Hyundai Cars : ఏమిటీ..! ఈ హ్యుందాయ్ కారుపై అక్షరాలా లక్ష రూపాయల డిస్కౌంటా.!!

Published : Jul 09, 2026, 01:32 PM ISTUpdated : Jul 09, 2026, 01:43 PM IST

మీరు హ్యుందాయ్ క్రెటా కారు కొనాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన సమయం. ఈ జూలై నెలలోనే మీరు ఈ కారును కొన్నారో ఏకంగా లక్ష రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

PREV
16
అందరి ఫేవరెట్ క్రెటాపై అదిరిపోయే డిస్కౌంట్

భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలలో హ్యుందాయ్ క్రెటా ఒకటి. ఇప్పటికే లక్షలాదిమంది ఈ కారును వాడుతున్నారు… ఎందరో మెచ్చిన, అందరికీ నచ్చిన కారు ఇది. ఇలాంటి సూపర్ కారు భారీ తగ్గింపు ధరకే వస్తే? ఎగబడి కొనడం ఖాయం. ఇప్పుడు ఇండియాలో అదే జరిగేలా ఉంది. 

ఈ జూలై నెలలో క్రెటా కార్ల అమ్మకాలను మరింత పెంచేందుకు హ్యుందాయ్ గట్టిగానే ప్లాన్ చేసింది… ఈ మోడల్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. స్పెషల్ ఆఫర్‌లో భాగంగా క్రెటా కొనుగోలుచేసే కస్టమర్లకు గరిష్ఠంగా లక్ష రూపాయల వరకు ప్రయోజనాలు లభిస్తాయి.

26
హ్యుందాయ్ క్రెటా పై ఆఫర్ ఎందుకు?

చాలాకాలంగా హ్యుందాయ్ క్రెటా అమ్మకాల్లో టాప్ లో ఉంది. అయితే ఇటీవల అమ్మకాల్లో స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ తన సెగ్మెంట్‌లో క్రెటా ఇప్పటికీ పటిష్ఠమైన స్థానంలోనే ఉంది. ఈ కాార్ల అమ్మకాల్లో ఊపు తగ్గకుండా ఉండాలంటే కస్టమర్లను ఆకర్షించాలి… అందుకే జూలైలో ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించినట్లు హ్యుదాయ్ ప్రతినిధులు చెబుతున్నారు. 

36
క్రెటా పెట్రోల్, డీజిల్‌ వేరియెంట్స్ పై వేర్వేరు ఆఫర్లు

హ్యుందాయ్ కంపెనీ క్రెటా పై అందిస్తున్న ఆఫర్స్ ఇలా ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్లపై గరిష్ఠంగా లక్ష రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అయితే డీజిల్ వేరియంట్లపై కేవలం రూ.10,000 వరకు మాత్రమే ప్రయోజనం ఉంటుంది. ఈ నెలలో హ్యుందాయ్ ఇస్తున్న అతిపెద్ద డిస్కౌంట్లలో ఇది కూడా ఒకటి.

46
క్రెటా 7 వేరియంట్లలో లభ్యం
హ్యుందాయ్ క్రెటా ప్రస్తుతం E, EX, S, S(O), SX, SX టెక్, SX(O) అనే ఏడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. బేస్ వేరియంట్ అయిన E మోడల్‌లో కూడా ప్రాథమిక డిజైన్ అంశాలు ఉన్నాయి. ముందు భాగంలో పెద్ద గ్రిల్, హ్యుందాయ్ లోగో, L-ఆకారపు DRLలు, హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు దీని ప్రధాన ఫీచర్లు. బేస్ మోడల్‌లో మాన్యువల్‌గా అడ్జస్ట్ చేసుకునే ORVMలు కూడా ఉన్నాయి.
56
క్రెటా బేస్ వేరియంట్ ఇంటీరియర్, ఫీచర్లు, సేఫ్టీ

బేస్ వేరియంట్‌లో ఇన్ఫోటెయిన్‌మెంట్ సిస్టమ్ ఉండదు. అందుకే స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్ కూడా లేవు. కానీ మాన్యువల్ ఏసీ, పవర్ విండోస్, ఫ్రంట్-రియర్ యూఎస్‌బీ పోర్ట్‌లు, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ప్రాథమిక సౌకర్యాలు ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్, రిమోట్ కీ, మాన్యువల్ ORVM అడ్జస్ట్‌మెంట్ వంటి ఫీచర్లు కూడా లభిస్తాయి.

ప్రయాణికులందరికీ 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు, రియర్ ఏసీ వెంట్స్, అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌లు వంటి సౌకర్యాలు ఉన్నాయి. టాప్ వేరియంట్లలో లెవల్-2 ADAS సహా 70కి పైగా సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. బేస్ మోడల్‌లో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి.

66
ఈ మోడల్స్ తో క్రెటా గట్టి పోటీ

భారత ఎస్‌యూవీ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా.. ఎంజీ ఆస్టర్, టయోటా హైరైడర్, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్, సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్ వంటి మోడళ్లతో గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ప్రస్తుత ఆఫర్‌తో క్రెటా మరింత మంది కస్టమర్లను ఆకర్షిస్తుందని ఆటోమొబైల్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

గమనిక 

ఇక్కడ వివరించిన డిస్కౌంట్లు వివిధ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సేకరించిన సమాచారంపై ఆధారపడి ఉంటాయి. ఈ డిస్కౌంట్లు రాష్ట్రం, నగరం, డీలర్‌షిప్, స్టాక్ లభ్యత, రంగు, వేరియంట్‌ను బట్టి మారవచ్చు. అంటే మీ నగరంలోని డీలర్ వద్ద ఈ ఆఫర్ ఎక్కువ లేదా తక్కువ ఉండొచ్చు. అందువల్ల కారు కొనే ముందు, కచ్చితమైన డిస్కౌంట్ వివరాల కోసం మీ సమీపంలోని స్థానిక డీలర్‌ను సంప్రదించడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories