Car Loan : సెలబ్రిటీలు భార్య పేరుపైనే కారు కొంటుంటారు.. ఎందుకో తెలుసా?

Published : Aug 31, 2026, 07:53 PM IST

పండగ సీజన్ వచ్చేసింది… ఈ టైమ్ లో మంచిమంచి ఆఫర్లు ఉంటాయి కాబట్టి చాలామంది కొత్త కారు కొంటుంటారు. మీరు కూడా దసరాకో లేదా దీపావళికో కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ పేరు మీద కాకుండా మీ భార్య పేరు మీద కొనండి. దీనివల్ల కలిగే లాభాలేంటో తెలుసా?

PREV
15
ఇంట్లోని ఆడవాళ్ల పేరుపై కారు కొంటే లాభాలేంటి?

బాగా డబ్బులుండే సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు సైతం తమ పేరుతో కాకుండా ఇంట్లోని ఆడవాళ్ల పేరుతో కొత్తకార్లు కొంటుంటారు. ఇలా భార్య, సోదరి లేదా తల్లి పేరు మీద కారు కొనడం వల్ల కొన్ని సందర్భాల్లో డబ్బు ఆదా చేసుకోవచ్చు. అయితే ఈ ప్రయోజనాలు అందరికీ ఒకేలా ఉండవు. బ్యాంకు ఆఫర్లు, లోన్ ప్లాన్, ఆయా రాష్ట్రాల నిబంధనలను బట్టి లాభాలు మారవచ్చు.

25
మహిళల పేరుతో కారు లోన్ తీసుకుంటే తక్కువ వడ్డీ

కొన్ని బ్యాంకులు మహిళా కస్టమర్ల కోసం ప్రత్యేక కార్ లోన్ ఆఫర్లు ఇస్తుంటాయి. వడ్డీ రేటులో తేడా కొంచెమే ఉన్నా ఎక్కువ సంవత్సరాల లోన్‌పై మొత్తం వడ్డీ భారం తగ్గుతుంది. కొన్ని బ్యాంకుల్లో 0.5% వరకు వడ్డీ తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు వడ్డీ 8.5% ఉంటే, మహిళ పేరు మీద కారు కొన్నప్పుడు అది 8% అవుతుంది. అయితే, లోన్ తీసుకునే ముందు బ్యాంకు ప్రస్తుత వడ్డీ రేట్లు, అర్హత నియమాలను చెక్ చేసుకోవడం ముఖ్యం.

35
డౌన్ పేమెంట్ కూడా తగ్గుతుంది

కొన్ని ప్రత్యేక లోన్ స్కీమ్‌లలో తక్కువ డౌన్ పేమెంట్ లేదా ఎక్కువ లోన్ అమౌంట్ పొందే అవకాశం ఉంటుంది. కొన్ని కంపెనీలు మహిళల పేరుతో కారు కొంటే జీరో డౌన్ పేమెంట్ సౌకర్యం కూడా కల్పిస్తాయి… అంటే రూపాయి కట్టకుండానే కారు ఇంటికి తీసుకెళ్లవచ్చు.అయితే మహిళల పేరు మీద కారు కొంటే అన్ని బ్యాంకులు జీరో డౌన్ పేమెంట్ ఇస్తాయని చెప్పలేం. బ్యాంకు నిబంధనలను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఐదు లక్షల డౌన్ పేమెంట్ కట్టే చోట 2.5 లక్షలు కడితే సరిపోయే అవకాశం ఉంటుంది.

45
ప్రాసెసింగ్ ఫీ కూడా తగ్గుతుంది

కొన్ని బ్యాంకులు లేదా ఆటోమొబైల్ కంపెనీలు మహిళా కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తాయి. వీటిలో తక్కువ ప్రాసెసింగ్ ఫీజు, ప్రత్యేక వడ్డీ రేటు లేదా వేగంగా లోన్ ప్రాసెస్ చేయడం వంటివి ఉంటాయి. అయితే ఇవి శాశ్వతమైన నియమాలు కావు. ఆ సమయానికి ఉన్న ఆఫర్లు, బ్యాంకు షరతులను చూసుకుని లోన్ తీసుకోవాలి.

55
రోడ్ ట్యాక్స్ తగ్గుతుంది

మహిళ పేరు మీద కారు రిజిస్టర్ చేస్తే రోడ్ ట్యాక్స్ కూడా తగ్గుతుంది… ఇది రాష్ట్రాన్ని బట్టి మారుతుంది. దాదాపు 2% నుంచి 10% వరకు రోడ్ ట్యాక్స్ తగ్గే అవకాశం ఉంది. అయితే కేవలం పన్ను ఆదా అవుతుందని మాత్రమే నిర్ణయం తీసుకోకండి. బ్యాంకు వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు, డౌన్ పేమెంట్, ఇన్సూరెన్స్, మీ రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత రోడ్ ట్యాక్స్ నియమాలను పోల్చి చూసుకున్నాకే మహిళల పేరుతో కారు కొనాలో వద్దో తుది నిర్ణయం తీసుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories