PV Sindhu: ఎన్నికల్లో పోటీ చేయనున్న బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు.. ఏ పార్టీ నుంచో తెలుసా..?

First Published Nov 24, 2021, 10:45 AM IST

BWF Election: తెలుగు తేజం పివి సింధు ఎన్నికల్లో పోటీకి సై అంటున్నది. బ్యాడ్మింటన్ కోర్టులో రాకెట్ తోనే కాదు రాజకీయాల్లో ప్రత్యర్థులపై సైతం బలమైన ఏస్ లతో ముప్పు తిప్పలు పెట్టడానికి పక్కా ప్రణాళికతో  బరిలోకి దిగుతున్నది. 

భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, డబుల్ ఒలింపిక్ పతక విజేత పివి సింధు ఆటకు గుడ్ బై చెప్పనుందా..? రిటైర్మెంట్ తర్వాత వైజాగ్ లో బ్యాడ్మింటన్ అకాడమీ నెలకొల్పాలనే లక్ష్యంతో ఉన్న సింధు.. ఎన్నికల్లో పోటీ చేయనుందా..? బ్యాడ్మింటన్ అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్నలివి.. 

అవును.. సింధు ఎన్నికల్లో పోటీ చేయనుంది. ఇప్పుడప్పుడే రిటైర్ అయితే అవడం లేదు గానీ.. త్వరలో జరిగే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఎన్నికల్లో ఆమె పోటీకి దిగనుంది. అథ్లెట్స్ కమిషన్ కు డిసెంబర్ లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 

ఈ ఎన్నికల్లో తెలుగు తేజం పోటీ పడనుంది. అథ్లెట్స్ కమిషన్ లో ఆరు  స్థానాలుండగా.. 9 మంది క్రీడాకరులు పోటీలో ఉన్నారు. ఇప్పటికే అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా ఉన్న సింధు.. మరోసారి ఎన్నికల్లో పోటీకి దిగుతుండం విశేషం. 

స్పెయిన్ లో జరిగే ప్రపంచ ఛాంపియన్షిప్స్ లో డిసెంబర్ 17న అథ్లెట్స్ కమిషన్ ఎన్నికలను బీడబ్ల్యూఎఫ్ నిర్వహించనున్నది. అథ్లెట్స్ కమిషన్ నుంచి సింధు మరోసారి ఎన్నికల బరిలోకి దిగుతుందని బీడబ్ల్యూఎఫ్ పేర్కొంది. ఈ పదవికి ఎన్నికైన సభ్యులు.. 2021 నుంచి 2025 దాకా పదవిలో కొనసాగుతారు. 

2017లో సింధు.. ఈ కమిషన్ సభ్యురాలుగా ఎంపికైంది. ఇప్పుడుమళ్లీ పోటీకి దిగుతుండటం  గమనార్హం. సింధుతో పాటు గ్రేసియా పోలి (ఇండోనేషియా), కిమ్  సోయెంగ్ (కొరియా), రాబిన్ టేబిలింగ్ (నెదర్లాండ్స్), ఆడమ్ హాల్ (స్కాట్లాండ్), ఐరినా వాంగ్ (అమెరికా), హదియా హోస్నీ (ఈజిప్టు), సొరాయ (ఇరాన్), జెంగ్ వీ (చైనా) లో అథ్లెట్స్ కమిషన్ ఎన్నికల పోటీలో ఉన్నారు. 

కాగా.. అథ్లెట్స్ కమిషన్ సభ్యులుగా ఎన్నికైన వాళ్లు కొత్త చైర్మెన్ ను ఎన్నుకుంటారు. అనంతరంర చైర్మెన్ ను బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ లోకి తీసుకుంటారు. 

ఇదిలాఉండగా.. సింధు ప్రస్తుతం ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 ఈవెంట్ లో పాల్గొంటున్నది. టోక్యో ఒలింపిక్స్ ముగిసిన తర్వాత ఆమె వరుసగా నాలుగు టోర్నమెంట్లలో సెమీస్  దాకా వచ్చి నిష్క్రమిస్తున్నది. నాలుగు రోజుల క్రితం ముగిసిన ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 750  బ్యాడ్మింటన్ టోర్నమెంటు మహిళల సింగిల్స్ లో కూడా ఆమె సెమీస్ లో  జపాన్ క్రీడాకారిణి అకానె యమగూచి చేతిలో ఓడింది.  

click me!