బైక్ వాష్ చేసేటప్పుడు ఈ 4 విషయాలను గుర్తుంచుకోండి, లేదంటే మీ బైక్ పడవ్వొచ్చు..

First Published | Jan 10, 2022, 4:06 PM IST

ప్రపంచంలో బైక్‌లను ఇష్టపడని వారు ఎవరు ఉండరు. కొందరు లక్షలు పోసి మరీ నచ్చిన బైక్ ని  కొనుగోలు చేస్తుంటారు. నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక బైక్‌ ఉండే ఉంటుంది. నేడు నగరంలో లేదా గ్రామంలో బైక్ ప్రతి ఒక్కరికీ అత్యంత అవసరమైన సాధనంగా మారింది. మీరు బైక్ కొన్నాక దానిని ప్రతిరోజూ శుభ్రం చేస్తూ  మెయిన్ టైన్ చేస్తుండాలి. 

సాధారణంగా ప్రజలు ఎక్కువగా వారి బైక్‌ను ఇంట్లోనే కడగడం చేస్తుంటారు. దీంతో బైక్‌ను మార్కెట్‌లో వాష్ చేయడానికి అయ్యే ఖర్చు ఆదా అవుతుంది. మీరు ఇంట్లో బైక్‌ను కడగడం  చేసేటప్పుడు  కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే బైక్‌ను కడగేటప్పుడు కొంచెం అజాగ్రత్తగా ఉన్న  మీపై భారం పడుతుంది ఇంకా మీ బైక్ దెబ్బతినవచ్చు. కాబట్టి ఈ రోజు  అలాంటి కొన్ని విషయాలను తెలుసుకుందాం.., మీరు బైక్‌ను కడుగుతున్నప్పుడు  ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే మీ బైక్ త్వరగా పాడవకుండా కాపాడుకోవచ్చు... 
 

బైక్‌ను కడుగుతున్నప్పుడు బైక్  ఎగ్జాస్ట్ పైపు అంటే సైలెన్సర్‌లోకి  వాటర్  పోకుండా చూసుకోవాలి, ఎందుకంటే అందులోకి నీరు వెళ్తే బైక్‌ స్టార్ట్ చేయడం చాలా కష్టం. అంతే కాకుండా మీరు పదేపదే కిక్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. 
 


బైక్‌ను మెత్తటి బట్టతో మాత్రమే శుభ్రం చేయండి మరేదైనాతో చేస్తే బైక్  బాడీపై స్క్రాచెస్ వస్తాయి. అలాగే దాని పెయింట్ కూడా పాడైపోవచ్చు. ఫలితంగా  బైక్  కలర్ మెరుపును కోల్పోతుంది ఇంకా పాతదిగా కనిపిస్తుంది. 
 

బైక్‌ను కడగడానికి ఎల్లప్పుడూ బైక్ షాంపూని ఉపయోగించండి. దీని వల్ల బైక్ కొత్తగా  మెరుస్తూ ఉంటుంది. బైక్‌ను కడుగుతున్నప్పుడు బైక్ కీ-లాక్‌లోకి నీరు వెళ్లకుండా చూసుకొండి. ఒకవేల బైక్ కీ లాక్‌లోకి నీరు చేరితే దాన్ని ఆన్ లేదా లక్ చేయడంలో ఇబ్బంది ఎదురవుతుంది.  


మీరు ఇంట్లో బైక్‌ను కడగడం  చేసేటప్పుడు  కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే బైక్‌ను కడగేటప్పుడు కొంచెం అజాగ్రత్తగా ఉన్న  మీపై భారం పడుతుంది ఇంకా మీ బైక్ దెబ్బతినవచ్చు.
 

Latest Videos

click me!