ఇప్పుడు, Keeway Sixties 300i ఇంకా Vieste 300 ధరలు అధికారికంగా వెల్లడయ్యాయి. ఈ రెండు స్కూటర్లను రూ. 2.99 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో లాంచ్ చేశారు.
ఇంజిన్ అండ్ డిజైన్
లుక్స్ అండ్ డిజైన్ పరంగా కీవే సిక్స్టీస్ 300i రెట్రో-క్లాసిక్ మోడల్. అయితే Keeway Vieste 300 ఆకర్షణీయమైన మ్యాక్సీ-స్కూటర్. ఈ రెండు స్కూటర్లు ఒకే 278.8cc, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను పొందుతాయి. ఈ ఇంజన్ 6,500 rpm వద్ద 18.7 hp శక్తిని, 6,000 rpm వద్ద 22 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. Kyway Sixties 300i 13-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లను పొందగా, Kyway Vieste 300 12-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లను పొందుతుంది.