Royal Enfield:రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్.. త్వరలో కొత్త లాంచ్‌లు వస్తాయా..?

Ashok Kumar   | Asianet News
Published : May 20, 2022, 06:01 PM IST

ఇండియన్ మల్టీనేషనల్ బైక్స్ తయారీ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ అండ్ వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికల్స్(VECV)సుమారు రూ. 1,000 కోట్ల నుంచి రూ.  1,100 కోట్లు  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడి పెట్టనుంది. ఇందులో రాయల్ ఎన్ఫీల్డ్ ఒక్కటే రూ. 550-600 కోట్లను మిగిలిన డబ్బును VECV పెట్టుబడి పెడుతుంది. చెన్నైకి చెందిన తయారీ సంస్థ కెపాసిటీ, ప్రొడక్ట్స్ అండ్ వేరియంట్‌లను బ్యాలెన్స్ చేయడానికి డబ్బును వెచ్చించనుంది.   

PREV
13
Royal Enfield:రాయల్ ఎన్‌ఫీల్డ్  ఎలక్ట్రిక్ బైక్.. త్వరలో కొత్త లాంచ్‌లు వస్తాయా..?

బ్రాండ్ గత ఆర్థిక సంవత్సరంలో థాయ్‌లాండ్, కొలంబియాలో  CKD (ఫుల్ నాక్డ్ డౌన్) కార్యకలాపాలను ప్రారంభించింది. దీని ఫలితంగా ప్రపంచ మార్కెట్‌లలో వార్షిక అమ్మకాలు  108 శాతం పెరిగాయి. ఐషర్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ లాల్ ప్రకారం  ఐరోపాలో మిడిల్ వెయిట్ స్పేస్‌లో 7 శాతం, అమెరికా ఖండంలో 5 శాతం, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 7 శాతం మార్కెట్ వాటా ఉంది .
 

23

 రెట్రో బైక్ తయారీ సంస్థ విదేశీ మార్కెట్‌లను లక్ష్యంగా చేసుకొంటు ప్రస్తుతం జీరో-ఎమిషన్ వాహనాలపై పని చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఇంజినీరింగ్ పనులు కొనసాగుతున్నాయని, అయితే ప్రాడక్ట్ సైకిల్ "సూపర్ లాంగ్" గా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ నుండి ఎలక్ట్రిక్ బైక్  ఇంకా సంవత్సరాల దూరంలో ఉంది ఇంక్ రాయల్ ఎన్ఫీల్డ్ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు సంబంధించి ఎన్నో కొత్త ICE మోడళ్లను పరీక్షిస్తోంది.
 

33

గత ఏడాది చివర్లో, రాయల్ ఎన్‌ఫీల్డ్ SG650 కాన్సెప్ట్‌, 650 ట్విన్స్ 120వ వార్షికోత్సవ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. కంపెనీ J-సిరీస్ ఇంజిన్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా  స్క్రాంబ్లర్‌ను పరీక్షిస్తోంది దీనికి హంటర్ 350 అని పేరు పెట్టవచ్చు. దీనిని ఈ క్యాలెండర్ సంవత్సరం మధ్యలో విక్రయించవచ్చని, హోండా CB350 RS అండ్ Yezdi స్క్రాంబ్లర్  వంటి వాటిపై నుండి దృష్టిని ఆకర్షించవచ్చు.
 

click me!

Recommended Stories