Honda Activa : ఇండియాలో స్కూటర్ కొనాలనుకునే వారి లిస్ట్‌లో హోండా యాక్టివాకి ఎప్పుడూ స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఇది ఇంత పాపులర్ అవడానికి కారణమైన 5 ముఖ్య విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
కొత్త స్కూటర్ కొనాలనుకునేవారికి మొదట గుర్తొచ్చేది హోండా యాక్టివా… అంతలా ఇండియన్స్ మనసు గెలుచుకుంది. ఫ్యామిలీ వాడకం, ఆఫీసు ప్రయాణం, రోజువారీ పనులకు తగ్గట్టుగా ఉండటంతో చాలా మంది ఈ స్కూటర్ని ఎంచుకుంటున్నారు. దీని సేల్స్ నంబర్స్ కూడా ఇదే నిరూపిస్తున్నాయి.
2026 సెప్టెంబర్ నెలలో మాత్రమే హోండా యాక్టివా 3,52,271 యూనిట్లు అమ్ముడయ్యాయి. అదే సమయంలో రెండో ప్లేస్‌లో ఉన్న టీవీఎస్ జూపిటర్ 1,54,725 యూనిట్లు నమోదైంది. అంటే జూపిటర్ కంటే యాక్టివా సేల్స్ రెండు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ సక్సెస్ వెనుక సింపుల్ వాడకం, రోజువారీ అవసరాలకు తగ్గ ఇంజిన్, మెయింటెనెన్స్ లాంటి కారణాలు ఉన్నాయి.
25
గేర్లు మార్చాల్సిన పనిలేదు
యాక్టివాలో ఉన్న ముఖ్యమైన స్పెషాలిటీస్‌లో ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ఒకటి. ఇందులో గేర్లు మారుస్తూ పోవాల్సిన అవసరం లేదు. యాక్సిలరేటర్, బ్రేక్ వాడుతూ సులువుగా నడపొచ్చు. ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సిటీ రోడ్లపై పదేపదే గేర్లు మార్చే ఇబ్బంది లేకపోవడం చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. కొత్తగా స్కూటర్ నడపడం నేర్చుకునే వాళ్లకు కూడా ఈ సిస్టమ్ ఈజీ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఫ్యామిలీలో చాలా మంది ఒకే వెహికల్ని వాడినప్పుడు, ఈ సింపుల్ డ్రైవింగ్ మెథడ్ అదనపు సదుపాయంగా మారుతుంది. రోజూ ట్రావెల్ చేసే వాళ్లకు ఈ ఫీచర్ బెస్ట్ ఛాయిస్ అవుతుంది.
35
రోజువారీ వాడకానికి తగ్గ ఇంజిన్
హోండా యాక్టివాలో 109.51 సీసీ, సింగిల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజిన్ వాడుతున్నారు. ఈ ఇంజిన్ సిటీ ట్రావెల్, రోజువారీ వాడకాన్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశారు. స్మూత్ డ్రైవింగ్, ఈజీ కంట్రోల్ దీని మెయిన్ ఫీచర్స్. స్పీడ్‌గా వెళ్లడం కంటే, రోజూ ఆఫీస్‌కి, షాప్స్కి, ఫ్యామిలీతో ప్రయాణించడానికి తగ్గ వెహికల్ కోరుకునే వాళ్లకు ఇది కరెక్ట్‌గా సరిపోతుంది. అంతేకాకుండా యాక్టివా చాలా కాలంగా మార్కెట్లో ఉండటం వల్ల దీని వాడకం గురించి చాలా మంది కస్టమర్లకు ఎక్స్పీరియన్స్ ఉంది.
పెట్రోల్ రేట్లు పెరుగుతుండటంతో స్కూటర్ కొనేవాళ్లు మైలేజ్‌కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. 2025లో లాంచ్ చేసిన అప్‌గ్రేడెడ్ యాక్టివాలో ఐడ్లింగ్ స్టాప్ ఫీచర్ ఇచ్చారు. బండి కొన్ని సెకన్ల పాటు ఆగినప్పుడు ఇంజిన్ దానంతట అదే ఆగిపోయి, మళ్లీ యాక్సిలరేటర్ ఇచ్చినప్పుడు స్టార్ట్ అవుతుంది. దీనివల్ల వేస్ట్‌గా పెట్రోల్ ఖర్చవకుండా ఆదా అవుతుంది. హై-ఎండ్ హెచ్-స్మార్ట్ మోడల్లో 4.2 ఇంచుల టచ్‌స్క్రీన్, బ్లూటూత్ కనెక్టివిటీ, హోండా రోడ్‌సింక్ యాప్ ద్వారా నేవిగేషన్, కాల్, మెసేజ్ నోటిఫికేషన్లు, యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉన్నాయి. అయితే ఇవి అన్ని మోడల్స్‌లో దొరకవు.
55
సర్వీస్ ఫెసిలిటీ, సింపుల్ డిజైన్
యాక్టివా పాపులర్ అవడానికి దాని సింపుల్ డిజైన్ కూడా ఒక కారణం. ఎక్కువ హంగులు లేని లుక్, అన్ని వయసుల వాళ్లు వాడటానికి తగ్గట్టుగా ఉండటం దీని ఐడెంటిటీ. అంతేకాకుండా ఇండియాలో హోండాకు చాలా సేల్స్, సర్వీస్ సెంటర్లు ఉండటం వల్ల మెయింటెనెన్స్, స్పేర్ పార్ట్స్ దొరకడం చాలా మంది కస్టమర్లకు ఈజీగా ఉంటుంది.
అయితే రియల్ మైలేజ్ ట్రాఫిక్, నడిపే విధానం, రోడ్డు కండిషన్, వెహికల్ మెయింటెనెన్స్‌ని బట్టి మారుతుంది. అందుకే స్కూటర్ కొనేముందు దాని రేటు, మోడల్‌కి తగ్గ ఫీచర్లు, మైలేజ్, మీ అవసరాలను పోల్చి చూసుకోవడం మంచిది. ఈ ఫీచర్స్ వల్లే యాక్టివాకు ఇంత లాంగ్ టైమ్ రెస్పాన్స్ వస్తోంది.