దేశంలోని మొట్టమొదటి బ్లూటూత్ & స్మార్ట్‌ఫోన్ యాప్ కనెక్ట్ ఈ-సైకిల్.. ధర, ఫీచర్లు మీకోసం..

Ashok Kumar   | Asianet News
Published : Dec 27, 2021, 10:33 PM IST

హీరో సైకిల్స్  ఎలక్ట్రిక్ సైకిల్ విభాగం హీరో లెక్ట్రో రెండు కొత్త ఎలక్ట్రిక్ మౌంటైన్ సైకిల్స్ (electric mountain cycles)  F2i అండ్ F3iని విడుదల చేసింది. సిటీ ట్రాక్‌లతో పాటు ఆఫ్-రోడ్ ట్రాక్‌లపై సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని అందించేలా ఈ సైకిల్ లను రూపొందించారు. 

PREV
14
దేశంలోని మొట్టమొదటి బ్లూటూత్ & స్మార్ట్‌ఫోన్ యాప్ కనెక్ట్ ఈ-సైకిల్..  ధర, ఫీచర్లు మీకోసం..

ఈ సైకిల్స్‌తో అడ్వెంచర్ రైడ్ కోసం వెతుకుతున్న యువ రైడర్‌లను ఆకర్షించాలని కంపెనీ కోరుకుంటోంది.F2i ధరను రూ.39,999గా అలాగే F3i ధరను రూ.40,999గా కంపెనీ నిర్ణయించింది. 

గొప్ప ఫీచర్లు
హీరో లెక్ట్రో e-MTB మౌంటెన్-బైకింగ్ సెగ్మెంట్‌లో దేశంలోని మొట్టమొదటి కనెక్ట్ చేయబడిన ఇ-సైకిల్ అని పేర్కొన్నారు. అంటే బ్లూటూత్ అండ్ స్మార్ట్‌ఫోన్ యాప్ కనెక్టివిటీతో అమర్చబడి ఉంటాయి, రైడర్‌లు వారి రైడ్ సమాచారాన్ని ఎప్పుడైనా యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తాయి. ఈ ఇ-బైక్‌లు RFID బైక్ లాక్‌తో రక్షించబడుతుంది.

24

డ్రైవింగ్ రేంజ్
హీరో F2i అండ్ హీరో F3i రెండూ ఫుల్ ఛార్జింగ్ పై 35 కి.మీల వరకు ప్రయాణాన్ని అందిస్తాయి. అన్ని రకాల రైడింగ్ అవసరాలను తీర్చడానికి 7 స్పీడ్ గేర్లు, 100 mm సస్పెన్షన్, 27.5-అంగుళాల అండ్ 29-అంగుళాల డబుల్ అల్లాయ్ రిమ్స్ ఇంకా డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లతో అమర్చబడి ఉంటాయి. SAWAR హీరో లెక్ట్రో సి‌ఈ‌ఓ ఆదిత్య ముంజాల్ మాట్లాడుతూ, "F2i ఇంకా F3iలు MTB కేటగిరీలో భారతదేశం  మొట్టమొదటి కనెక్ట్ చేయబడిన ఇ-సైకిల్స్ అండ్ హీరో లెక్ట్రోలో మేము కొత్త ఇంకా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లో ఆవిష్కరణలకు నాయకత్వం వహిస్తున్నందుకు గర్విస్తున్నాము."అని అన్నారు.
 

34

4 డ్రైవింగ్ మోడ్‌లు
ఈ రెండు మౌంటెన్ ఇ-బైక్‌లు అధిక సామర్థ్యం గల 6.4Ah IP67 రేటెడ్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ బ్యాటరీతో అమర్చబడి ఉంటాయి, ఇంకా 250W BLDC మోటార్ నుండి అధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో రైడర్లు నాలుగు మోడ్‌ల ఆపరేషన్‌ను పొందుతారు. ఈ మోడ్‌లు - పెడెలెక్ (pedelec) 35 కిమీ పరిధితో, థ్రాటిల్ (throttle) 27 కిమీ పరిధితో, క్రూయిజ్ కంట్రోల్ (cruze control), మాన్యువల్ (manual). సైకిల్‌పై ఉన్న స్మార్ట్ ఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఉపయోగించి ఒక మోడ్ నుండి మరొక మోడ్‌కి మారవచ్చు.

44

లభ్యత
హీరో F2i ఇంకా హీరో F3i ఎలక్ట్రిక్-MTB 600 కంటే ఎక్కువ మంది హీరో లెక్ట్రో  నెట్‌వర్క్, చెన్నై ఇంకా కోల్‌కతాలోని బ్రాండ్  ప్రత్యేక ఎక్స్పీరియన్స్ కేంద్రాలు ఇంకా జోన్‌లు అలాగే  ఇ-కామర్స్ భాగస్వాముల ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. 

click me!

Recommended Stories