సూపర్ ఫీచర్లు సూప‌ర్ మైలేజీ - డిజైన్ తో పిచ్చెక్కించే రూ. 8 లక్షల లోపు బెస్ట్ కార్లు ఇవే

First Published Nov 5, 2024, 8:32 PM IST

Super Features Super Mileage - best cars under Rs 8 lakh : బెస్ట్ ఫీచ‌ర్లు, బెస్ట్ మైలేజీ రెండూ ఉంటే కార్ల కోసం చూస్తున్నారా? అది కూడా రూ. 8 లక్షల లోపు  కొనుగోలు చేయ‌ల‌నుకుంటున్నారా? అయితే, మీకోసం సూప‌ర్ డిజైన్, సూప‌ర్ మైలేజీతో రూ.8 ల‌క్ష‌ల లోపు ఉన్న బెస్టు కార్ల గురించిన వివ‌రాలు మీకోసం. 
 

best cars under Rs 8 lakh:  మీ బ‌డ్జెట్ త‌క్కువ‌గా ఉంటే మీకు బెస్ట్ మైలేజీతో పాటు బెస్ట్ ఫీచ‌ర్లు ఉన్న కార్లు కావాలి. అలాంటి కార్ల లిస్టులో ప్ర‌స్తుతం మార్కెట్ లో చాలానే అందుబాటులో ఉన్నాయి. అయితే,  మీ బడ్జెట్ రూ. 8 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉండి.. మీరు ఈ బడ్జెట్‌లో మంచి ఫీచ‌ర్లు, మంచి మైలేజీ ఇచ్చే కారును కొనుగోలు చేయాలనుకుంటే ఆ వివ‌రాలు మీకోసం ఇక్క‌డ అందిస్తున్నాము. భార‌త్ లో మంచి ప్రాచుర్యం పొంది, ఎక్కువ‌గా సేల్ అవుతున్న త‌క్కువ బ‌డ్జెట్ కార్లు, బెస్ట్ మైలేజీ, బెస్ట్ ఫీచ‌ర్ల‌ కార్ల వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

టాటా టియాగో

టాటా టియాగో భారతీయ మార్కెట్లో సరసమైన ధ‌ర‌తో పాటు ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కారు. దీని స్టైలిష్ డిజైన్, బలమైన నిర్మాణ నాణ్యత, అనుకూలమైన ఫీచర్లు త‌క్కువ బ‌డ్జెత్ కారు కొనేవారికి దీనిని గొప్ప ఎంపికగా చేస్తాయి. ధర గురించి మాట్లాడితే, కస్టమర్‌లు దీన్ని దాదాపు ₹ 5.60 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఇందులో వినియోగదారులు 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్ పొందుతారు. 

టాటా టియాగో వివిధ వేరియంట్ల‌లో అందుబాటులో ఉంది. 5.65 రూపాయ‌ల‌ ప్రారంభ ధ‌ర‌తో  8.90 లక్షల వ‌ర‌కు అందుబాటులో ఉన్నాయి. టాటా టియాగో ఆరు గొప్ప వేరియంట్‌లలో మార్కెట్ లో అందుబాటులో ఉంది. అవి XE, XM, XT(O), XT, XZ, XZ+. ఈ వేరియంట్‌లు బేసిక్ మోడల్‌ల నుండి మరింత అధునాతన ఫీచర్‌లు ఉన్న వాటి వరకు అనేక రకాల ఎంపికలను అందిస్తాయి. కొనుగోలుదారులు తమ అవసరాలు, ప్రాధాన్యతలకు బాగా సరిపోయే టియాగోను ఎంచుకోవచ్చు.

Latest Videos


హోండా అమేజ్ 

హోండా అమేజ్ అనేది ఒక ప్రీమియం కాంపాక్ట్ సెడాన్. ఇది దాని స్టైలిష్ డిజైన్, లోప‌ల‌ మంచి స్థలంతో పాటు హోండా బ్రాండ్ కు ఉన్న విశ్వసనీయత కారణంగా భారతీయ మార్కెట్ లో మంచి గుర్తింపు సాధించింది. ఇది మంచి మైలేజీని కూడా ఇస్తుంది. దీని పనితీరు, ఫీచర్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. హోండా అమేజ్ ధర గురించి మాట్లాడినట్లయితే ఇది దాదాపు రూ. 7.10 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధ‌ర‌తో ఉంది. ఇందులో 1.2-లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ ఇంజన్ ఎంపికలు ఉన్నాయి.

హోండా అమేజ్ మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అవి హోండా అమేజ్ E, హోండా అమేజ్ S, హోండా అమేజ్ VX. రేడియంట్ రెడ్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెర్ల్, గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్, మెటోరాయిడ్ గ్రే మెటాలిక్, లూనార్ సిల్వర్ మెటాలిక్ క‌ల‌ర్స్ లో అందుబాటులో ఉంది. ఈ కారు 420 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది.

Maruti Suzuki Swift

మారుతీ సుజుకి స్విఫ్ట్ 

మారుతి సుజుకి స్విఫ్ట్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటి. దీని ధర, అద్భుతమైన మైలేజ్, ఫీచర్లు, స్టైలిష్ డిజైన్ కారణంగా ఇది భారతీయ మార్కెట్‌లో  బాగా సేల్ అయింది.  మారుతీ సుజుకి స్విఫ్ట్ రూ. 5.99 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వద్ద కొనుగోలు చేయవచ్చు. 1.2-లీటర్ K-సిరీస్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్‌ను క‌లిగి ఉంది.

మారుతీ సుజుకి స్విఫ్ట్ లెటెస్ట్ వెర్ష‌న్ టాప్-స్పెక్‌లోని కొత్త స్విఫ్ట్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో కూడిన 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6-స్పీకర్ ఆర్కామిస్-ట్యూన్డ్ ఆడియో సిస్టమ్ (రెండు ట్వీటర్‌లతో సహా), వెనుక వెంట్‌లతో కూడిన ఆటోమేటిక్ ఎసి, వైర్‌లెస్ ఫోన్ వంటి సౌకర్యాలతో వస్తుంది. ఛార్జింగ్, క్రూయిజ్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్ స‌దుపాయాలు ఉన్నాయి.

hyundai exter and Tata Punch

హ్యుందాయ్ ఎక్స్‌టర్ 

హ్యుందాయ్ ఎక్సెటర్ ఒక కాంపాక్ట్ SUV. ఇది దాని స్పోర్టీ డిజైన్, మంచి ఫీచర్లు, అద్భుతమైన పనితీరు  కార‌ణంగా భారతీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందింది. హ్యుందాయ్ నుండి ఈ కొత్త SUV నగరాల్లో డ్రైవింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. రూ. 6.00 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. దీనిలో 1.2-లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్‌ను ఉంటుంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ లో హైటెక్ ఫీచ‌ర్లు కూడా ఉన్నాయి. కొత్త మోడ‌ల్ లో వాయిస్ ఎనేబుల్డ్ స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డ్యుయల్ కెమెరాతో డాష్‌క్యామ్ ఉంటుంది. ఇది ముందు & వెనుక కెమెరా, 5.84 సెం.మీ (2.31") LCD డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ యాప్ ఆధారిత కనెక్టివిటీ, మల్టిపుల్ రికార్డింగ్ మోడ్‌లను కలిగి ఉంది.

click me!