2022 hyundai venue:హ్యుందాయ్ పాపులర్ ఎస్‌యూ‌వి వెన్యూ కొత్త లుక్ చూసారా.. వచ్చే నెలలోనే లాంచ్..

First Published | May 25, 2022, 12:43 PM IST

హ్యుందాయ్ ఇండియా  పాపులర్ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూ‌వి వెన్యూ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను జూన్ నెలలో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే, కార్ల తయారీ సంస్థ అఫిషియల్ లాంచ్ తేదీని ఇంకా ప్రకటించలేదు.  కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ (2022 hyundai venue) మోడల్ లైనప్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ స్పోర్టియర్ డిజైన్ తో కొత్త వెన్యూ ఎన్-లైన్ వేరియంట్‌ను పొందుతుంది.
 

కొనసాగుతున్న బుకింగ్‌లు
కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్  ఆన్ అఫిషియల్ బుకింగ్‌లు ఇప్పటికే సెలెక్ట్ చేసిన డీలర్‌షిప్‌లలో ప్రారంభమయ్యాయి. సబ్-కాంపాక్ట్ SUV కొన్ని కాస్మెటిక్ మార్పులు, ఫీచర్ అప్‌గ్రేడ్‌లతో వస్తుంది, అయితే ఇంజిన్-గేర్‌బాక్స్ చెక్కుచెదరకుండా ఉంటుంది. 

ఇంజిన్ అండ్ పవర్
కొత్త వెన్యూ ఫేస్‌లిఫ్ట్ 83PS శక్తిని ఉత్పత్తి చేసే 1.2-లీటర్  పెట్రోల్ ఇంజన్, 120PS శక్తిని ఉత్పత్తి చేసే 1.0-లీటర్ టర్బో పెట్రోల్ అండ్ 100PS శక్తిని ఉత్పత్తి చేసే 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో అందించే అవకాశం ఉంది. గేర్ ట్రాన్స్‌మిషన్  లో  ఎలాంటి మార్పు ఉండదు. అంటే, ఈ కారు గతంలో 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ IMT, 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందవచ్చు. 
 

లుక్  అండ్ డిజైన్ 
డిజైన్‌కి సంబంధించిన చాలా అప్‌డేట్‌లు కారు ముందు, వెనుక భాగంలో కనిపిస్తాయి, ఇవి హ్యుందాయ్  గ్లోబల్ SUV నుండి ప్రేరణ పొందాయి. హ్యుందాయ్ వెన్యూ 2022 సరికొత్త 'సెన్సుయస్ స్పోర్టినెస్' డిజైన్ లాంగ్వేజ్‌ని ఉపయోగిస్తుంది. ఫ్రంట్ లుక్ గురించి మాట్లాడుతూ మోడల్ పెద్ద, కొత్త పారామెట్రిక్ గ్రిల్ అండ్ కొత్త బంపర్‌ని పొందుతుంది. ప్రస్తుత మోడల్ లాగానే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌కు స్ప్లిట్ హెడ్‌ల్యాంప్‌లు, LED DRLలు, ఫాగ్ ల్యాంప్ అసెంబ్లీ లభిస్తాయి. 

కొత్త వెన్యూ రీడిజైన్ చేయబడిన అల్లాయ్ వీల్స్, అప్‌డేట్ చేయబడిన టెయిల్‌ల్యాంప్‌లు, ట్వీక్ చేయబడిన రియర్ బంపర్‌లను కూడా పొందుతుంది. హ్యుందాయ్ వెన్యూ N-లైన్ ఫ్రంట్ బంపర్  కింద భాగంలో రెడ్ పెయింట్, విభిన్నంగా డిజైన్ చేయబడిన అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ ఫెండర్‌లపై N-లైన్ బ్యాడ్జింగ్, డ్యూయల్-టిప్ ఎగ్జాస్ట్‌ను పొందుతుంది. రూఫ్ రైల్స్, ట్వీక్ చేయబడిన బ్యాక్ బంపర్, ఫ్రంట్ బ్రేక్ కాలిపర్‌లు దీనిని సాధారణ మోడల్ నుండి మరింత వేరు చేస్తాయి. వాహన తయారీ సంస్థ  కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్  ఇంటర్నల్ భాగాలను కొత్త థీమ్, సీట్ అప్హోల్స్టరీతో అప్‌డేట్ చేయవచ్చు.
 


ఫీచర్లు ఎలా ఉంటాయి
కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ Android Auto, Apple CarPlay కనెక్టివిటీతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కూడా రావచ్చు. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, బోస్ ఆడియో సిస్టమ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లను కూడా పొందవచ్చు. 

సేఫ్టీ ఫీచర్లు
ఈ సబ్-కాంపాక్ట్ SUV 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రియర్ పార్కింగ్ కెమెరా, ఎయిర్ ప్యూరిఫైయర్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లను పొందుతూనే ఉంటుంది. 

Latest Videos

click me!