తక్కువ ధర, ఎక్కువ మైలేజ్: ఆంపియర్ మాగ్నస్ నియో ఫీచర్స్ భలే ఉన్నాయ్

Published : Jan 17, 2025, 05:24 PM IST

ఆంపియర్ మాగ్నస్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చేసింది. దాని మునుపటి మోడల్ EX కంటే ఇందులో బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. తక్కువ ధరలో అధునాతన భద్రతా ఫీచర్లు కలిగిన నియో గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
తక్కువ ధర, ఎక్కువ మైలేజ్: ఆంపియర్ మాగ్నస్ నియో ఫీచర్స్ భలే ఉన్నాయ్

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) డిమాండ్ పెరుగుతోంది. సాంప్రదాయ పెట్రోల్ వాహనాలకు బదులుగా పర్యావరణ అనుకూలమైన సీఎన్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ ను ప్రజలు ఎంచుకుంటున్నారు. ఆంపియర్ మాగ్నస్ నియో ఎలక్ట్రిక్ వెహికల్ ప్రజల అవసరాలకు అనుగుణంగా తయారైంది. మాగ్నస్ నియో దాని మునుపటి EX వేరియంట్ కంటే ఆకర్షణీయమైన అప్‌గ్రేడ్‌లతో రెడీ అయ్యింది. ఈ కొత్త మోడల్ డెలివరీలు జనవరి 2025 చివరి నాటికి ప్రారంభమవుతాయని అంచనా.

25

మాగ్నస్ నియో ఫీచర్లు

2.3 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఉన్న మాగ్నస్ నియో ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించగలదు. 7.4 A ఛార్జర్‌తో బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 5 నుంచి 6 గంటలు పడుతుంది. గంటకు 53 కి.మీ. వేగంతో నడిచే EX వేరియంట్ లా కాకుండా మాగ్నస్ నియో గంటకు 63 కి.మీ. గరిష్ట వేగంతో దూసుకుపోతుంది. 

35

స్పెషల్ ఫీచర్లు

సౌకర్యం, భద్రత కోసం రూపొందించిన అధునాతన ఫీచర్లతో మాగ్నస్ నియో మార్కెట్లోకి వస్తోంది. దీని పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అధునాతన కనెక్టివిటీ ఎంపికలకు మద్దతు ఇస్తుంది. ఫైండ్ మై స్కూటర్, లైవ్ ట్రాకింగ్, యాంటీ-థెఫ్ట్ అలారం, టూ అలర్ట్‌లు వంటి ఫీచర్లు మీరు బండి నడుపుతుంటే ఆహ్లాదకరమైన అనుభవాన్ని పొందుతారు. ఇందులో USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది.

45

మాగ్నస్ నియో రేంజ్

ఇది ఎలాంటి రోడ్లపై ప్రయాణించడానికైనా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ స్కూటర్ నలుపు, నీలం, ఎరుపు, తెలుపు, బూడిద రంగుల్లో లభిస్తుంది. అందువల్ల ఇవి ఎలాంటి వారికైనా ఈజీగా నచ్చుతాయి. ఈ స్కూటర్ ఐదు సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల బ్యాటరీ వారంటీని కూడా అందిస్తుంది. పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి కనుక ఖర్చు గురించి ఆలోచించే వినియోగదారులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు చక్కటి పరిష్కారం. 

55

ధర ఎంతో తెలుసా?

ఓలా, ఏథర్ వంటి కంపెనీలు ఇప్పటికే తమ వినూత్న మోడళ్లతో ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. అయితే ఆంపియర్ రూ.79,999 ధరలోనే అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. జనవరి 2025 చివరి నాటికి డెలివరీలు ప్రారంభమవుతాయని అంచనా.

 

click me!

Recommended Stories