చలికాలంలో కారును స్టార్ట్ చేసిన వెంటనే ఎందుకు ముందుకు నడపకూడదు?

First Published Nov 5, 2024, 7:25 PM IST

Winter Car Care Tips: చలికాలంలో కారు స్టార్ట్ చేసిన వెంటనే నడపకూడదు. అలా కాద‌నీ మీరు ఇప్పటికీ ముందుకు వేళ్తే మీ కారు దెబ్బతింటుంది. ఎందుక‌నే అస‌లు విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం. 
 

Winter Car Care Tips : చలికాలంలో కారుని స్టార్ట్ చేసిన వెంటనే ముందుకు న‌డ‌ప‌కూడ‌ద‌ని మీకు ఇప్పటికే ప‌లువురు మెకానిక్ ల‌తో పాటు నిపుణులు సలహా ఇచ్చి ఉంటారు. అలా చేస్తే మీ కారు పాడ‌వుతుంద‌ని మాత్ర‌మే చెప్తారు. దీని వెనుక ఉన్న అస‌లు కారణాన్ని ఎవరూ మీకు చెప్పరు. మీరు ఇప్పటికీ ఈ తప్పును తేలికగా తీసుకుంటే మీరు ఇప్పుడే అప్ర‌మ‌త్తం కావాలి. ఎందుకంటే ఈ చిన్న పొరపాటు వల్ల మీ కారు దెబ్బతింటుంది. చ‌లికాలంలో కారును స్టార్ట్ చేసిన వెంట‌నే ముందుకు న‌డిపితే ఏం జ‌రుగుతుంది? ఎందుకు న‌డ‌ప‌కూడ‌దు? అనే విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Benz car

1. ఇంజిన్ ఆయిల్ వేడెక్కడానికి సమయం కావాలి

చ‌లికాలంలో వాతావ‌ర‌ణంలో ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోతాయి. కాబ‌ట్టి చల్లని వాతావరణంలో వాహ‌నాల‌ ఇంజిన్ ఆయిల్ మందంగా మారుతుంది. దీని కారణంగా అది ఇంజిన్ భాగాలకు సులభంగా చేరుకోదు. దీని కార‌ణంగా ఇంజిన్ లో అన్ని భాగాలు స‌రైన విధంగా ప‌నిచేసే విష‌యంలో ప్ర‌తికూల‌త‌లు ఉంటాయి. 

ఇంజిన్ ను ప్రారంభించిన తర్వాత కొంత సమయం ముందుకు న‌డ‌ప‌కుండా వేచి ఉండటంతో ఇంజిన్ అయిల్ ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీని  కార‌ణంగా ఈ అయిల్ మ‌రింత‌గా జారిపోయేలా సన్నగా మారుతుంది. దీంతో ప్రతి భాగాన్ని చేరుకుంటుంది. కారును వెంటనే ప్రారంభించి ముందుకు సాగితే, మందపాటి అయిల్ సమర్థవంతంగా ద్ర‌వంగా మార‌దు. ఇది ఇంజిన్ భాగాలపై ఒత్తిడిని పెంచుతుంది. త్వ‌ర‌గా ఇంజిన్ భాగాల‌ను దెబ్బ‌తీస్తుంది. 

Latest Videos


2. ఇంజిన్ భాగాలు వేడెక్కడానికి సమయం కావాలి

చ‌లి కాలంలో ఇంజిన్ లోపల పిస్టన్, సిలిండర్, ఇతర భాగాలు చల్లగా ఉంటాయి. సరిగ్గా పని చేయడానికి అవి వేడిగా ఉండాలి. చల్లని వాతావరణంలో కారును వెంటనే నడిపినట్లయితే, ఈ భాగాలు త్వరగా వేడెక్కవు, ఇది ఘర్షణను పెంచుతుంది. దీంతో ఇంజిన్ పై ఒత్తిడిని పెంచుతుంది.

3. చ‌మురు పై ప్ర‌భావం

చల్లని వాతావరణంలో ఇంధనాన్ని (చ‌మురు) కాల్చడం కష్టం. ఇంజిన్ సరైన ఉష్ణోగ్రతను చేరుకోవడానికి వేచివుండ‌టంతో ఇంధనం బాగా మండుతుంది. ఇది కారు మైలేజీని కూడా మెరుగుపరుస్తుంది. మీరు కారును త్వరగా నడిపితే ఇంధనం సరిగ్గా ఉపయోగించబడదు. అలాగే, కారు మైలేజ్ కూడా తగ్గుతుంది.

4. బ్యాటరీ, విద్యుత్ వ్యవస్థ, ఛార్జింగ్ పై ప్ర‌భావం 

శీతాకాలంలో బ్యాటరీ సామర్థ్యం తగ్గిపోతుంది. కాబ‌ట్టి ఛార్జింగ్‌కు ఎక్కువ సమయం పడుతుంది. కారును స్టార్ట్ చేసిన త‌ర్వాత కొంచెం ఎక్కువసేపు నడపకుండా ఉండ‌టం వ‌ల్ల బ్యాటరీ, ఇతర ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లు సరైన ఛార్జింగ్, స్థిరీకరణను పొందుతాయి. ఇలా కావ‌డం వ‌ల్ల కారుకు మరింత సమర్థవంతంగా ప‌నిచేసే శక్తిని అందిస్తాయి.

5. గేర్బాక్స్ అయిల్ ఉష్ణోగ్రత పెరుగుద‌ల‌

చలి కాలంలో ఇంజన్ ఆయిల్ మాత్రమే కాకుండా గేర్ బాక్స్ ఆయిల్ కూడా చల్లబడుతుంది. గేర్‌లను మార్చడంలో ఇబ్బందులు వుండ‌వ‌చ్చు. కాబ‌ట్టి గేర్ల‌ను మార్చ‌డంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా కారును స్టార్ట్ చేసిన తర్వాత కొంత సమయం ముందుకు సాగ‌కుండా ఉండాలి. దీంతో గేర్‌బాక్స్ ఆయిల్ ఉష్ణోగ్ర‌త స‌రైన విధంగా పనిచేసే స్థితికి చేరుకుంటాయి. 

Toyota-Maruti Suzuki Rebadged Cars

దీంతో పాటు శీతాకాలం కోసం మీ కారును ముందుగానే సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. కఠినమైన వాతావరణ పరిస్థితుల కారణంగా మీరు, మీ కారు ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

లైట్లు సరైన స్థితిల్లో పనిచేస్తున్నాయనే విషయాలు గుర్తించడం మంచిది. చలికాలంలో సూర్యుడు త్వరగా అస్తమిస్తాడు. అలాగే, పగటిపూట వెలుతురు తక్కువగా ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో పొగమంచు కారణంగా ప్రయాణం అంత సులభంగా ఉండదు. కాబట్టి టైల్ లైట్లు , హెడ్‌ల్యాంప్‌లు, టర్న్ ఇండికేటర్‌లు, రివర్స్ హెడ్‌ల్యాంప్‌లు వంటి కార్ లైట్లు సరిగ్గా పని చేస్తున్నాయో లేదో తనిఖీ చేయడం ముఖ్యం.

click me!