బ్యాన్ చేసిన మోడల్ రిలాంచ్.. ఇప్పుడు హై పవర్ తో జాగ్వార్ కొత్త లగ్జరీ సెడాన్..

First Published | Oct 26, 2021, 8:12 PM IST

బ్రిటిష్ మల్టీనేషనల్ కార్ బ్రాండ్ జాగ్వార్ (jaguar) భారతదేశంలో  కొత్త లగ్జరీ సెడాన్ కారు 2021 ఎక్స్‌ఎఫ్ ను విడుదల చేసింది అలాగే  దాని ధర కూడా ప్రకటించింది. కార్ల తయారీ సంస్థ 2021 ఎక్స్‌ఎఫ్  ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను పెద్దగా ఆర్భాటం లేకుండా లాంచ్ చేసింది. 

 జాగ్వార్ ఎక్స్‌ఎఫ్ 2021 ప్రారంభ ధర రూ. 71.60 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది,  టాప్-స్పెక్ ధర రూ. 76 లక్షలకు (ఎక్స్-షోరూమ్). జాగ్వార్ 2021 ఎక్స్‌ఎఫ్ లగ్జరీ సెడాన్  ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను రెండు ట్రిమ్‌లలో అందిస్తోంది. పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో రెండింటినీ R-డైనమిక్ S అని అంటారు.

ఇంజన్ అండ్ టాప్-స్పీడ్
జాగ్వార్ 2021 ఎక్స్‌ఎఫ్ లగ్జరీ సెడాన్ ఇంతకుముందు లాగానే 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఈ ఇంజన్ 247 bhp శక్తిని, 365 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 6.5 సెకన్లలో 0 నుండి 100 kmph వేగాన్ని అందుకోగలదు, గరిష్టంగా 250 kmph వేగంతో దూసుకుపోతుంది. 


డీజిల్ ఇంజిన్‌తో 
పెట్రోల్ ఇంజిన్‌తో పాటు జాగ్వార్ BS-VI కంప్లైంట్ డీజిల్ వెర్షన్‌లో కూడా అందించారు. కఠినమైన వాహన ఉద్గార నిబంధనల కారణంగా దీనిని గత సంవత్సరం నిలిపివేసారు, కానీ ఇప్పుడు కంపెనీ దాని ఇంజిన్‌ను అప్ డేట్ చేసింది. ఈ ఇంజన్ 201 bhp శక్తిని, 430 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వేరియంట్‌లో మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. జాగ్వార్ ఎక్స్‌ఎఫ్ డీజిల్ కేవలం 7.6 సెకన్లలో 100 kmph వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 235 కి.మీ.  జాగ్వార్ ఎక్స్‌ఎఫ్  పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్‌లలో 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉంది. 

కొత్త లుక్  అండ్ డిజైన్ 
2021 జాగ్వార్ ఎక్స్‌ఎఫ్ లుక్ అండ్ ఫీచర్ల విషయానికొస్తే టాటా మోటార్స్ యాజమాన్యంలోని బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ  కొన్ని చిన్న మార్పులు చేసింది. ఎక్ట్సీరియర్‌లో ఈ మార్పులను కారు గ్రిల్‌పై చూడవచ్చు. దీని సైజ్ పాత మోడల్ కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది ఇంకా దీనికి స్పోర్టీ లుక్‌ని అందించడానికి క్రోమ్ అవుట్‌లైన్‌ను కూడా పొందింది. J-ఆకారపు ఎల్‌ఈ‌డి ఎస్‌ఆర్‌ఎల్ లతో కొత్త ఎల్‌ఈ‌డి హెడ్‌లైట్‌ను పొందుతుంది. ఎల్‌ఈడీ టెయిల్‌లైట్‌లకు స్లీక్ రూపాన్ని అందించడానికి, కొత్త గ్రాఫిక్ డిజైన్‌తో పాటు కొన్ని మార్పులు చేసింది. ఇప్పుడు పెద్ద ఎయిర్ ఇన్‌టేక్‌ బంపర్‌లో కూడా చిన్న మార్పులు కనిపిస్తాయి.
 

కొత్త ఇంటీరియర్ అండ్ ఫీచర్లు
కొత్త జాగ్వార్ ఎక్స్‌ఎఫ్ ఇంటీరియర్‌లో కూడా చాలా మార్పులు కనిపిస్తాయి. ఇప్పుడు 11.4-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది,  ఇంకా లేటెస్ట్ Piwi ప్రోతో లోడ్ చేయబడింది అలాగే ఆపిల్ కార్ ప్లే, అండ్రాయిడ్ ఆటొ కి సపోర్ట్ చేస్తుంది. కొత్త స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లను కూడా పొందుతుంది.

బి‌ఎం‌డబల్యూ 5 సిరీస్ (BMW 5 series), మెర్సిడెస్ ఇ-క్లాస్ (mercedes e-class), ఆడి ఏ6 (audi A6) ఇటీవల విడుదల చేసిన వోల్వో  ఎస్90 (volvo S90) వంటి కార్లతో జాగ్వార్ ఎక్స్‌ఎఫ్ 2021 భారతీయ కార్ మార్కెట్లో పోటీపడుతోంది.  

Latest Videos

click me!