3డి సరౌండ్ కెమెరా, అప్ డేట్ ఫీచర్లతో కొత్త పవర్‌ఫుల్ ఎస్‌యూవీ లాంచ్.. ధర, ఫీచర్స్ తెలుసా.. ?

First Published Jul 6, 2021, 3:20 PM IST

టాటా మోటార్స్ యాజమాన్యంలోని బ్రిటిష్ లగ్జరీ వాహనాల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఈ మధ్యకాలంలో కొత్త  అప్ డేటెడ్ మోడళ్లను ప్రవేశపెట్టడంతో పాటు ఉత్పత్తి, లాంచ్‌లపై  దూకుడుగా ఉంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్  ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో  తాజాగా  ఎవోక్ అప్ డేట్ కారు వచ్చి చేరింది. 

రేంజ్ రోవర్ ఎవోక్ 2021ను ఇండియన్ మార్కెట్లో ఎక్స్-షోరూమ్ ధర రూ .64.12 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల చేసింది. అయితే దీనితో పాటు జాగ్వార్ ల్యాండ్ రోవర్ భారతదేశంలో కొత్త రేంజ్ రోవర్ ఎవోక్ డెలివరీలను ప్రారంభించినట్లు ప్రకటించింది.
undefined
జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ సూరి మాట్లాడుతూ “రేంజ్ రోవర్ ఎవోక్ ప్రత్యేకమైన, ఆధునిక అండ్ స్మార్ట్ డిజైన్‌తో ప్రేక్షకులను మరింత ఆకర్షిస్తుంది. కొత్త ఇంటీరియర్ కలర్‌వేస్ అలాగే సరికొత్త ల్యాండ్ రోవర్ టెక్నాలజీ దీనిలో ప్రవేశపెడుతూ తీసుకొచ్చారు. స్టైలింగ్ మరింత మెరుగుపరుస్తూ, కొత్త ఇంజన్ మరింత శక్తివంతమైన, సామర్థ్యాన్ని కలిగిస్తుంది. "అని అన్నారు.
undefined
బుకింగ్ అండ్ డెలివరీకొత్త రేంజ్ రోవర్ ఎవోక్ 2021 ఎస్‌యూవీని కొనాలనుకునే వినియోగదారులు ఇప్పుడు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. ఇందుకు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో ద్వారా కొత్త ఎస్‌యూవీ ఆన్‌లైన్‌ బుకింగులను కూడా ప్రారంభించింది.
undefined
కొత్త లేటెస్ట్ ఫీచర్స్ల్యాండ్ రోవర్ కొత్త ఎవోక్ మొదటిసారి డీప్ గార్నెట్ అండ్ ఎబోనీ కలర్ ఆప్షన్స్ తో పరిచయం చేశారు. పివి ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఈ కొత్త అప్‌డేట్ చేసిన ఎస్‌యూవీలో లభించే మొదటి ఫీచర్స్ లో ఒకటి. ఇది ఇప్పటివరకు ఉన్న ల్యాండ్ రోవర్ అత్యంత అధునాతన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇంకా గతంలో దాని టాప్-ఆఫ్-లైన్ మోడళ్లలో మాత్రమే అందుబాటులో ఉంది. కొత్త రేంజ్ రోవర్ ఎవోక్ 3డి సరౌండ్ కెమెరా, పిఎమ్ 2.5 ఫిల్టర్‌తో క్యాబిన్ ఎయిర్ అయానైజేషన్, ఫోన్ సిగ్నల్ బూస్టర్‌తో వైర్‌లెస్ డివైస్ ఛార్జింగ్ వంటి అద్భుతమైన కొత్త ఫీచర్లను అందించారు.
undefined
ఇంజన్ అండ్ పవర్ఈ లగ్జరీ ఎస్‌యూవీ రేంజ్ రోవర్ ఎవోక్ 2021ను నెక్స్ట్ జనరేషన్ 4-సిలిండర్ డీజిల్ ఇంజన్, పెట్రోల్ ఇంజిన్‌తో విడుదల చేశారు. 2.0ఎల్ పెట్రోల్‌పై ఆర్-డైనమిక్ ఎస్‌ఇ ట్రిమ్‌లో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ 184 కిలోవాట్ల శక్తిని, 365 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 2.0 ఎల్ డీజిల్ పవర్‌ట్రెయిన్‌పై ఎస్ ట్రిమ్‌లో 2.0 లీటర్ డీజిల్ ఇంజన్, 150 కిలోవాట్ల శక్తిని, 430 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
undefined
కొత్త రేంజ్ రోవర్ ఎవోక్ భారతీయ కార్ల మార్కెట్లో వోల్వో ఎక్స్‌సి 60, మెర్సిడెస్ జిఎల్‌సి వంటి కార్లకు పోటీని ఇస్తుంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ దేశవ్యాప్తంగా 28 అధీకృత ఔట్‌లెట్లను కలిగి ఉంది. కంపెనీ కార్లు దేశంలోని 24 నగరాల్లో అహ్మదాబాద్, ఔరంగాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, చండీఘడ్, చెన్నై, కోయంబత్తూర్, ఢీల్లీ, గుర్గావ్, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, కోల్‌కతా, కొచ్చి, కర్నల్, లక్నో, లుధియానా, మంగుళూరు నోయిడా, పూణే, రాయ్‌పూర్, విజయవాడ, సూరత్‌లో లభిస్తుంది. కొత్త రేంజ్ రోవర్ ఎవోక్ గురించి మరింత సమాచారం కోసం మీరు www.landrover.inని చూడవచ్చు.
undefined
click me!