ USB పోర్ట్ కూడా ఉంది. పుష్ స్టార్ట్ ఆన్/ఆఫ్ ఉన్నాయి. వెనుక లైట్‌లో LED వింకర్స్ ఉన్నాయి. LCD స్పీడోమీటర్ ఉంది. ట్యూబ్‌లెస్ టైర్లు లభిస్తాయి. E-ABS ఉంది. అంటే అసిస్టెడ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది.
లైసెన్స్ లేని ఎలక్ట్రిక్ స్కూటర్లు
బ్యాటరీ లాక్, ఆటో హ్యాండిల్ లాక్, రిమోట్ ఆన్ ఫీచర్, హజార్డ్ ఫంక్షన్, పుష్ టైప్ పిలియన్ ఫుట్‌రెస్ట్, GPS ఉన్నాయి. మొబైల్ యాప్‌తో కనెక్ట్ చేయొచ్చు. దీనికి ఒకసారి ₹8,000 ఖర్చవుతుంది. ఎక్స్-షోరూమ్ ధర ₹69,093. ₹2,000 చెల్లించి సొంతం చేసుకోవచ్చు. బ్యాటరీకి 3 ఏళ్ల వారంటీ ఉంది.