స్టెప్ 1
బ్రేక్ పెడల్‌ను పలుమార్లు గట్టిగా నొక్కండి… ఇది చివరగా చేసే ప్రయత్నం. బ్రేక్ పెడల్‌ను వదలకుండా 4, 5 సార్లు గట్టిగా పంప్ చేస్తే బ్రేకులు కొద్దిగా పనిచేసే ఛాన్స్ ఉంది.
స్టెప్ 2
ఇంజిన్ బ్రేకింగ్ వాడండి… బండి స్పీడ్ తగ్గించడానికి ఇది బెస్ట్ ఆప్షన్. కారు 5వ గేర్‌లో ఉంటే వెంటనే 4వ గేర్‌కు మార్చండి. ఆ తర్వాత నెమ్మదిగా 3, 2, 1 గేర్లకు డౌన్ చేయండి. గేర్లు తగ్గేకొద్దీ బండి స్పీడ్ కంట్రోల్ అవుతుంది.
స్టెప్ 3
బ్రేక్ ఫెయిల్ అయినట్లు గమనించగానే హజార్డ్ లైట్స్ (ఇండికేటర్లు) ఆన్ చేయండి…హారన్ గట్టిగా కొట్టండి. దీనివల్ల ఎదురుగా వచ్చే వాహనాలకు ప్రమాదం గురించి సిగ్నల్ వెళ్తుంది…వాళ్లు మీకు దారి ఇస్తారు. వెనక వచ్చేవారు కూడా అలర్ట్ అవతారు.
స్టెప్ 4
బండి స్పీడ్ 30 కి.మీ కంటే తక్కువకు వచ్చాకే హ్యాండ్ బ్రేక్ వాడండి. ఇంజిన్ బ్రేకింగ్ ద్వారా స్పీడ్ 30 కి.మీకి తగ్గాక, నెమ్మదిగా హ్యాండ్ బ్రేక్ లాగితే కారు ఆగిపోతుంది.
స్టెప్ 5
ఒకవేళ పక్కన లోయలు, ప్రమాదకరమైన ప్రాంతాలు ఉండి బండి ఆగకపోతే.. టైర్లను నెమ్మదిగా రోడ్డు పక్కన ఉండే మట్టి, ఇసుక, కంకర లేదా చిన్న పొదల వైపు తిప్పండి. ఆ రాపిడికి బండి స్పీడ్ వెంటనే తగ్గిపోతుంది.