ఈ దశాబ్దిలో బెస్ట్ బైక్స్.. స్కూటర్లు ఇవే..

First Published | Dec 29, 2019, 3:12 PM IST

2010-19 దశాబ్దిలో భారతదేశంలో ఆకర్షణీయమైన మోటారు సైకిళ్లు, స్కూటర్లు ఆవిష్క్రుతమయ్యాయి. వాటిల్లో వినియోగదారులకు ఫేవరెట్ స్కూటర్లు, బైక్స్‌గా నిలిచాయి. 
 

2012లో మాస్ట్రో, మాస్ట్రో ఎడ్జ్ స్కూటర్లను ఆవిష్కరించిన హీరో హీరో మోటో కార్ప్స్ సంస్థ విపణిలోకి 2012లో మాస్ట్రో, మాస్ట్రో ఎడ్జ్ స్కూటర్లను ఆవిష్కరించింది. హోండా మోటార్ సైకిల్స్ అండ్స్ స్కూటర్స్ సంస్థతో విడిపోయిన తర్వాత 2017లో రెండోతరం మోడల్ మాస్ట్రో ఎడ్జ్ స్కూటర్ విడుదల చేసింది. ఇది 110 సీసీ, 125 సీసీ ఇంజిన్ మోడ్స్ లో లభిస్తుంది.
2018లో టీవీఎస్ ఎన్ టార్క్ 125 టీవీఎస్ మోటార్స్ తన ఫ్లాగ్ షిప్ 125 సీసీ స్కూటర్ ను 2018 ప్రారంభంలో విపణిలో ఆవిష్కరించింది. బ్లూటూత్ కనెక్టివిటీ, నేవీగేషన్, పూర్తి డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్, స్మూత్ అండ్ పవర్ ఫుల్ 3 వాల్వు ఇంజిన్ కలిగి ఉంది. భారత దేశ విపణిలోకి టీవీఎస్ ఎన్ టార్క్ 125 స్కూటరును 125 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో తీసుకొచ్చింది. ఈ రోజు అన్ని విధాల వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తున్న స్కూటర్లలో ఒకటిగా ఉంది. ఇది మున్ముందు స్కూటర్ల మార్కెట్లో గేమ్ చేంజర్‌ కానున్నది.

అత్యధికంగా అమ్ముడైన సుజుకి ఆక్సెస్ 125 భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన సుజుకి మోడల్ సుజుకి ఆక్సెస్ 125 కూడా టీవీఎస్, హీరో, హోండా, బజాజ్ మాదిరిగానే పోటీ పడుతోంది. గత దశాబ్ది కాలంలో 125 సీసీ ఇంజిన్ సామర్థ్యం గల స్కూటర్ల అమ్మకాల్లో ఇది అగ్రస్థానంలో నిలిచింది. ఇది స్మూత్ గా, రిఫైన్డ్ ఫెర్ఫార్మెన్స్ కలిగి ఉంది. రోడ్లపై చాలా హాయిగా దూసుకెళ్లే స్కూటర్ ఇది.
APRILA
హోండా ఎంట్రీ లెవెల్ బైక్ సీబీఆర్ 250 ఆర్ హోండా మోటారు సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) హోండా యాక్టీవా స్కూటర్లకు పెట్టింది పేరు. భారతదేశంలో అత్యంత పాపులరైన స్కూటర్ తీసుకొచ్చిన హోండా ఎంట్రీ లెవెల్ బైక్ సీబీఆర్ 250ఆర్. టూరింగ్ ఫ్యాన్స్ కోసం ఈ నూతన తరం మోటారు సైకిల్‌ను ఆవిష్కరించింది. ఇది పలు అంతర్జాతీయ మార్కెట్ల్లో రీప్లేస్ చేయబడిందీ బైక్.
2012లో బజాజ్ కేటీఎం 390 డ్యూక్ బైక్ ఆవిష్కరణ బజాజ్ సారథ్యంలోని ఆస్ట్రియా మోటార్ సైకిల్ బ్రాండ్ కేటీఎం 2012లో ప్రవేశించింది. అంతే కాదు భారత మోటారు సైకిళ్ల చరిత్రలో అత్యంత గణనీయ చరిత్ర నెలకొల్పొంది. 1980వ దశకంలో యమాహా ఆర్డీ 350 బైక్ తర్వాత కేటీఎం బజాజ్ 390 బైక్ సంచలనం నెలకొల్పిందంటే అతిశయోక్తి కాదు.
2016లో బజాజ్ డోమినార్ ఆవిష్కరణ కేటీఎం పేరెంట్ కంపెనీ బజాజ్ ఆటో 2016లో తనకంటూ సొంతమైన 390 డ్యూక్ పాపులర్ బైక్ ఆవిష్కరించింది. బజాజ్ డోమినార్ ఇతర సంస్థల బైక్‌లతో పోలీస్తే విభిన్నంగా ఉంది. 373 సీసీ ఇంజిన్‍తో రూపుదిద్దు కున్నదీ బైక్. ఈనాటికి దేశీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన మోటారు సైకిల్ ఇది.
2011లో న్యూ గ్రౌండ్ నెలకొల్పిన హీరో ఇంపల్స్ దశాబ్దం క్రితం విపణిలోకి అడుగు పెట్టిన హీరో మోటో కార్ప్ బైక్ ఇంపల్స్ తనకంటూ సొంత మార్కెట్ నెలకొల్పింది. 150సీసీ ఇంజిన్ సామర్థ్యంతో రూపుదిద్దుకున్న ఎంట్రీ లెవెల్ డ్యుయల్ స్పోర్ట్ మోటార్ సైకిల్ ఇది. అయితే 2016లో దీన్ని మార్కెట్ నుంచి డిస్ కంటిన్యూ చేశారు. తర్వాత మరికొన్ని మార్పులు చేసిన ఫీచర్లతో హీరో ఎక్స్ పల్స్ బైక్‌ను 2018లో ఆవిష్కరించింది. హీరో ఎక్స్‌ప్లస్ బైక్ 200 సీసీ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఈ ఏడాదే మార్కెట్లోకి అడుగు పెట్టడంతో ఆఫ్ రోడ్ క్యాపబులిటీ గల బైక్‌గా పేరు తెచ్చుకున్నది.
2016లో రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ ఎంట్రీ ఆఫ్ రోడ్ ఓరియెంటెడ్ అడ్వెంచర్ బైక్‌లను ఆవిష్కరించడంలో హీరో ఒక్కటే కాదు రాయల్ ఎన్ ఫీల్డ్ కూడా ఒకటని రుజువు చేసుకున్నది. రాయల్ ఎన్‌ఫీల్డ్ 2016లో లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్‌తో విపణిలో అడుగు పెట్టింది హిమాలయన్ మోడల్ బైక్. హై గ్రౌండ్ క్లియరెన్స్ 411 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో రూపుదిద్దుకున్నది ఈ బైక్.

Latest Videos

click me!