కేవలం 18 నిమిషాల్లో 80 % ఛార్జింగ్ అయ్యే కారు కావాలా? పూర్తి వివరాలు ఇవిగో

Published : Jan 18, 2025, 01:56 PM IST

ఎలక్ట్రిక్ కార్లు కొనాలంటే చాలా మందికి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే ఎక్కువ సేపు ఛార్జింగ్ పెట్టాలని. ఇంకోటేంటంటే ప్రయాణం మధ్యలో ఛార్జింగ్ అయిపోతే ఏం చేయాలి? ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ కేవలం 18 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్ అయ్యే ఓ కారు ఇండియాలో లాంచ్ అయ్యింది. ఆ కారు కంపెనీ, మైలేజ్, ప్రత్యేకతలు తెలుసుకుందామా?

PREV
14
కేవలం 18 నిమిషాల్లో 80 % ఛార్జింగ్ అయ్యే కారు కావాలా? పూర్తి వివరాలు ఇవిగో

తక్కువ టైమ్ లో ఛార్జింగ్, ఎక్కువ దూరం ప్రయాణించే కొత్త EV6 ఫేస్‌లిఫ్ట్‌ కారును కియా కంపెనీ తీసుకొచ్చింది. ఈ కారు గత ఏడాది అంతర్జాతీయంగా విడుదలైంది. EV6 ఫేస్‌లిఫ్ట్‌ను కియా ఇండియాలో లాంచ్ చేసింది. ఆటో ఎక్స్‌పో 2025లో ప్రదర్శించింది. బుకింగ్స్ ప్రారంభం కాగా, మార్చిలో అధికారిక లాంచ్, ధరలను ప్రకటిస్తారు.

 

24

Kia EV6 భారతదేశంలో 2022 నుంచే సేల్ అవుతోంది. అయితే ఈ మూడేళ్లలో కొత్త వెర్షన్ ఏమీ రాలేదు. ఇప్పుడు కియా EV6 కు అప్డేట్ వెర్షన్ తీసుకొచ్చింది. EV6 ఫేస్‌లిఫ్ట్‌ పేరుతో ఆటో ఎక్స్‌పో 2025లో ప్రదర్శించింది. ఈ కారులో ఉన్న ప్రత్యేక ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం రండి. 

ఫేస్‌లిఫ్టెడ్ కియా EV6 సొగసైన హెడ్‌లైట్లను కలిగి ఉంది. ట్రై యాంగిల్ LED DRLలు ఉండటంతో మరింత స్టైలిష్ లుక్ ని పొందింది. ఈ EV లుక్ అత్యంత వేగంగా దూసుకుపోయే రేస్ కారులా కనిపిస్తోంది. ముందు బంపర్ పై ఉన్న కట్‌ షేప్ స్టైలిష్ లుక్ ఇచ్చాయి. 

34
కియా EV6

ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్

కొత్త EV6 19-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, 12 అంగుళాల హెడ్స్ అప్ డిస్‌ప్లే (HUD)తో ఇందులో అమర్చారు. ఇది 15W వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) ఆధారిత నావిగేషన్, డిజిటల్ కీ ఫీచర్‌ కూడా ఈ కారులో ఉన్నాయి. 

కొత్త హెడ్‌లైట్లు, బంపర్, అల్లాయ్ వీల్స్, కొత్త డిజైన్‌తో EV6 వచ్చింది. స్టీరింగ్ వీల్, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్, మెరుగైన మెటీరియల్స్ కూడా ఇందులో ఉన్నాయి.

44

బ్యాటరీ, రేంజ్

84 kWh బ్యాటరీతో ఈ కారు తయారైంది. దీన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే 650 కి.మీ. రేంజ్ వరకు దూసుకుపోతుంది. 325 hp, 605 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 350 kW ఫాస్ట్ ఛార్జర్ వల్ల కేవలం 18 నిమిషాల్లో 10 % నుంచి 80 % ఛార్జ్ అవుతుంది. అందువల్ల మధ్యలో ఎక్కడైనా ఛార్జింగ్ అయిపోయినా ఎక్కువ సేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. 

click me!

Recommended Stories