Renault KWID దీని ధర - 4.64 లక్షలు. రెనాల్ట్ కార్లు వాటి లుక్స్ ఇంకా ధరల కారణంగా భారతీయ మార్కెట్లో వీటినకి ప్రాధాన్యతనిస్తారు. దేశంలో ఈ వాహనానికి మంచి డిమాండ్ కూడా ఉంది. తక్కువ ధరలో కార్లు కొనాలనుకునే వారు దీన్ని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవచ్చు.
3.39 లక్షల ధరతో మారుతి ఆల్టో కార్ పెట్రోల్ ఇంజన్ అలాగే సిఎన్‌జి ఇంజన్‌తో వస్తుంది. పెట్రోల్ ఇంజన్లు 796 సిసి, 1061 సిసి, సిఎన్‌జి ఇంజన్ 796 సిసితో వస్తున్నాయి. ఈ కార్ మాన్యువల్ గేర్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. ఆల్టో కార్ మైలేజ్ సిఎన్‌జి/ పెట్రోల్ వేరియంట్‌పై ఆధారపడి 18.9 kmpl నుండి 26.83 kmpl వరకు ఇస్తుంది.
హ్యుందాయ్ శాంత్రో ధర రూ. 4.89 లక్షలు. హ్యుందాయ్ శాంత్రో 4-సిలిండర్, 1.1-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 68 bhp పవర్, 99 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది
మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో ధర 3.99 లక్షలు. S-ప్రెస్సో పవర్‌ట్రెయిన్ 1.0 లీటర్ K10B పెట్రోల్ ఇంజన్ తో లభిస్తుంది. ఈ ఇంజన్ 67 బిహెచ్‌పి పవర్, 90 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. దీనిని 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMTతో అందిస్తున్నారు. అంతే కాకుండా ఈ కారు ఫ్యాక్టరీ ఫిట్టేడ్ CNG కిట్‌తో వస్తుంది. LXI, LXI (o) మరియు VXI (o) అనే మూడు వేరియంట్‌లలో లభిస్తుంది.
ఇక్కడ పేర్కొన్న ధరలు అన్ని ఢిల్లీ ఎక్స్ షోరూమ్ చెందినవి.