టాటా పంచ్ కారును బీట్ చేసేలా టయోటా కొత్త సబ్-కాంపాక్ట్ క్రాస్ఓవర్.. అదరగొట్టే స్టయిల్ తో వచ్చేస్తోంది..

First Published | Nov 6, 2021, 1:51 PM IST

జపాన్ మల్టీ నేషనల్ ఆటోమేటివ్ తయారీ సంస్థ టయోటా(toyota)  కొత్త కారు ఐగో ఎక్స్(Aygo X)ను అధికారికంగా పరిచయం చేసింది. టయోటా  కొత్త ఎస్‌యూ‌వి అనేది స్టైలింగ్ అంశాలతో కూడిన సబ్-కాంపాక్ట్ క్రాస్ఓవర్ కారు, ఈ కారు టాటా మోటార్స్ నుండి ఇటీవల లాంచ్ చేసిన టాటా పంచ్‌ను గుర్తుకు తెస్తుంది. 

 టయోటా  ఐగో ఎక్స్(Aygo X)GA-B ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడుతుంది, అలాగే TNGA (టొయోటా న్యూ గ్లోబల్ ఆర్కిటెక్చర్) ప్లాట్‌ఫారమ్ నుండి తీసుకోబడిన ఆర్కిటెక్చర్. టయోటా యారిస్, టయోటా యారిస్ క్రాస్ వంటి కార్లలో కూడా దీనిని ఉపయోగించారు.

టయోటా    ఐగో ఎక్స్ సైజ్
టయోటా    ఐగో ఎక్స్ పొడవు 3,700 ఎం‌ఎం, వెడల్పు 1,740 ఎం‌ఎం, ఎత్తు 1,510 ఎం‌ఎం. ఐగో ఎక్స్ తో పోలిస్తే టాటా పంచ్ పొడవు 3,827 ఎం‌ఎం, వెడల్పు 1,742 ఎం‌ఎం, ఎత్తు 1,615 ఎం‌ఎం. 


ఇంజన్ అండ్ పవర్
టయోటా ఐగో ఎక్స్ 1.0-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 72hp శక్తిని, 205 Nm వరకు గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌తో సి‌వి‌టి గేర్‌బాక్స్ ఇచ్చారు.

స్పోర్టీ లుక్
టొయోటా ఐగో ఎక్స్ కి పెద్ద ఫ్రంట్ గ్రిల్, ఫాగ్ ల్యాంప్స్, ఎల్‌ఈ‌డి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన హెడ్‌లైట్లు లభిస్తాయి. దీనికి ఇప్పుడు ప్రత్యేక రకమైన ఇండికేటర్స్ చూడవచ్చు.  ఐగో ఎక్స్ కూడా ఒక ప్రొఫైల్‌ను పొందుతుంది, దీనికి పైకప్పు (roof)ఉంటుంది, ఈ ఫీచర్స్ కారు మరింత స్పోర్టీగా కనిపించేలా చేస్తుంది. ఈ కారుకి 18-అంగుళాల విల్స్ లభిస్తాయి.  ఇవన్నీ Aygo X  స్పోర్టీ లుక్‌ను పెంచుతుంది. 

డిజైన్ అండ్ కలర్ 
టయోటా  ఐగో ఎక్స్ డ్యూయల్-టోన్ ఎక్స్టీరియర్ కలర్ స్కీమ్‌తో వస్తుంది, ఈ కలర్ స్కీమ్ దీని కఠినమైన రూపాన్ని చాలా ఆకర్షణీయంగా చేస్తుంది. ఈ కారులో ఉపయోగించే డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్ సాధారణంగా ఇతర కార్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఐగో ఎక్స్ C-పిల్లర్‌కు బ్లాక్ టోన్ ఇచ్చారు. మిగిలిన కారు బాడీకి నాలుగు రంగులు ఇచ్చారు. వీటిలో ఎరుపు, నీలం, ఆకుపచ్చ, లేత గోధుమరంగు ఉన్నాయి.

ఫీచర్లు
ఐగో ఎక్స్ లోపలి భాగం మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్‌తో వస్తుంది. పక్కన 9 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉంటుంది. టయోటా ఐగో ఎక్స్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేతో కనెక్ట్ చేయగల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ ఫీచర్ వైర్‌తో పాటు వైర్‌లెస్‌గా ఉంటుంది ఇంకా MyT అప్లికేషన్‌ ఆప్షన్ తో వస్తుంది.  MyT అనేది డ్రైవింగ్అనాలిసిస్, ఇంధన స్థాయి, హెచ్చరిక వంటి కారు సంబంధిత సమాచారాన్ని డ్రైవర్‌కు అందిస్తుంది. ఐగో ఎక్స్ 231 లీటర్ల భారీ బూట్ స్పేస్‌ను అందిస్తుంది. 

Latest Videos

click me!