ఫ్యూచరిస్టిక్ డిజైన్లతో వస్తున్న ఈ హోండా ఎలక్ట్రిక్ వాహనాలు మీ మనస్సును కదిలిస్తాయి.. ఫోటోస్ చూసారా..

First Published Oct 18, 2021, 8:36 PM IST

న్యూఢిల్లీ: చైనాలో ఎలెక్ట్రిఫికేషన్ వ్యూహంపై హోండా(honda) తాజాగా వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా హోండా కొత్త పర్యావరణ, సేఫ్టీ కార్యక్రమాలను అలాగే  వరల్డ్ ప్రీమియర్ రెండు ప్రణాళికాబద్ధమైన ప్రొడక్షన్ మోడల్స్, హోండా-బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాల (electric vehicle) మూడు కాన్సెప్ట్ మోడల్స్ ని కూడా నిర్వహించింది.

హోండా కంపెనీ 2030 తర్వాత చైనాలో ప్రవేశపెట్టే అన్ని కొత్త మోడళ్లు హైబ్రిడ్ (HEVs) ఈ‌వి (EV)ల వంటిని విద్యుదీకరణ చేయనుంది. హోండా సంస్థ మొట్టమొదటి పది హోండా-బ్రాండ్ ఈ‌వి మోడళ్లను చైనాలో వచ్చే ఐదు సంవత్సరాలలో "e:N సిరీస్" కింద పరిచయం చేయనుంది. అలాగే ఈ మోడెల్స్ ని చైనా నుండి ఎగుమతి చేస్తుంది. 

మొట్ట మొదటి సెట్ e:N సిరీస్ మోడల్స్ లోని  e:NS1, e:NP1 2022 ప్రారంభంలో డాంగ్‌ఫెంగ్ హోండా, జి‌ఏ‌సి హోండా నుండి విక్రయించనుంది. 

రానున్న 5 సంవత్సరాలలోపు సేల్స్ ప్రారంభించాలనే లక్ష్యంతో ఈ మూడు కాన్సెప్ట్ మోడల్స్ అభివృద్ధి చేయనుంది. హోండా సంస్థ పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారాన్ని ప్రారంభించెందుకు  సిద్ధమవుతు చైనాలో సేల్స్ నెట్‌వర్క్‌ను మెరుగుపరచలని చూస్తుంది. ప్రస్తుతం ఉన్న డీలర్‌షిప్ లలో  e:N సిరీస్ ప్రారంభిస్తు, అలాగే ప్రముఖ నగరాల్లో మరింత ముందుకు వెళ్తూ e:N డీలర్‌షిప్ లను ప్రారంభించనుంది.  

2024లో ఉత్పత్తిని ప్రారంభించే లక్ష్యంతో జి‌ఏ‌సి హోండా, డాంగ్‌ఫెంగ్ హోండా రెండింటిలోనూ కొత్త ఈ‌వి ఉత్పత్తి కర్మాగారాలు నిర్మించనుంది. హోండా సెన్సింగ్ 360 అప్లికేషన్ ఒక ఓంనీ డైరెక్షనల్ అడ్వాన్స్డ్ డ్రైవర్-ఆసిస్టన్స్  సిస్టం (ADAS) 2022లో చైనాలో ప్రారంభమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తు 2030 నాటికి చైనాతో సహా ప్రపంచంలోని అన్ని ప్రధాన మార్కెట్లలో విక్రయించే అన్ని ఆటోమొబైల్ మోడళ్లకు అప్ప్లికేషన్  వర్తింపజేసేందుకు  ప్రయత్నిస్తుంది. 

ఈ సంవత్సరం ఏప్రిల్‌లో హోండా  ఎలెక్ట్రిఫికేషన్ లక్ష్యాన్ని ప్రకటించింది, చైనాతో సహా మొత్తం యూనిట్ అమ్మకాలలో ఈ‌విలు, ఎఫ్‌సి‌విల రేషియో 2030 నాటికి 40% కి, 2035 నాటికి 80% కి 2040 నాటికి 100% వరకు పెంచుతుంది. ఈ లక్ష్యాలను వేగంగా, స్థిరంగా సాధించడానికి చైనాలో 2030 తర్వాత హోండా ఇకపై  ఎలాంటి  కొత్త గ్యాసోలిన్-ఆధారిత మోడళ్లను ప్రవేశపెట్టదు అలాగే హెచ్‌ఈ‌విలు, ఈ‌విల వంటి మార్కెట్లోకి వచ్చే అన్ని కొత్త మోడళ్లను విద్యుదీకరిస్తుంది. 

click me!