Ola Electric Car:ఓలా ఎలక్ట్రిక్ సెడాన్ ఫస్ట్ లుక్.. ఫుల్ ఛార్జ్‌తో మైలేజ్, లాంచ్ ఎప్పుడంటే..?

Ashok Kumar   | Asianet News
Published : Jun 21, 2022, 02:32 PM IST

ఎలక్ట్రిక్ వాహన స్టార్టప్ ఓలా (Ola) తమిళనాడులోని కృష్ణగిరి సమీపంలో 'ఓలా కస్టమర్ డే'ని జరుపుకుంది. ఈ సందర్భంగా కంపెనీ  రాబోయే ప్రీమియం ఎలక్ట్రిక్ కారు టీజర్‌ను విడుదల చేసింది. మొదటి ఓలా ఎలక్ట్రిక్ కారు స్పోర్టీ సెడాన్ కానుందని టీజర్ వెల్లడించింది. కూపే రూఫ్-లైన్ అండ్ లేటెస్ట్ డిజైన్ లాంగ్వేజ్ ఎలక్ట్రిక్ సెడాన్‌లో కనిపిస్తాయి.  

PREV
13
Ola Electric Car:ఓలా ఎలక్ట్రిక్ సెడాన్ ఫస్ట్ లుక్..  ఫుల్ ఛార్జ్‌తో  మైలేజ్, లాంచ్  ఎప్పుడంటే..?

ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే భారత్-కేంద్రీకృత ఉత్పత్తితో ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ విభాగంలోకి ప్రవేశించాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ ప్రస్తుతం ఓలా ఎస్1 అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విక్రయిస్తోంది, దీనికి కొనుగోలుదారుల నుండి సానుకూల స్పందన వచ్చింది. అయితే Ola S1 కస్టమర్‌లు నాణ్యత, విశ్వసనీయత, డెలివరీ టైమ్‌లైన్‌కు సంబంధించి ఎన్నో సమస్యలను పేర్కొన్నారు.


లాంచ్ ఎప్పుడు 
ఓలా ఎలక్ట్రిక్ సెడాన్ ఉత్పత్తి 2023 ద్వితీయార్థంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయ EV స్టార్ట్-అప్ నుండి Ola ఇప్పటికే ఉన్న ప్లాట్‌ఫారమ్ లేదా EV నిర్మాణాన్ని మాత్రమే స్వాధీనం చేసుకోవచ్చని భావిస్తున్నారు. అయితే, ఓలా  ఎలక్ట్రిక్ కారు కోసం  సొంత ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేస్తోందని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. దీని ద్వారా Ola ఖర్చులను తక్కువగా ఉంచడానికి ఇంకా స్థానికీకరణ  అధిక స్థాయిని సాధించడంలో సహాయపడుతుంది.

23

లుక్ అండ్ డిజైన్ ఎలా ఉందంటే 
ఓలా విడుదల చేసిన ఎలక్ట్రిక్ కారు టీజర్  ఆకర్షణీయమైన సెడాన్  3D రెండరింగ్‌ను వెల్లడిస్తుంది. సెడాన్ ముందు భాగం చాలా తక్కువ స్లంగ్ అంటే చాలా తక్కువ. వాహనం  వెడల్పు అంతటా విస్తరించి ఉన్న LED లైటింగ్ సిగ్నేచర్‌తో వాహనం ప్రత్యేకంగా స్టైల్ చేసిన ముందు ముఖాన్ని పొందుతుంది. దీనితో పాటు, ముందు భాగంలో స్ట్రాంగ్ క్రీజులు కూడా కనిపిస్తాయి. సెడాన్ ఒక వంపు తిరిగిన రూఫ్‌లైన్, LED బార్‌కు  షార్ప్ టెయిల్-లైట్లు, స్టైలిష్ టెయిల్‌గేట్‌ను పొందుతుంది.

ఈ ఎలక్ట్రిక్ సెడాన్ గురించి మరిన్ని వివరాలను ఆగస్టు 15న వెల్లడిస్తామని ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు. మహీంద్రా మాజీ డిజైనర్ రామ్‌కృపా  ఓలా ఎలక్ట్రిక్‌లో చేరినట్లు కూడా సమాచారం.

33

రేంజ్ అండ్ ధర
ఓలా ఎలక్ట్రిక్ సెడాన్ 70-80kWh పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో వస్తుందని అంచనా, దీని ద్వారా ఎక్కువ రేంజ్ అందించే అవకాశం ఉంది. టాటా మోటార్స్ నుండి వచ్చిన Nexon EV మ్యాక్స్ 40.5kWh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది, ఈ బ్యాటరీ 437km పరిధిని క్లెయిమ్ చేస్తుంది. Kia EV  77kWh బ్యాటరీ 528 వరకు పరిధిని ఇవ్వగలదు.

అటువంటి పరిస్థితిలో, ఓలా ఎలక్ట్రిక్ సెడాన్ 500 కిమీ కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని ఆశించవచ్చు. దీంతో సెడాన్ ధర కూడా పెరుగుతుంది. దీని ధర దాదాపు రూ.25 లక్షలు ఉండే అవకాశం ఉంది. 

click me!

Recommended Stories