Chetak EV
Bajaj Chetak : భారతదేశంలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన బజాజ్ చేతక్ గుర్తుందా? ఇప్పటి మాదిరిగా పెద్దపెద్ద బైక్స్ అందుబాటులో లేని ఆ జమానాలో బజాజ్ కంపనీ సరికొత్త వాహనాన్ని తీసుకువచ్చింది. అదే చేతక్... ఆ కాలంలో ఇది ఓ ఊపు ఊపింది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే నడి వయస్కుల కలల బైక్ గా చేతక్ గుర్తింపుపొందింది. అయితే కొత్తకొత్త వాహనాల రాకతో 2000 తర్వాత చేతక్ కనిపించడం లేదు. పదేళ్ళ తర్వాత అంటే 2020 ఇదే చేతక్ పేరుతో బజాజ్ మరో అద్భుతమైన స్కూటీని మార్కెట్ లోకి తచ్చే మరోసారి ప్రభంజనం సృష్టించింది. ఇలా కొత్త తరానికి నచ్చేలా సరికొత్త డిజైన్ తో చేతన్ స్కూటీని తిర్చిదిద్ది మార్కెట్ లో వదిలి సక్సెస్ అయ్యింది బజాజ్.
కస్టమర్ల ఇష్టాలు, అవసరాలకు తగ్గట్లుగా చేతక్ స్కూటీలో మార్పులుచేస్తోంది బజాజ్. ఈ క్రమంలోనే సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటీలను లాంచ్ చేసింది. అత్యాధునిక టెక్నాలజీతో తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేలా బజాజ్ స్కూటీలను రూపొందించింది. అద్భుతమైన కలర్లలో కనువిందు చేసే ఈ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటీ ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
Chetak EV
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటీలు :
చేతక్ 35 సీరిస్ లో మూడు వేరియంట్లను కొత్తగా లాంచ్ చేసింది బజాజ్. ఈ మూడు ఎలక్ట్రిక్ స్కూటీల్లో 3501 అనేది ప్రీమియం మోడల్. దీని ధర కాస్త ఎక్కువగా వుంది. 3502 మోడల్ ధర కాస్త తక్కువగా వుంది. 3503 మోడల్ ధరను ఇంకా వెల్లడించలేదు బజాజ్.
నియో క్లాసిక్ స్టైల్, మెటాలిక్ బాడీతో పాటు సరికొత్త ఫీచర్లతో, అనేక మార్పులతో కొత్త చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసారు. ఈ స్కూటీలు వృత్తాకార హెడ్‌ల్యాంప్‌ను కలిగి మరింత స్టైలిష్ గా వున్నాయి. ఇక పాత చేతక్ వాహనాల సీటు చిన్నదిగా వుందనే కంప్లయింట్ వుంది... దీన్ని గుర్తించిన బజాజ్ సీటు సౌకర్వవంతంగా వుండేలా తీర్చిదిద్దింది.
కేవలం ప్రమాణమే కాదు వస్తువులను ఈజీగా తీసుకెళ్లేలా ముందు భాగంలో మంచి స్పేస్ ఇచ్చారు. అంటే ఈ కొత్త మోడల్ ఎలక్ట్రిక్ చేతక్ లను కేవలం ప్రయాణానికే కాదు చిరు వ్యాపారులకు సౌకర్యవంతంగా రూపొందించారు. వీటిపై సౌకర్యవంతమైన వస్తువులను మోసుకెళ్లవచ్చు. కొత్త చేతక్ EVలో 35 లీటర్ల బూట్ స్పేస్ ఇచ్చారు.
Chetak EV
ఛార్జింగ్, మైలేజ్ సంగతేంటి?
ఈ కొత్త చేతక్ EV ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఛార్జింగ్ సమయం కూడా తక్కువగా వుంది. 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 3 గంటలు మాత్రమే పడుతుంది. మూడు వేరియంట్ స్కూటర్లలో మూడు బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. అందువల్ల ప్రతి వేరియంట్ యొక్క మైలేజ్ భిన్నంగా ఉంటుంది. ప్రాక్టికల్‌గా 125 కి.మీ మైలేజీ కచ్చితంగా వస్తుంది.
ఎలక్ట్రిక్ వాహనాల్లో కీలకమైనది ఛార్జింగ్. చాలా వాహనాల్లో నాణ్యతలేని పరికరాలను ఉపయోగిస్తున్నారే ప్రచారం వుంది... అందువల్లే ఈవి వాహనాలు కొనుగోలు చేసేందుకు చాలామంది జంకుతున్నారు. కానీ బజాజ్ మాత్రం కొత్త చేతక్ స్కూటర్లలో నాణ్యమైన పరికరాలను ఉపయోగించామని చెబుతోంది. ఇందులో ఛార్జింగ్ సమస్య వచ్చే అవకాశం లేదని గట్టిగా చెబుతోంది.
Chetak EV
చేతక్ 3501, 3502 ప్రత్యేకతలేంటి?
తాజాగా లాంచ్ చేసిన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటీల్లో 3501 ప్రీమియం మోడల్. ఇది టచ్ స్క్రీన్ TFT డిస్ ప్లే తో వస్తోంది... దీన్ని స్మార్ట్ ఫోన్ కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది రైడింగ్ గురించిన మొత్తం సమాచారాన్ని అందిస్తుంది. నావిగేషన్, కాల్ యాక్సెప్టెన్స్ ఆండ్ రిజెక్షన్, మ్యూజిక్, డాక్యుమెంట్ స్టోరేజ్, జియో-ఫెన్సింగ్, థెఫ్ట్ అలర్ట్, యాక్సిడెంట్ డిటెక్షన్, ఓవర్ స్పీడ్ అలర్ట్‌తో సహా పదుల సంఖ్యలో ఫీచర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫీచర్లు ఈ ఎలక్ట్రానిక్ స్కూటర్ల విభాగంలో బజాజ్ చేతక్ ప్రత్యేకంగా వుండేలా చేస్తున్నాయి.
ఇక 3502 అనేది మిడ్ రేంజ్ స్కూటర్. ఇదికూడా 5 ఇంచుల స్క్రీన్ ను కలిగివుంటుంది...కానీ ఇది టచ్ స్క్రీన్ కాదు. మిగతా అన్ని ఫీచర్లు 3501 మోడల్లో వున్నట్లే వున్నాయి.
Chetak EV
చేతక్ EV ధరలు :
కొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3501 మోడల్ ధర రూ. 1.27 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇక చేతక్ 3502 మోడల్ ధర 1.20 లక్షలు (ఎక్స్-షోరూమ్). చేతక్ 3503 వేరియంట్ ధర ఇంకా వెల్లడి కాలేదు.