పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ కార్లే కాదు.. కొద్దిరోజుల్లోనే రోడ్లపై సోలార్ కార్లు కనిపించనున్నాయి. ఈ కార్లు చార్జ్ చేయకుండానే కొద్దిసేపు ఎండలో ఉంచితే చాలు పరుగులు తీస్తాయి. భారతదేశపు తొలి సోలార్ కారు వచ్చేసింది.
జనవరి 17 నుంచి 22 వరకు జరిగిన ఆటో ఎక్స్‌పో 2025లో ఈ సోలార్ కారును ప్రదర్శించారు. Vayve Eva పేరుతో లాంచ్ అయిన ఈ కొత్త కారు రోడ్డు మీదకు రాకముందే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కారు స్టార్టింగ్ వేరియంట్ ధర కేవలం 3 లక్షల రూపాయలు. తక్కువ ధర అయినప్పటికీ, ఫీచర్ల విషయంలో రాజీ లేదు.
ఇతర కార్ల మాదిరిగానే ఇందులో కూడా మంచి ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రీ-బుకింగ్‌లు జరుగుతున్నాయి. ఈ కారు Nova, Stella, Vega అనే మూడు వేరియంట్లలో లాంచ్ అవుతోంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఈ కారులో ఏయే ఫీచర్లు ఉంటాయో తెలుసుకుందాం.