లండన్ ఫేమస్ టాక్సీ ఇప్పుడు ఇండియాలోకి.. ఎలక్ట్రిక్ వాహనాలకు పోటీగా ప్రత్యేకంగా..

Ashok Kumar   | Asianet News
Published : Nov 05, 2021, 01:00 PM IST

మీరు ఢిల్లీలో ఉండేవారైతే  లండన్ (london)వీధుల్లో  కనిపించే టాక్సీని చూసి ఆశ్చర్యపోకండి. ఎందుకంటే లండన్ ఈ‌వి కంపెనీ లండన్ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ (LEVC) ఎలక్ట్రిక్ లుక్ లో భారత రాజధానికి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ టాక్సీ (electric taxi)పేరు టి‌ఎక్స్ (TX). ఈ టాక్సీలు దాదాపు లండన్‌లో కనిపించే ఐకానిక్ టాక్సీలాగానే ఉంటాయి. అయితే ఇండియాలోకి వచ్చే టాక్సీలో మాత్రం ఎలక్ట్రిక్ మోటార్ ఉపయోగించారు.   

PREV
15
లండన్ ఫేమస్ టాక్సీ ఇప్పుడు ఇండియాలోకి.. ఎలక్ట్రిక్ వాహనాలకు పోటీగా ప్రత్యేకంగా..

కారు లుక్స్ 
ఈ కారు బాండెడ్ అల్యూమినియం ఛాసిస్ ఆధారంగా రూపొందించారు. దీనికి ప్లగ్-ఇన్ సిరీస్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ లభిస్తుంది. ఈ కారు వోల్వో-సోర్స్డ్ పెట్రోల్ ఇంజన్, ఎలక్ట్రిక్ మోటారుకు 148 BHP శక్తినిచ్చే 33 kWh బ్యాటరీ ప్యాక్‌ అందించారు. ఈ కారులో ఆరు సీట్లు, వీల్‌చైర్ సౌలభ్యం, ప్రయాణీకుల నుండి డ్రైవర్‌ను వేరుచేసే స్పిట్ సిట్స్ ఉంటాయి.
 

25

డ్రైవింగ్ 
టి‌ఎక్స్ (TX)అనేది జీరో-ఎమిషన్స్ వాహనం కాబట్టి దీని నుండి భవిష్యత్తు ఆశించవచ్చు.  అలాగే ఆన్‌బోర్డ్ ఛార్జింగ్ సిస్టమ్ అలాగే రేంజ్ ఎక్స్‌టెండర్‌  ఉంది. ఇంకా 101 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు, అయితే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించగే  సామర్ధ్యం ఉందని కంపెనీ పేర్కొంది.
 

35

కార్పొరేట్ ప్లాన్ 
భారత ఉపఖండంలో టి‌ఎక్స్ శ్రేణిని తీసుకురావడానికి LEVC తాజాగా Exclusive Motors Pvt Ltdతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. కంపెనీ తన ఉత్పత్తుల ద్వారా క్లీన్ మొబిలిటీ మాత్రమే కాకుండా ఉపాధి అవకాశాలను కూడా నొక్కి చెబుతోంది.
 

45

దక్షిణాసియా ట్రేడ్ కమీషనర్ హర్ మెజెస్టి అలాన్ జెమ్మెల్ మాట్లాడుతూ, "LEVC యొక్క వినూత్న భవిష్యత్ మొబిలిటీ సొల్యూషన్స్ భారతదేశం  డైనమిక్ అండ్ పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో అవకాశాలను చేజిక్కించుకుంటున్నందుకు నేను సంతోషిస్తున్నాను. రెండు ఆర్థిక వ్యవస్థలను మరింత లోతుగా, ప్రయోజనం పొందేందుకు ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలు ఉన్నాయి." అని అన్నారు.

55

మారుతున్న కాలంలో మార్పు

ఒక కంపెనీగా LECV 1908లో స్థాపించబడింది, మొదటి ప్రత్యేక బ్లాక్ క్యాబ్ లండన్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించి ప్రారంభించారు. ఈ కంపెనీ వాహనాలు లండన్ వీధులలో  మంచి గుర్తింపు ఉన్నప్పటికీ మారుతున్న కాలానికి అనుగుణంగా కంపెనీ 2018 సంవత్సరంలో ఎలక్ట్రిక్ వాహనం టి‌ఎక్స్ ని ప్రవేశపెట్టింది. 

click me!

Recommended Stories