Lamborghini: లంబోర్ఘిని అత్యంత పవర్ ఫుల్ సూపర్‌కార్.. కేవలం 2.8 సెకన్లలో 100 కి.మీ స్పీడ్..

First Published | Jun 16, 2022, 1:15 PM IST

లగ్జరీ స్పోర్ట్స్ కార్లు అండ్ ఎస్‌యూ‌విలను తయారు చేసే ఇటలీకి చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ లంబోర్ఘిని (Lamborghini) బుధవారం అవెంటడోర్ అల్టిమే రోడ్‌స్టర్ ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటాలియన్ దిగ్గజం నుండి ఐకానిక్ V12 సూపర్‌కార్  చివరి ఎడిషన్ ఇది. కంపెనీ ఈ కారును ప్రపంచవ్యాప్తంగా 600 యూనిట్లను మాత్రమే విక్రయించనుంది. భారతదేశంలో ఈ సూపర్‌కార్ ధర ఇంకా వెల్లడి కాలేదు.

 లంబోర్ఘిని 2011 జెనీవా మోటార్ షోలో అవెంటడోర్‌ను పరిచయం చేసింది. అప్పటి నుండి Aventador దాని ప్రత్యేకమైన స్టైలింగ్ అండ్ హౌలింగ్-మ్యాడ్ నేచురల్ V12 ఇంజిన్‌తో, అత్యంత ప్రసిద్ధ సూపర్ కార్లలో ఒకటిగా మారింది.


Giallo Auge కలర్ థీమ్‌లో లాంచ్ చేసిన లంబోర్ఘిని Aventador LP 780-4 Ultimae రోడ్‌స్టర్  సూపర్‌కార్ SVJ పనితీరును ఉపయోగిస్తుందని ఆటోమేకర్ పేర్కొంది. కూపే అండ్ రోడ్‌స్టర్ రూపాల రూపకల్పన అండ్ డైనమిక్‌లను కలిపి ఉంటుందని కూడా పేర్కొంది. 
 

ఇంజిన్ పవర్  769bhp (SVJ కంటే 10bhp ఎక్కువ) అండ్ 720Nm వేగంతో, Aventador చివరి ఎడిషన్ కూడా అత్యంత శక్తివంతమైనది. లంబోర్ఘిని  సింగిల్-క్లచ్ గేర్‌బాక్స్ ద్వారా శక్తి నాలుగు చక్రాలకు పంపబడుతుంది. Aventador Ultimae కేవలం 2.8 సెకన్లలో 0 నుండి 100 kmph స్పీడ్ అందుకుంటుంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 355 కి.మీ. ఇంకా అత్యంత వేగవంతమైన కార్లలో ఒకటిగా నిలిచింది.

లుక్ అండ్ డిజైన్
లంబోర్ఘిని అవెంటడార్ LP 780-4 అల్టిమా రోడ్‌స్టర్ స్టైలింగ్ మనసుకు హత్తుకునేలా ఉంటుంది. అంటే ముందు ఇంకా వెనుక భాగంలో కొత్త డిఫ్యూజర్ వంటి చిన్న మార్పులతో మరింత దూకుడుగా ఉండే సైడ్ స్కర్ట్‌ను కూడా పొందుతుంది. వెనుక ప్రొఫైల్ హురాకాన్ STOను అనుకరించే కొన్ని మిడ్-మౌంటెడ్ ఎగ్జాస్ట్‌లను పొందుతుంది. అలాగే, కార్బన్ ఫైబర్ రూఫ్ ప్యానెల్ ఆప్షన్ కూడా ఇందులో ఉంది. ఈ చిన్న ప్రత్యేకమైన స్టైలింగ్ అంశాలు సూపర్‌కార్‌కు దాని స్వంత ప్రత్యేక గుర్తింపును అందిస్తాయి. 
 


ఈ కారు కేవలం ఒక యూనిట్ మాత్రమే భారతదేశంలో విక్రయించబడుతుందని లాంబోర్గినీ ఇండియా చీఫ్ శరద్ అగర్వాల్ తెలిపారు.  మరికొన్ని యూనిట్లను భారత్‌కు పంపే చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. 

ధర ఎంత అంటే
పర్సనలైజేషన్ తర్వాత ఈ కారు ధర దాదాపు రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. "కస్టమర్లు ఈ కారు ధరలో 25 శాతం వరకు పర్సనలైజేషన్ పై ఖర్చు చేస్తారు. ఇది చాలా అరుదైన ఇంకా ప్రత్యేకమైన కారు, అవెంటేడర్ శ్రేణిలో చివరిది" అని ఆయన తెలిపారు.

Latest Videos

click me!