కవాసకి లేటెస్ట్ స్పోర్ట్స్ టూరర్ బైక్ .. ఇప్పుడు సరికొత్త కలర్, ఎక్కువ వారెంటితో ఇండియాలోకి..

Ashok Kumar   | Asianet News
Published : Nov 01, 2021, 05:00 PM ISTUpdated : Nov 01, 2021, 05:01 PM IST

జపాన్ కి చెందిన కవాసకి మోటర్స్ (kawasaki motors)లిమిటెడ్ సబ్సిడరీ ఇండియా కవాసకి మోటార్ 2022 వేరియంట్ వెర్సిస్ 1000(versys 1000)ని దేశంలో విడుదల చేసింది. ఈ లీటర్-క్లాస్ స్పోర్ట్స్ టూరర్ (sports tourer)సింగిల్ వేరియంట్‌లో రూ.11.55 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులోకి వచ్చింది. 

PREV
14
కవాసకి  లేటెస్ట్ స్పోర్ట్స్ టూరర్ బైక్ .. ఇప్పుడు సరికొత్త కలర్, ఎక్కువ వారెంటితో ఇండియాలోకి..

ఇప్పుడు కవాసకి వెర్సిస్ 1000 క్యాండీ లైమ్ గ్రీన్ పెయింట్ స్కీమ్‌లో అందిస్తుంది, అయితే దేశవ్యాప్తంగా నవంబర్ మధ్య నుండి డెలివరీలు ప్రారంభమవుతాయి. ఈ కొత్త మోడల్ బైక్ ఎటువంటి పెద్ద మార్పులను పొందలేదు అలాగే ఒకే విధమైన ఇంజిన్ అండ్ సైకిల్ భాగాలతో వస్తుంది. ఇంకా మీ ఓనర్షిప్ అనుభవాన్ని మెరుగుపరచడానికి కొత్త కేర్ ప్యాకేజీ లభిస్తుంది.
 

24

ఎలాంటి కాస్మెటిక్ మార్పులు లేకుండా 2022 కవాసకి వెర్సిస్ 1000 ఇప్పుడు  డ్యూయల్-LED హెడ్‌ల్యాంప్‌లు, పొడవాటి విజర్, భారీ ఫెయిరింగ్, లాంగ్ స్ప్లిట్ సీట్లు మరింత సౌకర్యాన్ని పెంచుతుంది. ఈ బైక్ దేశంలో అత్యంత అందుబాటులో ఉన్న లీటర్-క్లాస్ ఆఫరింగ్స్ లో ఒకటిగా ఉంది. బి‌ఎస్6 కంప్లైంట్ 1043సి‌సి ఇన్-లైన్ ఫోర్-సిలిండర్ పవర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్  9,000ఆర్‌పి‌ఎం వద్ద 118 bhp, 7,500ఆర్‌పి‌ఎం వద్ద 102ఎన్‌ఎన్ గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. ఈ బైక్ కి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ ఇచ్చారు. అలాగే అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్‌ లభిస్తుంది. ముందు భాగంలో 150ఎం‌ఎంతో 43ఎం‌ఎం USD ఫ్రంట్ ఫోర్క్‌, వెనుక భాగంలో 152ఎం‌ఎం తో గ్యాస్-ఛార్జ్డ్ మోనోషాక్ లభిస్తుంది.
 

34

ఇతర ఫీచర్లలో సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్, క్రూయిజ్ కంట్రోల్, కవాసకి  కార్నరింగ్ మేనేజ్‌మెంట్ ఫంక్షన్, కవాసకి  ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ మరిన్ని లభిస్తాయి. బ్రేకింగ్ పనితీరుకోసం  ముందు వైపున ఉన్న డ్యూయల్ 310ఎం‌ఎం పెటల్ డిస్క్‌లు, ఏ‌బి‌ఎస్ తో పాటు వెనుక వైపున సింగిల్ 250ఎం‌ఎం పెటల్ డిస్క్ వస్తుంది. ఈ‌ బైక్ టూరింగ్-ఫ్రెండ్లీగా 21-లీటర్ ఇంధన ట్యాంక్‌తో 255 కిలోల బరువు ఉంటుంది.
 

44

కొత్త K-Care ప్యాకేజీకి సంబంధించి Versys 1000 ఒనర్ల్లు ఇప్పుడు నాలుగు సంవత్సరాల పాటు ఎక్స్టెండెడ్ వారంటీ, ఆన్యువల్ మైంటేనన్స్ కాంట్రాక్ట్  ప్రయోజనం పొందుతారు. దీనిని నెక్స్ట్ ఓనర్ కి కూడా బదిలీ చేయబడుతుంది. కవాసకి ఇండియా ఇతర ఆఫర్‌లపై కూడా K-కేర్ ప్యాకేజీని ఇస్తుంది.

click me!

Recommended Stories