మారుతి సుజుకి తన పాపులర్ మిడ్-సైజ్ SUV 'విక్టోరిస్' టాప్-ఎండ్ పెట్రోల్ వేరియంట్ ధరలను తగ్గించింది. హ్యుందాయ్ క్రెటాకు గట్టి పోటీ ఇస్తూ అమ్మకాలను పెంచుకోవడానికే ఈ నిర్ణయం తీసుకుంది.
భారత ఆటోమొబైల్ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటాకు గట్టి పోటీ ఇచ్చేందుకు మారుతి సుజుకి సిద్ధమైంది. తన మిడ్-సైజ్ SUV 'విక్టోరిస్' కారులోని కొన్ని పెట్రోల్ వేరియంట్ల ధరలను భారీగా తగ్గించింది. ఎంపిక చేసిన మోడళ్ల ఎక్స్-షోరూమ్ ధరపై గరిష్ఠంగా రూ.39,000 వరకు కోత విధించింది. ఈ కొత్త ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని కంపెనీ ప్రకటించింది.
25
ఏ మోడల్ ధర ఎంత తగ్గింది?
ఈ ధరల తగ్గింపు కేవలం పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే టాప్-ఎండ్ వేరియంట్స్ ZXi (O), ZXi ప్లస్ (O) మోడళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ రెండు వేరియంట్లలోని మ్యాన్యువల్ (MT), ఆటోమేటిక్ (AT) గేర్‌బాక్స్ కలిగిన మొత్తం నాలుగు మోడళ్ల ధరలను కంపెనీ తగ్గించింది.
ZXi (O) పెట్రోల్ మ్యాన్యువల్ వేరియంట్‌పై అత్యధికంగా 2.76% ధర తగ్గింది. అలాగే ZXi (O) పెట్రోల్ ఆటోమేటిక్‌పై 2.49%, ZXi ప్లస్ (O) పెట్రోల్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ మోడళ్లపై 2.46% చొప్పున ధరలు తగ్గాయి.
35
ఈ మోడల్ ధరల్లో మార్పు లేదు
విక్టోరిస్ కారులోని బేస్, మిడ్ వేరియంట్స్ LXi, VXi, ZXi, ZXi ప్లస్ (న్యాచురల్లీ ఆస్పిరేటెడ్) పెట్రోల్ ఇంజిన్ ఫ్రంట్-వీల్ డ్రైవ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ మోడళ్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. అవి పాత ధరలకే అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు CNG, ఎక్కువ మైలేజీనిచ్చే స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడళ్ల ధరల్లో కూడా ఎటువంటి మార్పు లేదు.
చాలా ఆటోమొబైల్ కంపెనీలు కార్ల ధరలను పెంచుతున్న ఈ సమయంలో, మారుతి తన పాపులర్ SUV ధరను తగ్గించడం మార్కెట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం విక్టోరిస్ కారు C-సెగ్మెంట్ మిడ్-సైజ్ SUV విభాగంలో దేశంలోనే రెండో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు. అయినప్పటికీ పండుగ సీజన్‌కు ముందు కస్టమర్లను మరింత ఆకర్షించడానికి, ఈ సెగ్మెంట్‌లో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి కంపెనీ ఈ వ్యూహాన్ని అనుసరించిందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
55
విక్టోరిస్ కారుకు పోటీదారులు ఎవరు?
భారత మార్కెట్లో మారుతి విక్టోరిస్‌కు చాలా గట్టి పోటీ ఉంది. ఇది హ్యుందాయ్ క్రెటా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, మారుతి మరో మోడల్ గ్రాండ్ విటారా, టాటా సియెరా, రెనాల్ట్ డస్టర్, హోండా ఎలివేట్ వంటి కార్లకు నేరుగా పోటీ ఇస్తుంది. రాబోయే రోజుల్లో నిస్సాన్ టెక్టాన్ కూడా ఈ సెగ్మెంట్‌లో అడుగుపెట్టనుండటంతో పోటీ మరింత తీవ్రం కానుంది.