హెన్నెస్సీ పెర్ఫార్మెన్స్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలో ఈ బాస్కెట్‌బాల్ ప్లేయర్ తో కంపెనీ CEO జాన్ హెన్నెస్సీ ఈ కన్వర్టిబుల్ కారుతో నిలబడి ఉన్నట్లు చూడొచ్చు. ఈ పోస్ట్ కి “ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు. ప్రత్యేకమైన స్నేహితుని కోసం ప్రత్యేకమైన వెనం ఎఫ్5ని నిర్మించడం చాలా గౌరవం అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు.
గతంలో నివేదించినట్లుగా కేవలం 30 కార్లు మాత్రమే తయారీ చేయబడ్డాయి. ఈ కార్ ధర $3 మిలియన్లు అంటే సుమారు రూ.29 కోట్లు, ప్రతి ఒక్కటి వ్యక్తిగతంగా కారు యజమానికి అప్పగించబడుతుంది. కంపెనీ దీనిని "ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన ఇంకా అత్యంత శక్తివంతమైన కన్వర్టిబుల్" అని పేర్కొంది.
"మేము ఒక హైపర్‌కార్ వెనమ్ F5ని సృష్టించాము" అని జాన్ హెన్నెస్సీ ఒక ప్రకటనలో కూడా తెలిపారు. ఈ హైపర్‌కార్ కంపెనీ గత సెప్టెంబర్‌లో మియామీ షోరూమ్‌ను ప్రారంభించింది.
హెన్నెస్సీ మరో శక్తివంతమైన కారుని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు వేస్తున్నట్లు గతంలో కొన్ని నివేదికలు నివేదించాము. ప్రాజెక్ట్ డీప్ స్పేస్ అనే కోడ్‌నేమ్, కార్ సెంట్రల్ డ్రైవింగ్ పొజిషన్‌తో "డైమండ్ సీటింగ్ కాన్ఫిగరేషన్" ఉంటుందని స్కెచ్‌లు చూపిస్తున్నాయి. ఈ కార్ 2,400 హెచ్‌పిని ఉత్పత్తి చేస్తుందని వాహన తయారీదారి తెలిపారు. 2026 నాటికి ఉత్పత్తిలోకి రావచ్చు.
మైఖేల్ జోర్డాన్ కి అల్ట్రా-ఫాస్ట్ కార్లంటే అంటే ఎంతో ఇష్టం. గంటకు 400 కి.మీ దూసుకుపోయే బుగట్టి వేరాన్ గ్రాండ్ స్పోర్ట్ కారు ఇప్పటికే గ్యారేజీలో ఉంది. ఇంకా పోర్స్చే 911 టర్బో S 993, ఫెరారీ 512 TR , చేవ్రొలెట్ కొర్వెట్టి లాంటి లెజెండ్రీ కార్లు కూడా అతని వద్ద ఉన్నాయి.
మైఖేల్ జోర్డాన్ సొంతం చేసుకున్న ఈ అద్భుతమైన కారులో 6.6-లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజిన్‌న్, 1,842 హార్స్‌పవర్, 1193 గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. కేవలం 2.6 సెకన్లలో 0 - 100 kmph అందుకుంటుంది, దీని టాప్ స్పీడ్ గంటకు 498 కి.మీ. అధిగమిస్తుందని అంచనా. నివేదిక ప్రకారం ఈ కారు ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన , అత్యంత శక్తివంతమైన కన్వర్టిబుల్ కారని కంపెనీ ప్రకటించింది.ఈ కార్ 3098 పౌండ్ల బరువు ఉంటుంది.