మారుతి ఫ్రాంక్స్ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.90 లక్షల నుంచి రూ.12.03 లక్షల వరకు ఉంది. మనం ఎంచుకునే వేరియంట్, ఇంజిన్, ఫీచర్లను బట్టి ధర మారుతుంది. ఇవి కేవలం ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే. దీనికి రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కలిపితే ఆన్-రోడ్ ధర పెరుగుతుంది. అందుకే కారు కొనేముందు దగ్గర్లోని షోరూమ్‌కు వెళ్లి కచ్చితమైన ధర తెలుసుకోవడం మంచిది. బేస్ వేరియంట్ తీసుకోవాలా లేక టాప్ ఎండ్ మోడల్ తీసుకోవాలా అనేది మీ బడ్జెట్‌ను బట్టి డిసైడ్ చేసుకోండి. లోన్ తీసుకునేవాళ్లు ఈఎంఐతో పాటు డౌన్ పేమెంట్, వడ్డీ, ఇన్సూరెన్స్ ఖర్చులను కూడా లెక్కేసుకోవాలి. అనవసరమైన ఫీచర్ల కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకండి.
సేఫ్టీ ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఇప్పుడు కారు కొనేవాళ్లు లుక్స్, మైలేజ్‌తో పాటు సేఫ్టీకి కూడా పెద్ద పీట వేస్తున్నారు. ఫ్రాంక్స్ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఏబీఎస్ (ABS), ఈబీడీ (EBD) లాంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. కొన్ని వేరియంట్లలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) కూడా ఇస్తున్నారు. అయితే ఈ ఫీచర్లు అన్ని వేరియంట్లలో ఉన్నాయో లేదో కొనేముందు చెక్ చేసుకోండి.
కేవలం ఎయిర్‌బ్యాగ్స్ ఉంటేనే కారు సేఫ్ అని చెప్పలేం. క్రాష్ టెస్ట్ రేటింగ్స్, చైల్డ్ సేఫ్టీ, కారు బిల్డ్ క్వాలిటీ కూడా ముఖ్యమే. ఓవరాల్‌గా చూస్తే ఫ్రాంక్స్ సేల్స్ దాని క్రేజ్‌ను చెబుతున్నాయి. కానీ మీకు ఏ కారు సెట్ అవుతుందో తెలియాలంటే.. ధర, మైలేజ్, స్పేస్, సేఫ్టీ, మెయింటెనెన్స్ ఖర్చులను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోండి.