రిటైర్మెంట్ పోస్టుపై స్పందించిన పీవీ సింధు... పూర్తిగా చదవకుండా గోల చేశారంటూ...

First Published | Nov 6, 2020, 3:45 PM IST

I Retire... అంటూ సోషల్ మీడియాలో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు చేసిన పోస్టు, పెను సంచలనం క్రియేట్ చేసింది. ఇంత త్వరగా సింధు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందంటూ... ట్వీట్ల వర్షం కురిపించారు నెటిజన్లు. అసలు పీవీ సింధు... చేసిన పోస్టులో ఏముంది, సుదీర్ఘ ట్వీట్ సారాంశం ఏమిటని చదివే ఓపిక కూడా లేకపోయింది చాలామందికి. పీవీ సింధు రిటైర్మెంట్ ప్రకటించిందంటూ వెబ్‌సైట్లు, వార్తా పత్రికలు, వార్తా ఛానెళ్లు కూడా వార్తలు వండేశాయి.

తాజాగా మరోసారి తన పోస్టుల ఆంతర్యం ఏమిటో స్పష్టంగా చెబుతూ ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది పీవీ సింధు..
undefined
‘నేను రిటైర్ అయ్యాను... డెన్మార్క్ ఓపెన్ నా చివరి ఆట’ అంటూ ట్విట్టర్‌లో పీవీ సింధు చేసిన పోస్టు పెను సంచలనమే క్రియేట్ చేసింది.
undefined

Latest Videos


మొదటి పేజీలో ఉన్న ‘నేను రిటైర్ అయ్యాను’ అనే పెద్ద అక్షరాలను మాత్రమే ఫోకస్ చేసిన నెటిజన్లు, ఆ తర్వాత సింధు పెట్టిన మరో రెండు పేజీల సారాంశాన్ని పక్కనబెట్టింది.
undefined
‘నేను చేసిన పోస్టు చూడగానే చాలామంది ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఏం జరిగిందంటూ హడావుడిగా నాకు ఫోన్లు, మెసేజ్‌లు చేశారు... నాకు ఫోన్ చేసిన వారందరికీ పోస్టు మొత్తం చదవాలని చెప్పి చెప్పి విసిగి పోయాను...
undefined
కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలో ఏర్పడిన నెగిటివిటీను పూర్తిగా తొలగించాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా పోస్టు చేసినట్టు చెప్పుకొచ్చింది పీవీ సింధు.
undefined
కొన్నాళ్లు క్రితం సడెన్‌గా లండన్‌ చేరుకుంది పీవీ సింధు. ఇంట్లో వాళ్లతో గొడవల కారణంగా పీవీ సింధు, ఇంత హడావుడిగా లండన్ వెళ్లిందని వార్తలు వచ్చాయి...
undefined
ఈ వార్తలపై స్పందించిన పీవీ సింధు... న్యూట్రిషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా లండన్ వచ్చినట్టు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
undefined
కోవిద్ 19 పరిస్థితుల కారణంగా ఈ ఏడాది జరగాల్సిన డెన్మార్క్ ఓపెన్ రద్దు అయ్యింది. దీంతో ఇకపై కరోనా కారణంగా రద్దయ్యేవి ఏవి ఉండకూడదని, ఆ విపత్కర పరిస్థితుల నుంచి నేను రిటైర్ అవుతున్నానంటూ అర్థంలో ట్వీట్ చేసింది పీవీ సింధు.
undefined
ఈ పోస్టు చూసిన క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు... ‘పీవీ సింధు నువ్వు... ఓ మినీ హార్ట్ ఎటాక్ తెప్పించావంటూ’ స్పందించారు.
undefined
click me!