
ప్రస్తుతం పెట్రోల్ ధరలు క్రమంగా పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. కొత్తగా వాహనం కొనాలకునేవారు ఈవి వైపే మొగ్గు చూపుతున్నారు… దీంతో సేల్స్ అమాంతం పెరుగుతున్నాయి. ఫ్యామిలీ అవసరాలకోసమే కాదు ఉద్యోగులు, వ్యాపారాలు చేసేవారు కూడా ఈవి స్కూటర్లను కొంటున్నారు… మంచి పెర్పార్మెన్స్ కలిగిన స్కూటర్స్ సేల్స్ పెరుగుతున్నాయి.
ఇండియాలో గత నెల (సెప్టెంబర్ 2026) ఎలక్ట్రిక్ టూ వీలర్ల సేల్స్‌లో టీవీఎస్ ఐక్యూబ్ నంబర్ వన్ స్థానంలో నిలిచి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం ఒక్క నెలలోనే ఏకంగా 45,320 ఐక్యూబ్ స్కూటర్లను కంపెనీ డెలివరీ చేసింది. సెప్టెంబర్ 2025లో అమ్మిన 30,820 యూనిట్లతో పోలిస్తే ఇది 47% ఎక్కువ. అలాగే ఆగస్టు 2026లో అమ్ముడైన 42,882 యూనిట్లతో చూసుకుంటే 6% గ్రోత్ కనిపించింది.
ఈ లిస్ట్‌లో బజాజ్ చేతక్ 42,394 యూనిట్లతో రెండో స్థానంలో నిలిచింది. సెప్టెంబర్ 2025లో అమ్మిన 30,558 యూనిట్లతో పోలిస్తే ఇది 39% ఎక్కువే అయినా, ఆగస్టులో అమ్మిన 52,248 యూనిట్లతో చూస్తే 19% తగ్గింది.
ఇక హీరో విడా 28,862 యూనిట్లతో మూడో ప్లేస్ దక్కించుకుంది. గత ఏడాది సెప్టెంబర్‌లో 15,329గా ఉన్న దీని సేల్స్ ఇప్పుడు 88% పెరిగాయి. ఆగస్టు (25,558 యూనిట్లు)తో పోలిస్తే 13% మంత్లీ గ్రోత్ సాధించింది.
ఆ తర్వాత ఏథర్ రిజ్టా 19,813 యూనిట్లతో నాలుగో స్థానంలో ఉంది. గత ఏడాది సెప్టెంబర్ (18,919 యూనిట్లు) కంటే ఇది 5% ఎక్కువ. కానీ ఆగస్టు (22,586 యూనిట్లు)తో పోలిస్తే 12% తగ్గింది.
కొత్తగా వచ్చిన టీవీఎస్ ఆర్బిటర్ 17,027 యూనిట్లతో ఐదో ప్లేస్‌లో నిలిచింది. ఆగస్టు (14,641 యూనిట్లు)తో పోలిస్తే 16% గ్రోత్ సాధించింది.
సర్వే చేసిన 16 ఈ-మోడల్స్ మొత్తం 1,86,693 యూనిట్లు డెలివరీ అయ్యాయి. ఈ లిస్ట్‌లో ఓలా ఎలక్ట్రిక్ వివరాలు లేవు… కాబట్టి మిగతా కంపెనీల డేటాను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు.
ఆరో స్థానంలో ఉన్న గ్రీవ్స్ మాగ్నస్ 10,532 యూనిట్లను డెలివరీ చేసింది. ఇది గత ఏడాది సెప్టెంబర్ (6,179) కంటే 70%, ఆగస్టు (9,772) కంటే 8% ఎక్కువ.
ఏడో ప్లేస్‌లో ఉన్న ఏథర్ 450 మోడల్ 6,168 యూనిట్లు అమ్ముడైంది. ఇది ఆగస్టు సేల్స్ (6,891 యూనిట్లు) కంటే 10% తక్కువ (గత ఏడాది 450S, 450X, 450 అపెక్స్ విడివిడిగా లెక్కించినందున వార్షిక గ్రోత్ లెక్కించలేదు).
ఎనిమిదో స్థానంలో ఉన్న రివర్ ఇండీ 6,057 యూనిట్లు డెలివరీ చేసి గత ఏడాది (1,960) కంటే 209% భారీ గ్రోత్ సాధించింది. అయితే ఆగస్టు (6,567 యూనిట్లు)తో చూస్తే ఇది 8% తక్కువ.
తొమ్మిదో ప్లేస్‌లో ఉన్న కొత్త మోడల్ ఏథర్ కోణార్క్ ఆగస్టులో కేవలం 217 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, సెప్టెంబర్‌లో ఏకంగా 1,808% గ్రోత్తో 4,140 యూనిట్లకు దూసుకెళ్లింది.
పదో స్థానంలో ఉన్న గ్రీవ్స్ రియో 2,047 యూనిట్లు అమ్ముడైంది. ఇది గత ఏడాది (545 యూనిట్లు) కంటే 276%, ఆగస్టు (1,911 యూనిట్లు) కంటే 7% ఎక్కువ.
లిస్ట్‌లోని మొత్తం సేల్స్‌లో టాప్ 5 మోడల్స్ వాటాయే 82.2% ఉంది. బజాజ్ చేతక్‌తో పోలిస్తే టీవీఎస్ ఐక్యూబ్ తన లీడ్‌ను మరింత పెంచుకుంది. అదే సమయంలో పాపులర్ బైక్ కంపెనీల నుంచి టాప్ 3లో నిలిచిన ఏకైక బ్రాండ్‌గా హీరో విడా సత్తా చాటింది.
కంపెనీల వారీగా చూస్తే.. టీవీఎస్ (ఐక్యూబ్ & ఆర్బిటర్) మొత్తం 62,347 యూనిట్లను డెలివరీ చేసి మార్కెట్లో 33.4% షేర్‌ను దక్కించుకుంది. బజాజ్ (చేతక్ & యులు) 43,194 యూనిట్లు అమ్మి 23.1% వాటాను సొంతం చేసుకుంది. ఏథర్ (రిజ్టా, 450 & కోణార్క్) 30,121 యూనిట్లను డెలివరీ చేసి 16.1% షేర్ సాధించింది.
హీరో (విడా) 28,862 యూనిట్లను డెలివరీ చేసి 15.5% వాటాను పట్టుకుంది. గ్రీవ్స్ (మాగ్నస్, రియో, నెక్సస్) 13,441 యూనిట్లతో 7.2% షేర్ దక్కించుకుంది. రివర్ (ఇండీ) 6,057 యూనిట్లతో 3.2% వాటాను పొందింది. హోండా క్యూసీ1 (1,464 యూనిట్లు), యాక్టివా ఈ మోడల్స్ కలిపి మొత్తం 1,605 యూనిట్లు అమ్ముడై 0.9% షేర్ నమోదు చేశాయి. ఇవి కాకుండా సుజుకి ఈ-యాక్సెస్ (573 యూనిట్లు), యమహా ఈసీ06 (493 యూనిట్లు) మిగతా వాటాను పంచుకున్నాయి.
ప్రభుత్వ వాహన్ (Vahan) పోర్టల్ డేటా ప్రకారం.. సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా సుమారు 2.05 లక్షల ఎలక్ట్రిక్ టూ వీలర్లు రిజిస్టర్ అయ్యాయి. మొత్తం టూ వీలర్ల రిజిస్ట్రేషన్లలో ఇది 11%. కంపెనీల వారీగా చూస్తే టీవీఎస్ సుమారు 54,000, బజాజ్ 48,500 వాహనాలను రిజిస్టర్ చేశాయి. ఏథర్ 30,500, హీరో విడా 24,300, ఓలా ఎలక్ట్రిక్ 13,450 వాహనాలను రిజిస్టర్ చేశాయి.
ఫాడా (FADA) రిలీజ్ చేసిన నవరాత్రి పండుగ సీజన్ డేటా ప్రకారం.. పండుగ 10 రోజుల్లోనే దేశవ్యాప్తంగా 75,758 ఎలక్ట్రిక్ టూ వీలర్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది పండుగ సీజన్ సేల్స్‌తో పోలిస్తే ఇది 33.41% ఎక్కువ.