కారు కొనేముందే మనకు ఎలాంటి కారు కావాలి, ఎంత ఖర్చు చేయగలం అనేది ముందుగానే డిసైడ్ చేసుకోవాలి. కేవలం కారు ధరను బట్టే బడ్జెట్ ఫిక్స్ చేసుకోకూడదు. ఇన్సూరెన్స్, సర్వీసింగ్, ఆర్సీ (RC) పేరు మార్పిడి, ట్యాక్స్, భవిష్యత్తులో వచ్చే రిపేర్ ఖర్చులను కూడా లెక్కలోకి తీసుకోవాలి.
రోజువారీ ప్రయాణం, కుటుంబ అవసరాలను బట్టి పెట్రోల్, డీజిల్, సీఎన్జీ (CNG) లేదా ఎలక్ట్రిక్ కారు.. ఏది సెట్ అవుతుందో చూసుకోవాలి. కారును చెక్ చేసేటప్పుడు బాడీపై పెద్ద గీతలు, తుప్పు పట్టడం, పెయింట్ సరిగా లేకపోవడం, యాక్సిడెంట్ అయిన ఆనవాళ్లు ఏమైనా ఉన్నాయేమో గమనించాలి.
డోర్లు, బోనెట్, డిక్కీ అన్నీ తెరిచి, మూసి అవి సరిగా పనిచేస్తున్నాయో లేదో నిర్ధారించుకోవాలి. కారు లోపల కూడా చెక్ చేయాలి. సీట్ల క్వాలిటీ, ఏసీ, మ్యూజిక్ సిస్టమ్, పవర్ విండోస్, హెడ్‌లైట్స్, ఇండికేటర్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవాలి.