కొత్త కారు కొనాలనుకునే వారిని ఆకర్షించేందుకు మారుతి బాలెనో సరికొత్త మార్పులతో మార్కెట్లోకి వచ్చేసింది. మారుతి సుజుకి తన కొత్త బాలెనోను అతి తక్కువ ధరలో అత్యాధునిక ఫీచర్లలో విడుదల చేసింది.
మారుతి సుజుకి తన పాపులర్ కారు బాలెనోను సరికొత్త మార్పులతో భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కొత్త బాలెనో ప్రారంభ ధర కేవలం 6,09,900 రూపాయలు మాత్రమే… ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే కేవలం రూ.11,000 చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఈ సరికొత్త మోడల్‌ను మారుతి సుజుకి తన నెక్సా షోరూమ్‌ల ద్వారా అమ్ముతోంది. ఈసారి బాలెనో లుక్‌లోనే కాదు సేఫ్టీ, కంఫర్ట్, టెక్నాలజీ ఫీచర్లలో కూడా చాలా మార్పులు చేసింది మారుతి సుజుకి.
25
మారుతి బాలెనో అత్యాధునిక ఫీచర్లు
కొత్త బాలెనోలో అతిపెద్ద హైలైట్ లెవెల్ 2 ADAS (Advanced Driver Assistance Systems). దీంతో ఈ కారు డ్రైవింగ్ మరింత సౌకర్యవంతంగా మారింది. రాడార్, కెమెరా సాయంతో పనిచేసే ఈ సేఫ్టీ సిస్టమ్‌లో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, హై బీమ్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, EBD(Electronic Brakeforce Distribution), హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి భద్రతా ఫీచర్లు కూడా ఇచ్చారు.
35
కొత్త బాలెనోలో అదిరిపోయే ఇంటీరియర్
ఫీచర్ల విషయానికొస్తే.. కొత్త బాలెనో ముందు సీట్లలో వెంటిలేటెడ్ (కూలింగ్) సదుపాయం కల్పించారు. లెథెరెట్ సీట్ కవర్లు, డ్యూయల్-టోన్ ఇంటీరియర్, 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ కనెక్టివిటీ, వైర్‌లెస్ ఛార్జింగ్, 360-డిగ్రీ కెమెరా, హెడ్-అప్ డిస్‌ప్లే వంటివి ఉన్నాయి. దీనికితోడు క్లారియన్ కంపెనీ ఆడియో సిస్టమ్‌ను కూడా అందించారు. సుజుకి కనెక్ట్ ఫీచర్ ద్వారా వెహికల్ సెక్యూరిటీ, ట్రిప్ సమాచారం, లొకేషన్ అలర్ట్స్, కొన్ని రిమోట్ కంట్రోల్ ఫీచర్లను కూడా వాడుకోవచ్చు.
కొత్త బాలెనో ఇంజిన్‌లో కూడా మార్పులు చేశారు. ఇందులో 1,197cc Z12E పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్ఠంగా 82.93 హార్స్‌పవర్, 112.4 న్యూటన్ మీటర్ల టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. మ్యాన్యువల్ పెట్రోల్ మోడల్ లీటర్‌కు 23.80 కిలోమీటర్లు, ఆటోమేటిక్ మోడల్ 24.77 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి ఇందులో స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ కూడా ఉంది.
55
బాలెనో సీఎన్‌జీ వేరియంట్
పెట్రోల్ మోడల్‌తో పాటు కొత్త Z12E ఇంజిన్‌తో S-CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఇచ్చారు. CNG మోడ్‌లో ఈ కారు కిలోకు 33.61 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని మారుతి సుజుకి తెలిపింది.
బయటివైపు వెడల్పైన కొత్త నెక్స్‌వేవ్ ఫ్రంట్ గ్రిల్, మార్పులు చేసిన ఫ్రంట్ బంపర్, కొత్త గార్నిష్, కొత్త ఎనిగ్మాటిక్ టీల్ కలర్ ఆప్షన్ వంటివి జోడించారు. మొత్తంగా పాత బాలెనో డిజైన్‌ను కొనసాగిస్తూనే సేఫ్టీ, కంఫర్ట్, టెక్నాలజీలో భారీ అప్‌గ్రేడ్స్‌తో ఈ కొత్త మోడల్ వచ్చింది.