భారతదేశపు అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ హైపర్‌కార్.. అబ్బో దీని స్పీడ్ యమ హై..

First Published Oct 26, 2021, 9:20 PM IST

భారతీయ ఎలక్ట్రిక్ వాహనం స్టార్టప్ వజిరాణి ఆటోమోటివ్ (vajirani automotive) దేశంలోనే అత్యంత వేగవంతమైన సింగిల్-సీటర్ హైపర్‌కార్ ఎకాంక్ (ekonk)ను పరిచయం చేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కార్లలో ఇది కూడా ఒకటి అని కంపెనీ పేర్కొంది.

దీని లుక్ ఇంకా డిజైన్‌ స్పేస్‌షిప్‌ను పోలి ఉంటుంది, ఈ ఆల్-ఎలక్ట్రిక్ కారు లైట్ వెయిట్ ఎలక్ట్రిక్ హైపర్‌కార్. దీని మొత్తం బరువు 738 కిలోలు. 

ఎకాంక్ ఎలక్ట్రిక్ హైపర్‌కార్ (electric hypercar)ఈ‌వి స్టార్టప్  కొత్త వినూత్న బ్యాటరీని ఉపయోగిస్తుంది, ఇది ట్రెడిషనల్ కాంప్లెక్స్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజి భర్తీ చేస్తుంది. అలాగే డికో(dico) అనే టెక్నాలజి బ్యాటరీలను నేరుగా గాలి ద్వారా చల్లబరుస్తుంది. ఇంకా దీనికి లిక్విడ్ కూలింగ్ అవసరం ఉండదు. ఈ టెక్నాలజి ఈ ఎలక్ట్రిక్ కారును తేలికగా, వేగవంతమైన, సురక్షితమైన, ఏకనామికల్ గా  చేస్తుంది అని సంస్థ పేర్కొంది.
 

 కవర్ చేసిన బ్యాక్ వీల్స్ 
ఈ హైపర్‌కార్ బాడీ పూర్తిగా కార్బన్ ఫైబర్‌(carbon fibre)తో తయారు చేసింది, అందుకే  ఇది దీని బరువును తగ్గించడంలో సహాయపడింది. ఇది ఒక రకమైన వాహనం కోసం అత్యల్ప డ్రాగ్ సామర్థ్యంతో  అత్యంత ఏరోడైనమిక్ ఫ్లూయిడ్ కార్లలో ఒకటిగా రూపొందించింది. అందుకే కారు వెనుక చక్రాలు కప్పబడి ఉంటాయి. 

పవర్ అండ్ టాప్ స్పీడ్
ఎకాంక్ హైపర్ కార్  ఇంజన్ 722 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారణంగా దీని శక్తి ఇంకా బరువు నిష్పత్తిలో దాదాపు సమానంగా ఉంటుంది. ఇండోర్ సమీపంలో ఇటీవల ప్రారంభించిన నాక్స్‌ట్రాక్స్ హై-స్పీడ్ వెహికల్ టెస్టింగ్ సెంటర్‌లో వజిరానీ ఎండ్-టు-ఎండ్ తయారు చేసిన ఎలక్ట్రిక్ హైపర్‌కార్ కూడా పరీక్షించబడింది. ఇది గంటకు 309 కి.మీల గరిష్ట వేగాన్ని సాధించింది. ఈ కారు 2.54 సెకన్లలో 0 నుండి 100 kmph వేగాన్ని అందుకుంటుంది.
 

కంపెనీ షుల్  ప్రొడక్షన్ వెర్షన్‌లో ఎకాంక్ నుండి డేటా అండ్ టెక్నాలజి లెర్నింగ్స్ ఉపయోగిస్తుంది. యూ‌కేలో జరిగిన గుడ్‌వుడ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించిన భారతదేశపు మొట్టమొదటి హైపర్‌కార్ కాన్సెప్ట్ ఇది. వజిరానీ వినియోగదారులు కొనుగోలు చేయడానికి పరిమిత శ్రేణిలో ఎకాంక్ ని ఉత్పత్తి చేయవచ్చు. 2015లో వజిరానీ ఆటోమోటివ్‌ను ముంబైకు చెందిన చంకీ వజీరానీ స్థాపించారు. చంకీ గతంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన రోల్స్‌ రాయిస్‌, జాగ్వార్‌ లాంటి ఆటోమొబైల్‌ కంపెనీల్లో పనిచేశారు. సూపర్‌ఫాస్ట్‌ కార్ల తయారీలో భారత్‌ను ప్రపంచపటంతో నిలపాలనే లక్ష్యంతో కంపెనీ స్థాపించాడు. 
 

'ఎకాంక్ 'అర్థం
భారతీయ గ్రంథాలలో 'ఎకోంక్' అనే పదానికి అర్థం 'దైవిక కాంతికి ప్రారంభం' అని. ఈ ఎలక్ట్రిక్ వాహనం వాహన తయారీదారులకు కొత్త శకానికి నాంది పలికింది. వజిరాణి-ఆటోమోటివ్ వ్యవస్థాపకుడు అండ్ సి‌ఈ‌ఓ చంకీ వజిరాణి మాట్లాడుతూ, “ఎలక్ట్రిక్ వాహనాల రాకతో ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఖాళీ కాన్వాస్‌తో ప్రారంభించవలసి ఉంటుంది. భారతదేశం ఈ ఈ‌వి యుగంలో ఆవిష్కరణలు, అభివృద్ధి, మార్గదర్శకత్వం వహించాల్సిన సరైన సమయం ఇది."అని అన్నారు.
 

click me!