Toyota Fortuner 2026: కొత్త ఫార్చ్యూనర్ ఫస్ట్ లుక్.. నెక్స్ట్ జనరేషన్‍లో అదిరే ఫీచర్లు

Published : Jul 20, 2026, 02:10 PM IST

Toyota Fortuner 2026: టయోటా ఫార్చ్యూనర్ నెక్స్ట్ జనరేషన్ మోడల్‍పై మరో ఇంట్రెస్టింగ్ అప్‍డేట్ వచ్చింది. సరికొత్త డిజైన్, ప్రీమియం ఇంటీరియర్, అడ్వాన్స్ డ్ టెక్నాలజీ ఫీచర్లు అప్‍డేటెడ్ సేఫ్టీతో ఈ SUV రానుందనే ప్రచారం జరుగుతోంది. వాటి గురించి చూద్దాం

PREV
14
మార్కెట్‍లో టయోటా ఫార్చ్యూనర్ నెక్ట్స్ జనరేషన్

టయోటా ఫార్చ్యూనర్ నెక్స్ట్ జనరేషన్ మోడల్‍పై మరో ఇంట్రెస్టింగ్ అప్‍డేట్ వచ్చింది. సరికొత్త డిజైన్, ప్రీమియం ఇంటీరియర్, అడ్వాన్స్ డ్ టెక్నాలజీ ఫీచర్లు అప్‍డేటెడ్ సేఫ్టీతో ఈ SUV రానుందనే ప్రచారం జరుగుతోంది. భారత SUV మార్కెట్‌లో టయోటా ఫార్చ్యూనర్ చాలా కాలంగా తన ఆధిపత్యాన్ని చూపిస్తోంది. ఇప్పుడు దీని నెక్స్ట్ జనరేషన్ మోడల్ రాబోతోందన్న వార్తలు ఆటోమొబైల్ రంగంలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా, నెక్స్ట్ జనరేషన్ టయోటా హైలక్స్ పికప్ ట్రక్‌లో చేయనున్న మార్పులనే కొత్త ఫార్చ్యూనర్‌లోనూ తీసుకురావచ్చని అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఈ రెండు వాహనాలు ఒకే IMV (ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ మల్టీ-పర్పస్ వెహికల్) ప్లాట్‌ఫామ్‌పై నిర్మితం కావడమే దీనికి కారణం.

24
న్యూ-జెన్ మోడ్రన్ లుక్‍తో రానున్న ఫార్చ్యూనర్
లీకైన సమాచారం ప్రకారం, నెక్స్ట్ జనరేషన్ ఫార్చ్యూనర్ ప్రస్తుత మోడల్ కన్నా షార్ప్, ప్రీమియం లుక్‌తో రానుంది. కొత్త హనీకోంబ్ ఫ్రంట్ గ్రిల్, స్లిమ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, రీడిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్, అప్‌డేటెడ్ ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్లు దీనికి సరికొత్త అందాన్ని ఇస్తాయని అంటున్నారు. టెస్టింగ్ సమయంలో తీసిన స్పై ఫొటోలను బట్టి కారు వెనుక భాగంలోనూ చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. కొత్త టెయిల్‌గేట్ డిజైన్, స్లిమ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్‌తో పాటు వాటిని కలుపుతూ ఒక లైట్ బార్‌ను కూడా అమర్చవచ్చు. అయితే, కారు సైజులో మాత్రం పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.
34
క్యాబిన్‍లో మరిన్ని ప్రీమియం ఫీచర్లు
కారు లోపల కూడా చాలా కొత్త అప్‌డేట్స్ ఉంటాయని అంచనా వేస్తున్నారు. 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఇందులో ఉండొచ్చు. వీటితో పాటు, టయోటా సేఫ్టీ సెన్స్ ఆధారిత ADAS టెక్నాలజీ, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్, పవర్-అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్లను కూడా జోడించవచ్చని సమాచారం.
44
ఇంజిన్‍లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు
పవర్‌ట్రెయిన్ విషయంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అంటున్నారు. ప్రస్తుతం ఇండియాలో అమ్ముడవుతున్న 2.7-లీటర్ పెట్రోల్, 2.8-లీటర్ డీజిల్, 2.8-లీటర్ నియో డ్రైవ్ మైల్డ్-హైబ్రిడ్ డీజిల్ ఇంజిన్లనే కొత్త మోడల్‌లోనూ కొనసాగించే అవకాశం ఉంది. అలాగే, 6-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. కొన్ని వేరియంట్లలో 4WD (ఫోర్-వీల్ డ్రైవ్) సిస్టమ్‌ను కూడా కొనసాగించవచ్చు. కొత్త తరం హైలక్స్, ఫార్చ్యూనర్ మోడళ్లపై వస్తున్న ఈ వార్తలు కస్టమర్లలో అంచనాలను పెంచేశాయి. అయితే, ఈ మోడళ్ల లాంచ్ తేదీ, డిజైన్, ఫీచర్ల గురించి టయోటా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి, ప్రస్తుతం బయటకు వచ్చిన ఈ వివరాలన్నీ స్పై ఫొటోలు, అంతర్జాతీయ మీడియా కథనాల ఆధారంగా వచ్చినవే. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.
Read more Photos on
click me!

Recommended Stories