PV Sindhu: వాళ్లు నన్ను కూడా వదల్లేదు : వేధింపులపై సింధు ఆవేదన

First Published | Jan 30, 2022, 11:43 AM IST

PV Sindhu: ఒలింపిక్స్ లో భారత్ కు రెండు పతకాలు సాధించిన తెలుగు తేజం పివి సింధు..  తనకు ఎదురైన వేధింపులపై షాకింగ్ కామెంట్స్ చేసింది. 
 

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, గతేడాది టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం నెగ్గిన పీవీ  సింధు.. ప్రస్తుతం అమ్మాయిలు ఎదుర్కుంటున్న సైబర్ వేధింపుల పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
 

తాను కూడా సైబర్ బాధితురాలేనని  ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటర్నెట్ లో తనను అవహేళనే చేయడం, బెదిరింపులు నిత్యం ఎదుర్కుంటానని తెలిపింది. 


జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ‘ఇస్మార్ట్  సైబర్ చైల్డ్’ పేరిట తెలంగాణ మహిళల భద్రతా విభాగం  నిర్వహించిన ఓ వెబినార్ లో పాల్గొన్న సింధు.. ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సింధు మాట్లాడింది.

సింధు మాట్లాడుతూ.. ‘ఇంటర్నెట్ లో ట్రోల్ చేయడం, బెదిరింపులు నాకు కూడా నిత్యం ఉంటాయి.  అయితే వాటిని ధైర్యంగా ఎదుర్కుని ముందుకెళ్లాలి. సైబర్ నేరాల బారిన పడితే వెంటనే మీకు సమీపంలోని పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయండి.. 

రాష్ట్రంలో షీ-టీమ్స్ మహిళల భద్రతకు భరోసా కల్పిస్తున్నాయి...’ అని సింధు తెలిపింది. గతంలో కీలక టోర్నీలలో విఫలమైన సింధూను టార్గెట్ గా చేస్తూ పలువురు ఆకతాయిలు ఆమెపై దారుణ ట్రోలింగ్ కు పాల్పడ్డారు. కానీ ఇవేవీ తాను పట్టించుకోనని, తన విజయాలే వాళ్లకు సమాధానం చెబుతాయని ఆమె గతంలో  వెల్లడించింది. 

కాగా..ఇదే కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర భద్రతా విభాగం అదనపు డీజీపీ  స్వాతి లక్రా మాట్లాడుతూ... ఆన్లైన్ మోసాలను ఎదుర్కోవడానికి ఇప్పటివరకు 3,300 మంది విద్యార్థులు, 1,650 ఉపాధ్యాయులకు  అవగాహన కల్పించామని  తెలిపారు. 
 

Latest Videos

click me!