హాట్ యాంగిల్ చూపిస్తున్న సైనా నెహ్వాల్... మాల్దీవుల్లో భర్తతో కలిసి...
First Published | Oct 30, 2020, 3:35 PM ISTభారత బ్యాడ్మింటన్‌కి మొట్టమొదటి మకుటం లేని మహారాణి సైనా నెహ్వాల్. భారత జట్టుకు ఎన్నో మైమరించే విజయాలు అందించిన సైనా నెహ్వాల్... హర్యానాలో పుట్టి, హైదరాబాద్‌లో చదువుకుంది. తండ్రి ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ కావడంతో హర్యానా నుంచి హైదరాబాద్‌కి వచ్చిన సైనా నెహ్వాల్... ఇక్కడ బ్యాడ్మింటన్ స్టార్‌గా ఎదిగింది. 2012 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన సైనా, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో 2015 రజతం, 2017లో కాంస్య పతకం గెలిచింది. తన సహచర బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్‌ను ప్రేమించి 2018, డిసెంబర్ 14న వివాహం చేసుకున్న సైనా నెహ్వాల్, ప్రస్తుతం భర్తతో కలిసి మాల్దీవుల్లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది.