టాటా పంచ్ గొప్ప ఫీచర్లు
టాటా పంచ్ ప్యూర్ వేరియంట్ లో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, 15-అంగుళాల వీల్స్, డ్యూయల్ డ్రైవ్ మోడ్, ఇంజిన్-స్టార్ట్ స్టాప్, 90-డిగ్రీల ఓపెనింగ్ డోర్స్, వెనుక ఫ్లాట్ ఫ్లోర్‌ను పొందుతుంది. ఈ వేరియంట్ వైట్, బూడిద రంగు ఆప్షన్స్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
దీని తరువాత అడ్వెంచర్ వేరియంట్ గురించి మాట్లాడితే ఇందులో ఉన్న ముఖ్యమైన ఫీచర్స్ 4-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ముందు, వెనుక పవర్ విండోస్, సెంట్రల్ రిమోట్ లాకింగ్ సిస్టమ్ లభిస్తుంది.
మూడవ వేరియంట్ అకంప్లీషెడ్ లో 7-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, రియర్ వ్యూ కెమెరా, వాయిస్ రికగ్నిషన్, పాసివ్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్, సిక్స్-వే సీట్ హైట్ అడ్జస్ట్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లను పొందుతుంది.
నాల్గవ వేరియంట్ క్రియేటివ్ రెడ్, బ్లూ ఇంకా డ్యూయల్ టోన్ కలర్ థీమ్‌లలో ప్రవేశపెట్టరు. దీనికి ప్రొజెక్టర్ హెడ్ లైట్లు, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్ లు, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఎలక్ట్రిక్ ఓఆర్‌విఎంలు, ఆటో టెంపరేచర్ కంట్రోల్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, లెదర్-ర్యాప్డ్ స్టీరింగ్, గేర్ నాబ్ ఇంకా ఐఆర్‌ఏ కనెక్ట్ టెక్నాలజీని పొందుతుంది.