పెట్రోల్, డీజిల్ మర్చిపొండి !: ఇప్పుడే మీ పాత కారు ఎలక్ట్రిక్ కారుగా మార్చేయండి..

First Published | Sep 23, 2021, 3:41 PM IST

 సామాన్యులు ఇప్పటికే ద్రవ్యోల్బణంతో బాధపడుతుండగా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనాల వినియోగాన్ని కష్టతరం చేశాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రజలు పెట్రోల్, డీజిల్ వాహనాలను ఇంటి నుండి బయటకు తీసుకువెళ్లే ముందు చాలాసార్లు ఆలోచించాల్సి వస్తుంది. 

మరోవైపు ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల (ఈ‌వి) కి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా కొత్త కొత్త విదేశీ కంపెనీలు కూడా భారతదేశంలోకి ప్రవేశిస్తున్నాయి. 

2025 నాటికి మొత్తం వాహనాల అమ్మకాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 25 శాతానికి చేరుకుంటుందని దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తెలిపింది. అయితే మధ్యతరగతి వినియోగదారులకు ఎలక్ట్రిక్ కారు కొనడం ఇప్పటికీ చాలా ఖరీదైన విషయం. దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు టాటా నెక్సాన్ ఈ‌వి ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ .14 లక్షలు. 


మీ పాత పెట్రోల్, డీజిల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చండి
 కొత్త ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసేంత బడ్జెట్‌ లేకపోతే మీరు మీ పాత పెట్రోల్ లేదా డీజిల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చవచ్చు. అవును మీరు విన్నది నిజమే ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాలను తయారు చేసే  కంపెనీలు పాత పెట్రోల్-డీజిల్ కార్లను ఎలక్ట్రిక్ కార్లుగా మార్చడానికి కృషి చేస్తున్నాయి. దీనితో పాటు వారు కన్వర్టెడ్ ఎలక్ట్రిక్ కారుపై వారంటీని కూడా ఇస్తారు. దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎలక్ట్రిక్ కారు   డ్రైవింగ్ పరిధి  ఎంత ఉంటుందో మీకోసం. దీనితో పెట్రోల్ కారుని పోలిస్తే ఎలక్ట్రిక్ కారును ఉపయోగించడానికి రోజూ ఎంత ఖర్చవుతుంది తెలుసుకుందాం..

ఏ కారుని ఎలక్ట్రిక్ కారుగా మార్చవచ్చు

పాత పెట్రోల్ లేదా డీజిల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చడానికి పనిచేస్తున్న చాలా కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయి. వాటిలో ఈట్రియో(eTrio), నార్త్ వేఎం‌ఎస్ (NorthwayMS) రెండు ప్రసిద్ధ కంపెనీలు. ఈ రెండు కంపెనీలు ఏదైనా పెట్రోల్ లేదా డీజిల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మారుస్తాయి. మీరు వ్యాగన్ఆర్, ఆల్టో, డిజైర్, ఐ10, స్పార్క్ లేదా ఏదైనా ఇతర పెట్రోల్ లేదా డీజిల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చవచ్చు. కార్లలో ఉపయోగించే ఎలక్ట్రిక్ కిట్లు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. అయితే పరిధి, శక్తిని పెంచడానికి బ్యాటరీ ఇంకా మోటారు మధ్య వ్యత్యాసం ఉండవచ్చు. మీరు ఈ కంపెనీలను వారి అధికారిక వెబ్‌సైట్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను కూడా విక్రయిస్తాయి. 


ఎంత ఖర్చు అవుతుంది

మోటార్, కంట్రోలర్, రోలర్ ఇంకా బ్యాటరీ ఏదైనా కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చడానికి ఉపయోగిస్తారు. కారును ఎలక్ట్రిక్‌గా మార్చడానికి అయ్యే ఖర్చు ఎన్ని కిలోవాట్ల (kW) బ్యాటరీ, ఎన్ని కిలోవాట్ల మోటారు ఇన్‌స్టాల్ చేయాలనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు భాగాలు కారు శక్తి, డ్రైవింగ్ పరిధిపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు ఒక కారుకు దాదాపు 20 kW విద్యుత్ మోటార్, 12 kW లిథియం-అయాన్ (Li-ion) బ్యాటరీని అమర్చినట్లయితే దాని ధర సుమారు రూ .4 లక్షలు. అలాగే, 22 kW బ్యాటరీ ఇన్‌స్టాల్ చేస్తే దాని ధర సుమారు రూ .5 లక్షలు అవుతుంది. 
 

డ్రైవింగ్ పరిధి

ఎలక్ట్రిక్ కారు డ్రైవింగ్ రేంజ్ అనీది దానిలో ఎన్ని kWh బ్యాటరీ ఉపయోగించబడుతుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, 12 kWh లిథియం-అయాన్ బ్యాటరీ కారులో ఇన్‌స్టాల్ చేస్తే కనుక  పూర్తి ఛార్జ్‌లో దాదాపు 70 కి.మీ వస్తుంది.  22 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ఇన్‌స్టాల్ చేస్తే  కారు డ్రైవింగ్ పరిధి 150 కి.మీకి పెరుగుతుంది. పరిధిని ఎక్కువ లేదా తక్కువ పొందడంలో మోటారు పాత్ర కూడా ఉంది. మోటార్ మరింత శక్తివంతమైనది అయితే కారు డ్రైవింగ్ పరిధి తగ్గిపోతుంది. 
 

కారును ఎలా మార్చాలి

పెట్రోల్-డీజిల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చినప్పుడు పాత మెకానికల్ భాగాలన్నీ భర్తీ చేయబడతాయి. అంటే కారు ఇంజిన్, ఇంధన ట్యాంక్, ఇంజిన్‌కు కేబుల్, ఇతర భాగాలతో ఎయిర్-కండీషన్ కనెక్షన్ కూడా మార్చబడుతుంది. ఈ భాగాలన్నీ మోటార్, కంట్రోలర్, రోలర్, బ్యాటరీ ఇంకా ఛార్జర్ వంటి ఎలక్ట్రిక్ భాగాలతో భర్తీ చేయబడతాయి. నివేదిక ప్రకారం ఈ పనిని పూర్తి చేయడానికి కనీసం ఏడు రోజులు పడుతుంది. అన్ని భాగాలు కారు బోనెట్ కింద అమర్చబడి ఉంటాయి. అలాగే బ్యాటరీ లేయర్ కారు చాసిస్ పై స్థిరంగా ఉంటుంది. బూట్ స్పేస్ పూర్తిగా  ఫ్రీగా ఉంటుంది. అదేవిధంగా ఇంధన ట్యాంక్‌ను తీసివేసిన తర్వాత ఫ్యూయల్  క్యాప్ పై ఛార్జింగ్ పాయింట్ ఇన్‌స్టాల్ చేయబడుతుంది. కారు మోడల్‌లో ఎలాంటి మార్పు ఉండదు. 

కారు డ్రైవింగ్ ఖర్చు

మీ పెట్రోల్ లేదా డీజిల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చడానికి మీరు రూ. 5 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ మీరు 5 సంవత్సరాలలోపు ఈ డబ్బును తిరిగి పొందుతారు. ఎలక్ట్రిక్ కారు 75 కి.మీ.ల పరిధిని అందిస్తుంది. ఈ విధంగా మీరు ఛార్జింగ్ కోసం ప్రతి నెలా రూ .1120 మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. పెట్రోల్‌పై నెల ఖర్చు రూ. 10090 ఉంటుంది.
 

ఒక ఎలక్ట్రిక్ కారు ఒక కి.మీ ప్రయాణం కోసం కేవలం 74 పైసలు మాత్రమే ఖర్చు అవుతుంది . ఈ విధంగా మీరు 74 రూపాయలతో 100 కి.మీ ప్రయాణించవచ్చు. అయితే నేటి కాలంలో పెట్రోల్ ధర లీటరుకు రూ.74దాటి సెంచెరికి పైగా  నమోదైంది. 

కంపెనీ వారంటీ

పెట్రోల్ లేదా డీజిల్ కారుని ఎలక్ట్రిక్ కార్లగా తయారు చేసే కంపెనీలు కూడా 5 సంవత్సరాల వారంటీని ఇస్తాయి. అంటే, కారులో ఉపయోగించే కిట్ పై మీద అదనపు ఖర్చు ఉండదు. దీనితో పాటు, కంపెనీ బ్యాటరీపై 5 సంవత్సరాల వారంటీని కూడా ఇస్తుంది. పెట్రోల్, డీజిల్ కారు నడపడానికి వార్షిక సర్వీసింగ్ ఖర్చు కూడా ఉండదు. కిట్, అన్ని భాగాల కోసం కంపెనీ వారంటీ సర్టిఫికేట్‌లను కూడా అందిస్తుంది. దీనిని ప్రభుత్వం, ర్త్య్పద్వారా ఆమోదించబడింది. 
 

Latest Videos

click me!