ఫెస్టివల్ సీజన్ సందర్భంగా 100కు పైగా గొప్ప ఫీచర్లతో టయోటా ఇన్నోవా లిమిటెడ్ ఎడిషన్..

First Published | Oct 20, 2021, 1:45 PM IST

ఈ పండుగ సీజన్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ ను విడుదల చేసింది. ఇప్పుడు నాణ్యత, దృఢత్వం, విశ్వసనీయత  ప్రస్తుత ట్రెడిషన్ కి జోడిస్తు ఉత్తేజకరమైన, ఆహ్లాదకరమైన వినూత్న టెక్నాలజి ఫీచర్స్ తో వస్తుంది.  ఈ మొత్తం ప్యాకేజీ ఐకానిక్ ఎం‌పి‌వి వినియోగదారుడి అనుభవాన్ని మెరుగుపరచడానికి రూపొందించారు.

ఇన్నోవా క్రిస్టాలో ఇప్పుడు మరిన్ని ఎన్నో ఫీచర్లు జోడించింది. ఈ కారులో ఎన్నో లేటెస్ట్ కనెక్టివిటీ ఫంక్షన్‌లతో పాటు, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కొత్త డిస్‌ప్లే ఇచ్చింది. అంతే కాకుండా  చదరపు ఆకారంలో పియానో ​​బ్లాక్ గ్రిల్, లౌడ్ హెడ్‌ల్యాంప్‌లు, ఆకర్షణీయమైన డైమండ్ కట్ అల్లాయ్‌, బ్లాక్ లేదా క్యామెల్ తాన్ ఇంకా హాజెల్ బ్రౌన్ వంటి ఇంటీరియర్ కలర్ ఆప్షన్, భద్రత పరంగా 7 ఎస్‌ఆర్‌ఎస్ ఎయిర్ బ్యాగ్స్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, ఎకో అండ్ పవర్ డ్రైవ్ మోడ్‌లు, క్రూయిజ్ కంట్రోల్ ఇంకా 100 ఇతర గొప్ప ఫీచర్లను జోడించింది. 
 

స్పెషల్ ఫీచర్స్
 అప్‌డేట్ ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌లో కొన్ని కొత్త ఫీచర్లు చాలా ప్రత్యేకంగా ఉంటాయి 
మల్టీ టెర్రైన్ మానిటర్ (360 -డిగ్రీ కెమెరా) 
హెడ్స్ అప్ డిస్‌ప్లే (HUD) 
టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్   
వైర్‌లెస్ ఛార్జర్ 
డోర్ లైట్లు  
ఎయిర్ ఐయోనైజర్  


దీని విలాసవంతమైన ఇంటీరియర్ లగ్జరీ అండ్ ఎక్సలెన్స్‌తో నిండి ఉంది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్ అండ్ బంపర్లు రోడ్డుపై దాని ఉనికిని ఇంకా  ఇతర వాటి  కంటే మైళ్ల ముందు ఉంచుతుంది. లిమిటెడ్ ఎడిషన్ ఫీచర్లు, లభ్యత డీలర్‌షిప్‌లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే  ఉంటాయి. 

 లాంచ్ గురించి టొయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్ & స్ట్రాటజిక్ మార్కెటింగ్ అసోసియేట్ జనరల్ మేనేజర్ (AGM) వి విసెలెన్ సిగమణి మాట్లాడుతూ, "ఇన్నోవా ప్రారంభించినప్పటి నుండి ఎం‌పి‌వి విభాగంలో తిరుగులేని లీడర్ అందువల్ల మా ఫ్లాగ్‌షిప్‌ ఉత్పత్తులలో  ఒకటి. ఇన్నోవా క్రిస్టా 100 ఫీచర్లను తీసుకురావడానికి మేము ఒక క్యాంపైన్ ప్లాన్ చేసాము. వీటిలో టెక్నాలజీ, లగ్జరీ, సాటిలేని కంఫర్ట్, సౌలభ్యం, నాణ్యత, బలం టయోటా విశ్వసనీయత ఉన్నాయి, తద్వారా బెస్ట్ ఇన్ క్లాస్ లో ఒకటి అవుతుంది. 

అభివృద్ధి చెందుతున్న ట్రెండ్‌లు, కస్టమర్ ప్రాధాన్యతలకు అనుగుణంగా మా ఉత్పత్తులను నిరంతరం అప్‌గ్రేడ్ చేయడమే మా ప్రయత్నం. ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ (స్పెషల్ ఫెస్టివల్ ఆఫర్) ప్రత్యేకతను అందించడానికి రూపొందించారు. ఈ ప్యాకేజీ పండుగల సందర్భంగా ప్రత్యేకంగా ప్రవేశపెట్టరు. అలాగే  మా 9 లక్షల మందికి పైగా నమ్మకమైన కస్టమర్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము " " అని అన్నారు.

Latest Videos

click me!