టాలీవుడ్ హీరో 7 కోట్ల వ్యానిటీ వ్యాన్ నుండి రేంజ్ రోవర్ వరకు లగ్జరీ కార్లు.. ఒక్కో కారును చూస్తే మతిపోతుంది..

First Published | Apr 11, 2023, 1:42 PM IST

సౌత్ సూపర్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజున ఫ్యాన్స్ హంగామా అంతా ఇంత కాదు. సౌత్ లోనే కాకుండా అతని ఫ్యాన్స్ అల్ ఇండియా మొత్తంలో కూడా ఉన్నారు. అతని స్టయిల్, లగ్జరీ లైఫ్ అతన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. అయితే అల్లు అర్జున్ ఒక్కో ఈవెంట్ లేదా లాంచ్ సమయంలో లగ్జరీ కార్లలో కనిపిస్తుంటారు. దీని బట్టి చూస్తే అతని దగ్గర చాలా లగ్జరీ కార్లు ఊన్నాయి. వీరి ధర కోట్లలో ఉంటుందని అంచన.
 

రేంజ్ రోవర్ వోగ్
అల్లు అర్జున్‌కి ఇష్టమైన కార్లలో ప్రీమియం ఎస్‌యూ‌వి రేంజ్ రోవర్ వోగ్ ఒకటి. ఈ లగ్జరీ కారు ధర రూ.1.88 కోట్ల నుండి రూ.4.03 కోట్ల వరకు ఉంటుంది. అల్లు అర్జున్ ఈ ఎస్‌యూ‌విని తన ఇష్టానుసారం ప్రకారం కస్టమైజ్ చేసుకున్నాడు.

రోల్స్ రాయిస్ 
అల్లు అర్జున్‌కి ఇష్టమైన కార్లలో రోల్స్ రాయిస్ కార్ ఒకటి. తరచుగా ఇందులోనే బయటికి వెళ్తుంటారు. అయితే ఈ కారు తెలుపు రంగులో ఉంటుంది. ఇది కూడా చాలా విలాసవంతమైన కారు.


మెర్సిడెస్ GLE 350D
అల్లు అర్జున్‌కి ఒక బ్లాక్ మెర్సిడెస్ GLE 350d జర్మన్ లగ్జరీ కారు కూడా ఉంది. ఈ కారును కూడా తన కస్టమైజ్ చేసుకున్నాడు. దీనికి సైడ్ గార్డు మీద అతని పేరు కూడా ఉంటుంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర దాదాపు 75 లక్షలు.

వోల్వో XC90 T8 ఎక్సలెన్స్
అల్లు అర్జున్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అతని నటన, డ్యాన్స్ అందరినీ ఆకర్షించేలా ఉంటాయి. అల్లు అర్జున్ కూడా లగ్జరీ సెడాన్ వోల్వో XC90 T8 ఎక్సలెన్స్‌ డ్రైవ్ చేస్తుంటాడు. ఈ కారు ధర రూ.1.35 కోట్లు.
 

జాగ్వార్ XJ L
'పుష్ప' పేరుతో అల్లు అర్జున్ గ్యారేజీలో జాగ్వార్ ఎక్స్‌జె ఎల్ అనే లగ్జరీ కారును కూడా వచ్చి చేరింది. ఈ కారు ధర 1.2 కోట్ల రూపాయలు. ఈ కారులో అల్లు అర్జున్ చాలాసార్లు కనిపించాడు.

హమ్మర్ H2
అల్లు అర్జున్ కు లగ్జరీ మాత్రమే కాదు మస్కులర్ SUVలు కూడా ఇష్టం. అతని వద్ద  75 లక్షల విలువైన హమ్మర్ హెచ్2 కారు ఉంది. దేశంలో కొందరికే ఈ కారు ఉంది. ఇందులో మహేంద్ర సింగ్ ధోనీ, హర్భజన్ సింగ్ వంటి క్రికెటర్లు, సింగర్ మికా సింగ్ పేర్లు ఉన్నాయి.
 

ఫాల్కన్ లగ్జరీ వానిటీ వాన్
సౌత్ సూపర్ స్టార్ అల్లు అర్జున్ కు లగ్జరీ కార్లే కాకుండా ఒక లగ్జరీ వ్యానిటీ వ్యాన్ కూడా ఉంది. ఈ వ్యాన్ ప్యాలెస్ కంటే తక్కువెం కాదు. అతను దీనిని 2019 సంవత్సరంలో కొనుగోలు చేశాడు. ఈ వ్యానిటీ వ్యాన్ పేరు ఫాల్కాన్. ఈ వ్యానిటీ వ్యాన్ అల్లు అర్జున్ షూటింగ్ సమయంలో అతనితో ఉంటుంది. దీని ఖరీదు దాదాపు 7 కోట్లు. దీనితో పాటు, అతనికి ఇతర లగ్జరీ కార్లు, ప్రైవేట్ జెట్ కూడా ఉంది.

Latest Videos

click me!