Mahindra XUV300:మొదటిసారిగా మహీంద్రా ఎక్స్‌యూ‌వి అప్ డేట్ వెర్షన్.. కొత్తది ఏమిటో తెలుసుకోండి

Ashok Kumar   | Asianet News
Published : Jun 21, 2022, 04:10 PM IST

మహీంద్రా తాజాగా దక్షిణాఫ్రికా మార్కెట్లో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కొత్త 9-అంగుళాల డిస్‌ప్లేతో పాపులర్ కాంపాక్ట్ SUV XUV300ని అప్ డేట్ చేసింది. భారతీయ మార్కెట్‌లో విక్రయించే మోడల్‌లో కూడా కంపెనీ దీన్ని త్వరలో అందుబాటులోకి తెస్తుందని భావిస్తున్నారు. భారతదేశంలో ప్రస్తుత XUV300 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుంది.   

PREV
14
Mahindra XUV300:మొదటిసారిగా మహీంద్రా ఎక్స్‌యూ‌వి అప్ డేట్ వెర్షన్..  కొత్తది ఏమిటో తెలుసుకోండి

కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వైర్‌లెస్ Apple CarPlay అండ్ Android Autoతో వస్తుంది. ఈ కాంపాక్ట్ SUV మొబైల్ ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌ను కూడా పొందుతుంది. ప్రస్తుత మోడల్‌లో అందుబాటులో ఉన్న మిగిలిన ఫీచర్లతో సహా టాప్ వేరియంట్‌లలో ఈ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. కొత్త డిస్‌ప్లే 1024×600 రిజల్యూషన్‌తో ఉంటుంది. దీనికి 1.5GHz క్వాడ్ CPU ద్వారా శక్తిని పొందుతుంది, ఇంకా లోడ్-అప్‌ను పెంచుతుంది అలాగే గొప్ప పనితీరును అందిస్తుంది. 
 

24

కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్
XUV300 భారతదేశంలో ఇప్పటికే అందించబడుతున్న అల్లాయ్ వీల్స్ కోసం కొత్త డిజైన్‌ను పొందింది. మల్టీ-స్పోక్ 5-ప్రాంగ్ డిజైన్  ఈ కొత్త ఫ్యాన్ లాంటి ప్యాటర్న్ టాప్-స్పెక్ W8(O) వెర్షన్‌లో మాత్రమే ఉంటుంది. కొత్త అల్లాయ్ వీల్స్  పాత వాటి కంటే ఇప్పుడు చిన్న పరిమాణంలో ఉన్నాయి.
 

34

2019లో లాంచ్ తర్వాత XUV300కి  మొదటి ప్రధాన కాస్మెటిక్ అప్‌డేట్. మహీంద్రా XUV300  అన్ని వేరియంట్లలో 205/65 R16 వీల్స్  ఉన్నాయి. లో ట్రిమ్‌లు కవర్‌లతో ఉక్కు వీల్స్ పొందుతాయి. అల్లాయ్ వీల్స్ W8 అండ్ W8(O) వేరియంట్‌లలో మాత్రమే అందించబడతాయి. 

44

కొత్త స్పోర్ట్స్ ఎడిషన్
XUV300 Sportz స్పెసిఫికేషన్స్ ఇటీవల లీక్ అయ్యాయి. కంపెనీ కొత్త XUV300 స్పోర్ట్జ్ ఎడిషన్‌ను విడుదల చేయబోతోందని, ఇంకా టర్బో పెట్రోల్ ఇంజన్‌తో వస్తుందని పుకారు వచ్చింది. ఈ ఇంజన్ అవుట్‌పుట్ 128bhp అండ్  6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో  వస్తుంది.

click me!

Recommended Stories