బైక్ రైడర్ల కోసం డుకాటి సరికొత్త మాన్‌స్టర్‌ బైక్.. దీని ధర, ఫీచర్లు, ఇంజన్ పవర్ వావ్ అనిపిస్తాయి..

First Published | Sep 23, 2021, 7:19 PM IST

ఇటలీకి చెందిన ప్రముఖ సూపర్ బైక్ తయారీ సంస్థ డుకాటి (ducati) గురువారం కొత్త మాన్‌స్టర్‌ రేంజ్ బైకులని  అధికారికంగా భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. వీటిలో డుకాటి మాన్‌స్టర్‌ని రూ.10.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో కంపెనీ  విడుదల చేసింది. డుకాటి మాన్‌స్టర్‌ ప్లస్ ఎక్స్-షోరూమ్ ధర రూ .11.24 లక్షలుగా నిర్ణయించారు. 

కొత్త డుకాటి మాన్‌స్టర్‌ బైకులు అత్యంత తేలికైనవి ఇంకా అత్యంత కాంపాక్ట్ అని సంస్థ పేర్కొన్నాయి. దీనితో పాటు ఈ కొత్త బైక్‌లు గొప్ప రైడింగ్ అనుభవాన్ని అందిస్తాయిని కంపెనీ వాగ్దానం చేసింది.

తేలికైన బైక్
ఈ బైక్ బరువు 166 కిలోలు,  పాత ట్రేల్లిస్ చాసిస్ కంటే తేలికైన ఫ్రేమ్‌ని కలిగి ఉందని ఇంకా పాత చాసిస్ కంటే కొత్త చాసిస్ 60 శాతం తేలికైనదని డుకాటి పేర్కొంది. 
లక్షణాలు
 

ఫీచర్స్

కొత్త మాన్‌స్టర్‌ బైక్ ని పూర్తిగా రిడిజైన్ చేసి నిర్మించినట్లు డుకాటి పేర్కొంది. దీనికి షోల్దార్ ఎంబెడెడ్ రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు, బిసన్ బ్యాక్ ఇన్‌స్పైర్డ్ చంకీ ఫ్యూయల్ ట్యాంక్, క్లీన్ టెయిల్ సెక్షన్, సెంటర్ పొజిషన్ ఇంజిన్ వంటి సిగ్నేచర్ మాన్‌స్టర్‌ డిజైన్ ఎలిమెంట్‌లను పొందుతుంది. మొత్తం మీద బైక్ లుక్ మస్కులర్ అండ్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. 

కొత్త డుకాటి మాన్‌స్టర్‌ డుకాటి రెడ్, డార్క్ స్టీల్త్‌తో బ్లాక్ వీల్స్, ఏవియేటర్ గ్రేతో జిపి రెడ్ వీల్స్ తో వస్తుంది. మరోవైపు, మాన్‌స్టర్‌ ప్లస్ వెర్షన్ కూడా ఇలాంటి రంగులలో లభిస్తుంది. అలాగే దీనికి ఏరోడైనమిక్ విండ్‌షీల్డ్ అండ్ బ్యాక్ సీటు కవర్‌  ప్రామాణిక ఫిట్‌మెంట్‌గా పొందుతుంది. 


ఇంజన్ అండ్ పవర్

ఈ బైక్ కి డెస్మోడ్రోమిక్ టెక్నాలజీతో కొత్త టెస్టాస్ట్రెట్టా 11°, 937సి‌సి L-twin ఇంజిన్‌ అందించారు. ఈ ఇంజిన్ పాత ఇంజిన్ కంటే మెరుగైన పవర్, టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో ఇచ్చిన కొత్త ఇంజన్ ఇప్పుడు 9,250ఆర్‌పి‌ఎం వద్ద 111హెచ్‌పి శక్తిని, 6,500ఆర్‌పి‌ఎం వద్ద 93ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 

మొదటి మాన్‌స్టర్‌ బైకుని 1993 లో ప్రవేశపెట్టారు
మాన్‌స్టర్‌ రేంజ్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ డుకాటి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ బిపుల్ చంద్ర మాట్లాడుతూ, "బోర్గో పనిగేల్ ప్రజలకు కొత్త మాన్‌స్టర్‌ బైక్ నిజమైన స్టార్. బోర్గో పనిగాలే ఇటలీలోని ఒక ప్రసిద్ధ పారిశ్రామిక నగరం. డుకాటి చరిత్రలో ఇతర బ్రాండ్స్ లాగా గుర్తించబడిన బ్రాండ్ పేరు, డుకాటి మాన్‌స్టర్‌ ని 1993లో ప్రవేశపెట్టినప్పటి నుండి 350,000 బైక్స్ విక్రయిస్తూ, అల్ టైం అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా మారింది."  అని అన్నారు.

కొత్త మాన్‌స్టర్‌ ఒక సరికొత్త బైక్ అని బిపుల్ చంద్ర చెప్పారు, గతంలో కంటే స్పోర్టియర్‌గా, తేలికగా, సులభంగా ప్రయాణించేలా రూపొందించారు. ఇంకా కొత్త రైడర్‌లకు, అనుభవజ్ఞులైన వారికి అందుబాటులో ఉండేలా చేస్తుంది. 

మెరుగైన హ్యాండ్లింగ్
నేకెడ్ స్ట్రీట్‌ఫైటర్‌లో స్పోర్టీ ఇంజిన్ ఉందని, సూపర్ బైక్‌ల కోసం రూపొందించిన ఫ్రేమ్‌తో నిర్మించబడిందని పేర్కొన్నారు. ఇది మాన్‌స్టర్‌ 900 లాగానే ఉంటుంది. ఇంకా రైడర్‌కు మరింత సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్‌ను అలాగే ఈ బైక్  మెరుగైన హ్యాండ్లింగ్ అందిస్తుంది.
 

Latest Videos

click me!