Maruti Cars : ఏమిటీ... ఈ మారుతి కారుపై డిస్కౌంటే రూ.2.15 లక్షలా..!

Published : May 09, 2026, 12:39 PM IST

మారుతి సుజుకి మే 2026 నెల కోసం అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది. కస్టమర్లు రూ.2.15 లక్షల వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో ధర తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

PREV
15
మారుతి కార్లపై మెగా ఆఫర్లు..

ఈ నెలలో (మే 2026) కొత్త కారు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. మారుతి సుజుకి తన పాపులర్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ఆఫర్ల కింద మొత్తం రూ.2.15 లక్షల వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా మారుతి సుజుకి బ్రెజా, గ్రాండ్ విటారా, ఇన్విక్టో వంటి మోడళ్లపై ఈ ఆఫర్లు ఉన్నాయి.

25
మారుతి కార్లపై డిస్కౌంట్ కాదు.. అంతకుమించి

ఈ ఆఫర్లు కేవలం ధర తగ్గింపు మాత్రమే కాదు. కంపెనీ కస్టమర్ డిస్కౌంట్, డీలర్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బోనస్, స్క్రాపేజ్ ఆఫర్, కార్పొరేట్ ఆఫర్ వంటి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్లన్నీ మే నెలాఖరు వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

35
మారుతి సుజుకి బ్రెజా

మారుతి సుజుకి బ్రెజా కారుపై గరిష్ఠంగా రూ.55,000 వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ ఎస్‌యూవీ ధర రూ.8.26 లక్షల నుంచి రూ.13.01 లక్షల మధ్య ఉంది. 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ మోడల్‌లో మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. సీఎన్‌జీ వేరియంట్ కూడా అందుబాటులో ఉండటం మరో విశేషం.

45
మారుతి సుజుకి గ్రాండ్ విటారా

మారుతి సుజుకి గ్రాండ్ విటారా హైబ్రిడ్ మోడల్ కొనుగోలు చేసే కస్టమర్లు రూ.1.85 లక్షల వరకు రోడ్ ట్యాక్స్ ఆదా చేసుకోవచ్చు. దీనికి అదనంగా రూ.90,000 వరకు ఇతర ప్రయోజనాలు, 5 ఏళ్ల ఉచిత ఎక్స్‌టెండెడ్ వారంటీ కూడా లభిస్తాయి. ఈ కారు పెట్రోల్, హైబ్రిడ్, సీఎన్‌జీ అనే మూడు ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

55
మారుతి సుజుకి ఇన్విక్టో
ఈ నెలలో అత్యధిక డిస్కౌంట్ లభించే మోడల్ మారుతి సుజుకి ఇన్విక్టో. ఈ ఎంపీవీ కారుపై ఏకంగా రూ.2.15 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. రూ.24.97 లక్షల నుంచి రూ.28.60 లక్షల ధర ఉన్న ఈ కారు, 2.0-లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్‌తో 184 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. సుదూర ప్రయాణాలకు అనువైన ఫీచర్లతో, స్మూత్ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.
Read more Photos on
click me!

Recommended Stories