టాటా సఫారి, ఎంజి హెక్టర్ కి పోటీగా హ్యుందాయ్ కొత్త కార్.. నేడ్ ప్రీ-బుకింగ్స్ ప్రారంభం..

First Published Jun 9, 2021, 6:33 PM IST

 దేశంలోని రెండవ అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా  రాబోయే ఆల్కాజార్ ఎస్‌యూవీ బుకింగ్‌లు అన్ని డీలర్‌షిప్‌లలో అధికారికంగా ప్రారంభమైనట్లు బుధవారం ప్రకటించింది. ఈ ఎస్‌యూవీని కొనాలనుకునే కస్టమర్లు ప్రీ-బుకింగ్ చేసుకోవడానికి రూ .25 వేలు చెల్లించాల్సి ఉంటుంది. 

హ్యుందాయ్ అల్కాజార్ భారతదేశంలో హ్యుందాయ్ మొట్టమొదటి మూడు-వరుస ఎస్‌యూవీ. భారతదేశంలో వాహనప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కొత్త 7 సీట్ల ఎస్‌యూవీ లాంచ్ పై కొంతకాలంగా వార్తల్లో వెలువడ్డాయి. అయితే కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా ఆల్కాజార్ లాంచ్ ని కంపెనీ చాలాసార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. చివరకి ఈ నెల చివరి నాటికి హ్యుందాయ్ అల్కాజార్ లాంచ్ కానున్నట్లు భావిస్తున్నారు. కొత్త కస్టమర్లతో పాటు హ్యుందాయ్ క్రెటా నుండి అప్‌గ్రేడ్ కావాలనుకున్న కొనుగోలుదారులను ఆకర్షించగలదని హ్యుందాయ్ అధికారులు చెబుతున్నారు.
undefined
మీడియా నివేదికల ప్రకారం, హ్యుందాయ్ అల్కాజార్ 6 సీట్ల లేదా 7-సీట్ల లేఅవుట్ ఆప్షన్ తో అందించబడుతుంది. 6 సీట్ల వేరియంట్ రెండవ వరుసలో కెప్టెన్ సీట్లు లభిస్తాయి. 7 సీట్ల వేరియంట్‌లో బెంచ్ సీటు ఉంటుంది. దీనిని హ్యుందాయ్ విభాగంలో అతిపెద్దదైన పెద్ద వీల్‌బేస్‌తో అందించబడుతుందని తెలిపారు. దీని వీల్‌బేస్ క్రెటా కంటే 150 ఎం‌ఎం పొడవు ఉంటుంది. పెద్ద వీల్‌బేస్ కారణంగా ప్రయాణికులకు మధ్య, చివరి వరుసలో కాళ్లు చాచడానికి ఎక్కువ స్థలాన్ని ఇస్తుంది. అంతేకాకుండా 180 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఇచ్చారు. మిడ్-రో కన్సోల్ ఆర్మ్‌రెస్ట్, స్లైడింగ్ సీట్లతో పాటు అనేక ఫీచర్ల కారణంగా ఆల్కాజర్‌ను ప్రీమియం ఉత్పత్తిగా అందించాలని కంపెనీ భావిస్తుంది.
undefined
వాహన తయారీ సంస్థ ప్రకారం హ్యుందాయ్ ఆల్కాజార్ ఎస్‌యూవీ బాడీ తయారు చేయడానికి 75.6% అధిక ధృడత్వం కలిగిన ఉక్కును ఉపయోగించారు. అంతే కాకుండా ఈ కారులో ఎకో, సిటీ అండ్ స్పోర్ట్ మోడ్ అనే మూడు డ్రైవ్ మోడ్‌లు లభిస్తాయి. అలాగే సంస్థ ప్రకారం వాహదారుడికి భిన్నమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
undefined
క్రెటా ఇంజిన్, మైలేజ్, స్పీడ్ ఆధారంగా అల్కాజార్ కారుని రెండు ఇంజన్ ఆప్షన్స్ లో అందించారు. మొదటిది థర్డ్ జనరేషన్ 2-లీటర్ పెట్రోల్ ఇంజన్, రెండవది 1.5-లీటర్ డీజిల్ ఇంజన్. ఇందులో, పెట్రోల్ ఇంజన్ 159 పిఎస్, 191 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది, డీజిల్ ఇంజన్ 115 పిఎస్, 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ రెండు ఇంజన్లలో చూడవచ్చు. 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్, ముఖ్యంగా సూపర్ ఫ్లాట్ టార్క్ కన్వర్టర్ కారణంగా మెరుగైన పనితీరును, అధిక మైలేజీని అందిస్తుందని హ్యుందాయ్ పేర్కొంది. కొత్త ఆల్కాజార్ ఎస్‌యూవీ కేవలం 10 సెకన్లలో 0 నుండి 100 కి.మీ వేగం అందుకోగలదని కంపెనీ పేర్కొంది.
undefined
హ్యుందాయ్ అల్కాజార్ ఎస్‌యూవీలో గొప్ప ఫీచర్లు ఇచ్చారు. ఈ కారులో పెద్ద 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 7.0-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, బ్లూలింక్ కనెక్టివిటీతో వాయిస్ రికగ్నిషన్, పనోరమిక్ సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగులు, వాహన స్థిరత్వం నిర్వహణ, ఐసోఫిక్స్ మౌంటెడ్ సీట్లు, హిల్ స్టార్ట్, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబిఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఇబిడి) వంటి చాలా ఫీచర్స్ ఉన్నాయి. హ్యుందాయ్ ఆల్కాజార్ ఎస్‌యూవీ ప్రస్తుతం ఉన్న టాటా సఫారి, ఎంజి హెక్టర్ ప్లస్, మహీంద్రా ఎక్స్‌యువి 500 మోడళ్లతో పోటీ పడుతుంది.
undefined
undefined
click me!